మీరు నేర్చుకుంటే తప్ప కలలు సాకారం కావని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.కొవ్వూరు/తాడేపల్లిగూడెం (ప్రజా అమరావతి);


మీరు నేర్చుకుంటే తప్ప కలలు సాకారం కావని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. దేశంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన భారతరత్న డా.మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా పాటిస్తున్నామని మంత్రి తానేటి వనిత తెలిపారు. ప్రజలకు విద్య ఆవశ్యకతపై అవగాహన పెంచి, ఎక్కువ మంది పిల్లలను స్కూళ్లకు రప్పించే ఏర్పాట్లు చేస్తారు. భారత విద్యారంగాన్ని పరిపుష్టం చేసి.. విద్యావిధానంలో కొత్త పోకడలు సృష్టించి దేశాభివృద్ధికి దారులు వేసిన  మహోన్నత వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అన్నారు. దేశ మొట్ట మొదటి విద్యా శాఖ మంత్రి గా తనదైన ముద్ర వెయ్యగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో  అమ్మఒడి, నాడు-నేడు, ఇంగ్లీషు మీడియం వంటి ఎన్నో పధకాలను ప్రవేశ పెట్టారని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి ఎక్కువ మంది పిల్లలను స్కూళ్లకు రప్పించే దిశగా అడుగులు వేస్తున్నారు.