అమరావతి (ప్రజా అమరావతి);
*జగనన్న విద్యా దీవెన – పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్*
*ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ, ఈ ఏడాది మూడో విడతగా దాదాపు 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ. 686 కోట్లను నేడే (30.11.2021, మంగళవారం) సీఎం శ్రీ వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు*
*జగనన్న విద్యా దీవెన*
దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్. ఐటీఐ, పాలిటెక్నిక్,డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే పేద విద్యార్దులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే (మూడు నెలలు) విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేస్తున్న శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం
*తల్లుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా...*
తల్లులు ప్రతీ మూడు నెలలకోసారి కాలేజీలకు నేరుగా వెళ్ళి ఫీజులు చెల్లించడం ద్వారా వారి పిల్లల చదువులు, కాలేజీలలో వసతులు పరిశీలించి లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను ప్రశ్నించగలుగుతారు
కాలేజీలలో జవాబుదారీతనం, కాలేజీల స్ధితిగతులు, పిల్లల బాగోగులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ రెండూ జరుగుతాయి
కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఉన్నత విద్య చదివే అవకాశం, అందరికీ వర్తింపు, తద్వారా అన్ని విధాల స్ధిరపడనున్న కుటుంబాలు
జగనన్న విద్యా దీవెన – మొదటి విడత – 19 ఏప్రిల్ 2021
రెండో విడత – 29 జులై 2021, మూడవ విడత – 30 నవంబర్ 2021, నాలుగవ విడత – ఫిబ్రవరి 2022
గత ప్రభుత్వంలో జరిగిన విధంగా ఫీజులకు అరకొర మొత్తాలు విదిలించి చేతులు దులుపుకోవడం, అదీ సరైన సమయంలో ఇవ్వకపోవడం వంటి చర్యలకు స్వస్తి...శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,778 కోట్లు బకాయిలతో కలిపి ఇప్పటివరకు చెల్లించిన మొత్తం రూ.6,259 కోట్లు. కరోనా సమయంలో కూడా అంతరాయం లేకుండా ఫీజుల చెల్లింపు
విద్యారంగంలో ప్రవేశపెట్టిన పథకాలపై ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన వ్యయం – మొత్తం లబ్దిదారులు – 1,99,38,694, లబ్ది రూ.కోట్లలో 34,622.17
addComments
Post a Comment