అనంతపురం (ప్రజా అమరావతి):
గంజాయి అక్రమంగా తరలించి విక్రయించే నలుగురి ముఠా అరెస్టు
* 25 కేజీల గంజాయి, కారు స్వాధీనం
గంజాయి అక్రమంగా తరలించి విక్రయించే నలుగురి ముఠాను రాప్తాడు పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి 25 కేజీల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు శనివారం ఇటుకలపల్లి సి.ఐ ఎస్ విజయభాస్కర్ గౌడ్ వివరాలు వెల్లడించారు.
** ముఠా సభ్యుల వివరాలు:
1) పూజారి చిన్న కదిరయ్య, @ కదిరప్ప వయస్సు 40 సం.లు, పాలచెర్ల గ్రామము, రాప్తాడు మండలం.
2) మేకల ప్రసాద్, వయస్సు 42 సం., తాటిచెర్ల గ్రామం, అనంతపురం మండలం.
3) జానగొండ గంగాధర్ గౌడ్, వయస్సు 37 సం., K.K.అగ్రహారము గ్రామం, బుక్కరాయసముద్రం మండలం.( ప్రస్తుత నివాసము D.No.5/72-8, నందమూరి నగర్, కళ్యాణదుర్గం రోడ్, అనంతపుర0)
4) అంబటి రవి, వయస్సు 38 సం., తమ్మడపల్లి గ్రామము, జఫ్ఫర్ ఘడ్ మండలం, జనగాం జిల్లా, తెలంగాణ రాష్ట్రం
** నేపథ్యం:
ఈ ముఠాలో చిన్న కదిరయ్య @ కదిరప్ప, అంబటి రవిలు ముఖ్యులు. సులువుగా డబ్బు సంపాదించాలని భావించారు. గంజాయి అక్రమంగా విక్రయించాలని నిశ్చయించుకున్నారు. ఈక్రమంలో విశాఖపట్నం నుండి గంజాయిని కిలో రూ. 5 వేలు ప్రకారము కొని కారులో అంబటి రవి తీసుకొచ్చేవాడు. చిన్న కదిరయ్య, తాటిచెర్ల గ్రామానికి చెందిన మేకల ప్రసాద్, అనంతపురమునకు చెందిన జానగొండ గంగాధర్ లు కలసి అనంతపురంలో 50 గ్రాముల చిన్న పొట్లాలు చేసుకొని రైల్వే స్టేషన్, బస్టాండ్ ఏరియాలలో రూ. 1000/- ప్రకారం విక్రయించేవారు. వచ్చిన లాభంలో ఖర్చులు పోను మిగితా డబ్బును సమంగా పంచుకొనేవారు.
** ముఠా అరెస్టు ఇలా...
జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి ఆదేశాల మేరకు డీఎస్పీ G. వీరరాఘవ రెడ్డి, ఇటుకలపల్లి సి.ఐ S. విజయ భాస్కర్ గౌడ్ ల పర్యవేక్షణలో రాప్తాడు ఎస్సై B. రాఘవరెడ్డి, సిబ్బింది బృందంగా ఏర్పడి రాబడిన సమాచాంతో ఈ ముఠాను రాప్తాడు మండలం రామనేపల్లి సమీపంలో అరెస్టు చేశారు.
addComments
Post a Comment