న్యూఢిల్లీ (ప్రజా అమరావతి);
*కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భేటీ*
*విద్యుత్ ఉపకరణ జోన్ ని ఏపీలో ఏర్పాటు చేయాలని కోరిన మంత్రి మేకపాటి
*
*కొప్పర్తిలో భారీ టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు గురించి ప్రతిపాదన అందజేసిన మంత్రి మేకపాటి*
*రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన వాణిజ్య ఉత్సవం- 2021ని అభినందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్*
*తెలుగు సంస్కృతిని ఇనుమడింపజేసే కొండపల్లి బొమ్మలతో తీర్చిదిద్దిన "దశావతారం" ప్రతిమను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి అందించిన మంత్రి మేకపాటి*
న్యూఢిల్లీ, నవంబర్, 11; ఏపీలో విద్యుత్ ఉపకరణ జోన్ ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి ప్రతిపాదనను అందించారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో గురువారం సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని ఉద్యోగ భవన్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ని కలిసి పుష్పగుచ్చం,శాలువాతోపాటు తెలుగు సంస్కృతిని ఇనుమడింపజేసే కొండపల్లి బొమ్మలతో తీర్చిదిద్దిన "దశావతారం" ప్రతిమను మంత్రి మేకపాటి ప్రత్యేకంగా అందజేశారు. భారీ విద్యుత్ ఉపకరణాల జోన్‌గా మన్నవరం అనుకూలమని ఈ సందర్భంగా మంత్రి మేకపాటి కేంద్ర మంత్రి పీయూష్ కి వివరించారు. ఏపీ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గతంలో ఎన్‌టీపీసీ-బీహెచ్‌ఈఎల్‌కు కేటాయించిన 750 ఎకరాల భూమిని ఎనర్జీ మాన్యుఫాక్చరింగ్ గా మార్చేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని వెల్లడించారు. త్వరలోనే మన్నవరం విద్యుత్ ఉపకరణాల జోన్‌పై ఎన్‌టీపీసీ-బీహెచ్‌ఈఎల్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించేందుకు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన వాణిజ్య ఉత్సవం- 2021ని పీయూష్ గోయల్ ప్రశంసించారు.
*కొప్పర్తిలో భారీ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటి విజ్ఞప్తి*
వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొప్పర్తిలో భారీ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటి కేంద్ర మంత్రి పీయూష్ కి మంత్రి మేకపాటి విజ్ఞప్తి చేశారు. ఆత్మనిర్భర్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం మొత్తం 7 టెక్స్‌టైల్ పార్క్‌లు ఏర్పాటు చేస్తున్న తరుణంలో మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్న కొప్పర్తిలో ఒక టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటి కోరారు. విశాఖ-చెన్నై కారిడార్‌లో రాష్ట్ర వాటాను 20 నుంచి 10 శాతానికి తగ్గించాలని కూడా మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇంకా రైల్వే రద్దీ తగ్గించడంలో కీలకమైన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (DFC - DEDICATED FREIGHT CORRIDOR) కి ప్రతిపాదనను కేంద్ర మంత్రి పీయూష్ దృష్టికి తీసుకెళ్లారు. గతిశక్తిలో ఏపీ భాగస్వామ్యం అవడం ద్వారా అందుకు సహకరిస్తామని కేంద్ర మంత్రి పీయూష్ వెల్లడించారు. రాష్ట్ర ప్రతిపాదనలన్నింటిపై కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి మాట్లాడుతూ విశాఖలోని మెడ్ టెక్ జోన్ లో మెడక్సిల్ కార్యాలయ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ భవన్ కమిషనర్ భావనా సక్సేనా, ఏపీఐఐసీ ఎండి సుబ్రహ్మణ్యం జవ్వాది, మెడ్ టెక్ జోన్ సీఈవో జితేంద్ర శర్మ, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్, తదితరులు హాజరయ్యారు.
addComments
Post a Comment