కోర్టులో ఉన్న కేసుని త్వరితగతిన డిస్పోజ్ చేయాలని కోర్టుకు విన్నవించుకోవడం జరిగిందని



వెలగపూడి (ప్రజా అమరావతి);



విశాఖపట్నం జిల్లాలోని పంచగ్రామాల మీద ప్రభుత్వం నియంమించిన కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 4 అంశాలపై చర్చించడం జరిగిందని తెలిపారు. కోర్టులో ఉన్న కేసుని త్వరితగతిన డిస్పోజ్ చేయాలని కోర్టుకు విన్నవించుకోవడం జరిగిందని


తెలిపారు. కోర్టుకి అందించిన నివేదిక ప్రకారం.. 12,149 మంది నిర్వాసితులు అక్కడ నివాసం ఉంటున్నారని, వారందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలని.. 1 నుంచి 100 గజాలు, 101 నుంచి 300 గజాలు, 300 గజాలు పైన స్థలాల్లో ఉన్న వారిపై ఏ రకమైన పథకం కోర్టుకి సబ్ మిట్ చేశామో.. ఆ సబ్ మిట్ చేసిన పథకాన్ని, ప్లాన్ ఆప్ యాక్షన్ ని కోర్టు ఆప్రూవ్ చేసిన దానిని అమలు చేసేవిధంగా సమావేశంలో చర్చించడం జరిగిందని వివరించారు. వెలగపూడి సచివాలయం 2వ బ్లాక్ లోని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఛాంబర్ లో గురువారం నాడు కమిటీ సమావేశం జరిగింది. 

2008లో గుర్తించిన 12,149 పంచగ్రామాల ఇళ్లలో కొన్ని ఇళ్లు వర్షాల వల్ల కూలిపోవడం, మరికొన్ని ఇళ్లకు మరమ్మతులు అవసరమయ్యాయని.. ఈ నేపథ్యంలో కమిటీ కొన్ని రికమేండేషన్స్ చేయడం జరిగిందని తెలిపారు. ఆ 12,149 ఇళ్లకి ఏ మరమ్మతులు అవసరం ఉంటాయో.. ఆ మరమ్మతులు చేసుకోవచ్చని,  అనుమతి ఇవ్వాలని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి తెలిపామని చెప్పారు. ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాత అమలు చేయడం జరుగుతుందన్నారు.

పంచగ్రామాల ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విజ్ఞప్తులు చేశారని.. వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూలకషంగా కమిటీ చర్చిందని తెలిపారు. ఆ పంచగ్రామాల్లో కొన్ని పూరిపాకలు ఉన్నాయని..  ఆ పూరిపాకల స్థానంలో పక్కా ఇళ్లు.. గ్రౌండ్ ప్లస్ వన్ కట్టుకునేందుకు అనుమతించేలా సమావేశంలో చర్చించామని.. కొన్నిచోట్ల దేవాలయాల భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని... అలా ఆక్రమణలకు గురికాకుండా సమావేశంలో ప్రతిపాదించామని, భూములు అన్యాక్రాంతం కాకుండా చుట్టూ కాపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.20 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని, అంచనాలు కూడా తయారయ్యాని.. అవి పూర్తిగా దేవాస్థానానికి సంబంధం లేకుండా, దేవస్థానం నిధుల నుంచి ఒక్క పైసా కూడా డ్రా చేయకుండా దాతలు, భక్తుల దగ్గర నుంచి తీసుకుని కాపౌండ్ వాల్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భక్తులను భాగస్వాములుగా చేసి వారిచ్చే డోనేషన్స్ తో లోపల గిరిప్రదక్షిణ చేసుకునేందుకు వీలుగా కాంపౌండ్ వాల్ నిర్మించాలని నిర్ణయం జరిగిందని, ప్రతి సంవత్సరం కార్తీకపౌర్ణమి రోజున దాదాపు 23 కి.మీ. లక్షలాది మంది గిరిప్రదక్షిణ చేస్తారని తెలిపారు.  ఆ 23 కి.మీ. భక్తులు గిరిప్రదక్షణ చేసుకునే విధంగా వసతి కల్పించాలని కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. 

కోర్టుకి ఆమోదయోగ్యంగా.. కోర్టు వారి సలహాలు తీసుకుని ఫ్లాన్ ఆఫ్ యాక్షన్ ను అమలుచేస్తామన్నారు. రెగ్యులరైజేషన్ అంశంలో కోర్టుకిచ్చిన ప్రతిపాదనలో 2008లో మార్కెట్ వాల్యూ ఒక అంచనా వేశారని.. 0-100 గజాల వరకూ ఉచితం, 101-300 గజాల వరకూ 1998 వాల్యూలో 70 శాతం ఫీజు అని, 300 గజాలపైన ఉన్న వాటికి 1998లో వాల్యూలో 100 శాతమని.. కమర్షియల్ యూనిట్స్ కి మార్కెట్ వాల్యూ ఉంటుందని తెలిపారు. కోర్టుకి వివరాలు అందించామని, కోర్టు ఒప్పుకుంటే ఆ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. 

సింహాచల దేవస్థానం భూముల విషయంలో దేవాలయాల భూముల కాపాడాలని, అక్కడ నివసిస్తున్న ప్రజల ప్రయోజనాలు కాపాడుతూ ఇద్దరికీ సమన్యాయం చేస్తూ.. ఎవరికీ అన్యాయం జరగకూడదని ఈ సమావేశంలో చర్చించడం జరిగిందని విజయసాయిరెడ్డి తెలిపారు.  

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.... పంచగ్రామాల నిర్వాసితులకు న్యాయం జరిగేలా, దేవాలయానికి ఎటువంటి నష్టం లేకుండా చేయడానికి ఇప్పటికే ఒక అంచనా వేయడం జరిగిందని తెలిపారు. హైకోర్టులో అఫిడవిట్ కూడా వేశామని తెలిపారు. సింహాచల దేవాలయ అభివృద్ధి మీద, దేవాలయాల స్థలాలను ఏ విధంగా కాపాడాలనే అంశాలపై చర్చించడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో సింహాచలాన్ని చక్కటి దేవాలయంగా అభివృద్ది చేసే లక్ష్యంతో కమిటీ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదీప్ రాజు, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొని చర్చించారు.