ఏలూరు (ప్రజా అమరావతి);
సంతోషంగా పని చేశా, సంతృప్తి గా పదవి విరమణ చేస్తున్నా... వెంకటేశ్వరరావు
విధుల పట్ల నిబ్బద్దతకు, భాద్యత కు మారుపేరు ఏ వి ఏస్ జి. వెంకటేశ్వర రావు అని సహాయ సంచాలకులు డి. నాగార్జున పేర్కొన్నారు.
మంగళవారం స్థానిక గిరిజన భవనంలో నిర్వహించిన వెంకటేశ్వరరావు పదవి విరమణ అభినందన సభకు ముఖ్య అతిధిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, సమాచార శాఖ లో 30 సంవత్సరాలు సర్వీస్ ను ఎంతో నిబద్ధతతో నిర్వహించడం ఆయన పని తనానికి నిదర్శనం అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం ఎంతో వత్తిడి తో కూడుకుని ఉన్నా, ఏ పని చెప్పినా అంతే విధేయతతో బాధ్యత లని నిర్వహించే వారని తెలిపారు. విధుల్లో ఆయన చూపించిన పనితీరు ను మంత్రుల స్థాయిలో గుర్తించి పదోన్నతి సందర్భంగా అభినందనలు తెలపడం నిదర్శనం అన్నారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సంతోషంగా పని చేశా, సంతృప్తి గా పదవి విరమణ చేస్తున్నా అని పేర్కొన్నారు. నా సర్వీసు మొత్తం లో నాకు సహకరించిన, నాతో నడచిన మిత్రుల కు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమం లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ భవానీ, డివిజనల్ పిఆర్వో లు, ఎస్వీ మోహన్ రావు, ఎమ్. లక్ష్మణాచార్యులు, సీనియర్ అసిస్టెంట్ రాజు ,రికార్డ్ అసిస్టెంట్ బాబు రావు ,మల్లిబాబు ,రాజేష్ దుర్గారావు ,జిలాని, మల్లేశ్వరి, రేష్మా, రత్నాకర్ ఉమా ,ఐ. కాశయ్య, ఎస్. శ్రీనివాసరావు, రామిరెడ్డి, విజయవాడ ఆర్జేడీ, మచిలీపట్నం, గుడివాడ, నరసాపురం, కొవ్వూరు, పాత్రికేయులు , కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
addComments
Post a Comment