సమాజానికి మనకు తోచిన మేరకు చేయూత నివ్వడం ద్వారా మరికొందరికి స్ఫూర్తిగా నిలవాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.

కోవ్వూరు  (ప్రజా అమరావతి);


సమాజానికి మనకు తోచిన మేరకు చేయూత నివ్వడం ద్వారా మరికొందరికి స్ఫూర్తిగా నిలవాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.



సోమవారం స్థానిక మునిసిపల్ కార్యాలయంలో వర్షిణి ట్రస్ట్ బహుకరించిన ఫాగ్ యంత్రాన్ని  మంత్రి మునిసిపల్ చైర్ పర్సన్ బావన రత్నకుమారి తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి తానేటి వనిత మా ట్లాడుతూ, మాజీ శాసనమం డలి సభ్యులు కోడూరి శివరామకృష్ణ గారి కుమారుడు శ్రీనివాస్ కొవ్వూరు మునిసిపాలిటీ కి ఉచితంగా ఫాగ్ మిషన్ ను అందచేయ్యడం జరిగిందన్నారు. ప్రభుత్వం, అధికారులే అన్ని పనులు చెయ్యాలనే ఆలోచన అన్ని సమయాల్లో కుదరని, మనకు అవకాశం ఉన్నంత మేరకు సమాజ సేవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.  కోడూరి శ్రీనివాస్ ను ఈ సందర్భంగా అభినందిస్తున్నానని మంత్రి తెలిపారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. మురుగునీటి వలన దోమలు చేరే అవకాశాలున్నాయని, ప్రజలందరూ స్వచ్చ కొవ్వూరు దిశలో భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు.   శ్రీనివాస్ వంటి వ్యక్తులు నేటి సమాజానికి అవసరం ఎంతైనా ఉందని, వీరిని చూసి మరో నలుగురు స్ఫూర్తి పొందుతారనడంలో సందేహం లేదన్నారు. ఫాగ్ యంత్రం ద్వారా దోమల నివారణ చర్యలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఇటువంటి పరికరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్పర్శన్, బావన రత్నకుమారి, మునిసిపల్ వైస్ చైర్మన్లు మన్నే పద్మ, గండ్రోతు అంజలి దేవి,  మునిసిపల్ కమీషనర్, టి. రవి కుమార్, ఆర్. భాస్కర రావు, కె. రమేష్, కౌన్సి లర్ లు 

తదితరులు పాల్గొ న్నారు.





Comments