తాడేపల్లి (ప్రజా అమరావతి); కె.ఎల్.విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ కాలేజ్ విభాగం ఆధ్వర్యంలో ఫలితాల ఆధారిత విద్య పేరిట నాలుగు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమని ఉపకులపతి డాక్టర్ సారధి వర్మ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఫలితాల ఆధారిత విద్య అనేది విద్యా వ్యవస్థలోని ప్రతి భాగాన్ని లక్ష్యాల చుట్టూ ఆధారం చేసుకునే విద్యా సిద్ధాంతమ
ని అన్నారు. విద్యా ముగిసే సమయానికి, ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని సాధించాలని స్పష్టం చేశారు.విద్యార్థులకు వారు ఏమి చదవాలనుకుంటున్నారు, వారు దానిని ఎలా అధ్యయనం చేయాలనుకుంటున్నారు అనేదాన్ని ఎంచుకోవడానికి ఫలిత ఆధారిత విద్య ఉపయోగపడుతుందని అన్నారు.విద్యార్థి యొక్క బలాలు,బలహీనతలకు అనుగుణంగా ఉండటమే కాకుండా సబ్జెక్ట్ విషయంలో నైపుణ్యం, పట్టు సాధించడానికి తగిన సమయాన్ని కూడా అందిస్తుందని పేర్కొన్నారు.అవుట్‌కమ్-బేస్డ్ ఎడ్యుకేషన్ (OBE) అనేది పాఠ్యాంశాల పునర్నిర్మాణం, బోధనాశాస్త్రం,మూల్యాంకన పద్ధతుల యొక్క పునర్నిర్మాణాన్ని కలిగి ఉంటుందని స్పష్టం చేశారు.ఇది హై-ఆర్డర్ యొక్క సాఫల్యతను ప్రతిబింబిస్తుందని అన్నారు.ఇంజనీరింగ్ విద్య యొక్క ప్రాథమిక లక్ష్యం సంపద మరియు సామాజిక పురోగతి అని చెప్పారు. వృత్తి పరమైన ఔన్నత్యాన్ని పొందేందుకు, సానుకూల మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఒక ఇంజనీరింగ్ అధ్యాపకులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో వివిధ అభివృద్ధి చెందుతున్న పోకడలు,అభివృద్ధి గురించి తెలుసుకునేలా అభ్యాసకులలో మేధో ఉత్సాహాన్ని మరియు ఉత్సుకతను పెంపొందించాలని పేర్కొన్నారు. ప్రగతిని సాధించడంలో అంకిత భావం, నిబద్ధత కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.కోర్సు, సెమిస్టర్, విద్యా సంవత్సరం,గ్రాడ్యుయేషన్ తర్వాత ఫలితాల సాధనను సులభంగా అంచనా వేయవచ్చని తెలిపారు.ఔట్ కమ్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా సంస్థ తన విద్యార్థుల సాధన స్థాయిని అంచనా వేయడానికి, మూల్యాంకనం సమయంలో గుర్తించబడిన అంతరాలను ప్రత్యామ్నాయ అభ్యాస పద్ధతులతో, మూల్యాంకనం చేయడం ద్వారా ముందుకు సాగడానికి ప్లాన్ చేస్తుందని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ వై.వి.ఎస్.ఎస్.వి.ప్రసాద్రావు, స్కిల్ డెవలప్మెంట్ డీన్ డాక్టర్ ఏ.శ్రీనాధ్,డాక్టర్ కృష్ణ రెడ్డి,వివిధ విభగదీపతులు,అధ్యాపకులు పాల్గొన్నారు
addComments
Post a Comment