కాకాణి కండలేరు సందర్శన"

 *" కాకాణి కండలేరు సందర్శన"


**శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, కండలేరు రిజర్వాయర్ ను పరిశీలించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*
 కండలేరు రిజర్వాయర్ డ్యాం భద్రతపై వదంతులు వ్యాప్తి చెందడంతో క్షేత్రస్థాయి పరిశీలనకు రావడం జరిగింది.


 కండలేరు రిజర్వాయర్ భద్రతపై రైతులకు, ప్రజానీకానికి ఉన్న అపోహలను తొలగించవలసిన అవసరం ఉంది.


 అతి పొడవైన మట్టికట్టతో నిర్మించిన కండలేరు రిజర్వాయర్ భద్రత విషయంలో పటిష్ఠమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.


 కండలేరు డ్యామ్ కట్ట వెలుపలి భాగాన మట్టి జారడం తప్ప, లీకేజీ ఎక్కడా కనిపించడం లేదు.


 కండలేరు రిజర్వాయర్  ను నిపుణుల కమిటీ పరిశీలించి, భద్రతపై తగు సూచనలిస్తూ, నివేదిక అందజేసింది.


 కండలేరు భద్రతపై అవసరమైతే  మరోసారి కూడా నిపుణుల కమిటీని నియమించి, సూచనలు, సలహాలు తీసుకుంటాం.


 కండలేరు రిజర్వాయర్ కు నిపుణుల కమిటీ సూచనలు సలహాలు మేర నిర్వహణ, మరమ్మతుల కోసం అవసరమైన నిధులను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి మంజూరు చేయిస్తాం.


 కండలేరు రిజర్వాయర్ కు ఇప్పటికే మంజూరై జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తాం.


 భారీ వర్షాలతో వరద ప్రభావం అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున స్పిల్ వే గేట్లను త్వరలోనే అమర్చి, వరద జలాలను రిజర్వాయర్ నుండి బయటకు వదిలేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి.


 కండలేరు రిజర్వాయర్ కు ప్రస్తుతానికి ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశాలు కనిపించడం లేదు.


 కండలేరు రిజర్వాయర్ పై అనేక వదంతులు వినిపిస్తున్న నేపథ్యంలో ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు.


 కండలేరు రిజర్వాయర్ సురక్షితంగా ఉన్నప్పటికీ అదనంగా డ్యాం కట్టకు అవసరమైన మేర పటిష్టపరిచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.


 కండలేరు రిజర్వాయర్ భద్రత, నిర్వహణ, మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టి, అవసరమైన నిధులను మంజూరు చేయించి, రైతులకు, ప్రజలకు ఎటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపడతాం.