డ్రగ్స్ బారిన పడి మీ విలువైన జీవితం పాడుచేసుకోవద్దు మంగళగిరి ఎస్ఈబి సిఐ మారయ్య బాబు.

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


డ్రగ్స్ బారిన పడి మీ విలువైన జీవితం పాడుచేసుకోవద్దు మంగళగిరి ఎస్ఈబి సిఐ మారయ్య బాబు.వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీ హాస్టల్స్ నందు జిల్లా ఎస్పీ ఆరీఫ్ హాఫీజ్ అదేశాల మేరకు రెండో రోజు తనిఖీలను ఎస్ఈబి సిఐ మారయ్య బాబు నేతృత్వంలో శోదాలను నిర్వహించారు. నిషేదిత గంజాయి సప్లయి చేస్తున్నారనే సమాచారం మేరకు దాడులు చేపట్టినట్లు సిఐ మారయ్య తెలిపారు. విద్యార్థులు గంజాయి బారిన పడకుండా ఉండాలని, ఈ పరిసర ప్రాంతాల్లో విక్రయాలు చేసినట్లు కానీ సేవిస్తునట్లు కానీ సమాచారం ఉంటే తమకు సమాచారం అందజేయాలని ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో ఎస్ఈబి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు