కోవిడ్ పై నిర్లక్ష్యం తగదు

 కోవిడ్ పై నిర్లక్ష్యం తగదు


 వ్యాక్సిన్ వేసుకోండి..వేయించండి

      డి.ఎం.హెచ్.ఓ. ఎం.సుహాసిని. 


 మచిలీపట్నం (ప్రజా అమరావతి);              ప్రజల్లో కోవిడ్ తీవ్రతపై తీవ్ర నిర్లక్ష్యం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 


రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ త్వరలో మూడవ ఫేజ్ తీవ్రత ఉన్నదని హెచ్చరిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఇప్పటి వరకు మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకోని వారికి ప్రమాదం పొంచి ఉందని గ్రహించి త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవాలని వాక్సిన్ వేయించుకోపోతే నాకేమౌతుందనే నిర్లక్ష్య ధోరణి సరైనది కాదని సూది మందుకు బయపడి ప్రాణాలను ఫణంగా పెట్టటం అవివేకమని హితవు పలికారు. 


మొదటి డోసు  వ్యాక్సిన్ వేయించుకున్న వారు వారి గడువు దాటకుండా రెండవ డోసు వేయించుకోవాలి అని తెలిపారు. 


వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న వారు వారి చుట్టుపక్కల సమాజం వాక్సిన్ వేయించుకున్నారో లేదో తెలుసుకొని వారికి వాక్సిన్ ప్రాముఖ్యతను వివరించాలని అది సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకొని అవగాహన కల్పించాలన్నారు.