శాసనసభ, అమరావతి (ప్రజా అమరావతి);
*వ్యవసాయం పై చర్చ సందర్భంగా శాసనసభలో మాట్లాడిన వ్యవసాయశాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు.*
*చంద్రబాబు, కరువు కవల పిల్లలు*
*గత టీడీపీ ప్రభుత్వం ఏనాడు రైతులకు పూర్తి సబ్సిడీ ఇవ్వలేద, సీఎం జగన్ గారే పాత బకాయిల్ని కూడా తీర్చారు*
*కుప్పం, టెక్కలి వ్యవసాయ కమిటీ గౌరవ ఛైర్మన్లుగా చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఏనాడైనా సలహా ఇచ్చారా?*
*వ్యవసాయం, రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు.*
*రైతులకు గతంలో టీడీపీ ఏనాడైనా మేలు చేసిందా?*
*చంద్రబాబే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు.*
*వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా?*
*ఆర్బీకేలకు కితాబిచ్చిన నీతి అయోగ్, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు*
*సీడ్ టు సేల్ కాన్సెప్ట్ మెచ్చుకున్న జర్మనీ దౌత్యవేత్తలు*
*ఆయిల్‌ఫాం రైతుకు గతంలో టన్నుకు రూ.7వేలు వస్తే.. ఇప్పడు రూ.19,300లు వస్తున్నాయ్*
*రూ.136 కోట్ల విలువైన పొగాకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేశాం*
*రాష్ట్రంలో సీఎం జగన్ నేతృత్వంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయ్*
*వ్యవసాయశాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు*
*అమరావతి.*
ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండవ రోజు సమావేశంలో వ్యవసాయ రంగంపై చర్చ జరిగింది. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడారు. టీడీపీ ఐదేళ్లలో చేసిన బీమా కన్నా రెట్టింపు బీమ చేయించామని తెలిపారు. రైతు విత్తనం వేసిన దగ్గర్నుంచే బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, ఈ ప్రక్రియలో 71లక్షల మంది రైతులకు బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. రైతుల పట్ల ఎలాంటి కపట ప్రేమ చంద్రబాబుకు ఉంటుందో ఈరోజు మరొకసారి అర్థమైందని కన్నబాబు అన్నారు. మాటల్లో తప్ప చేతల్లో చిత్తశుద్ధిలేదని మరోసారి నిరూపించుకున్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయ రంగంపై చర్చ కావాలని అడిగితే మొదటి రోజే చర్చకు అనుమతిస్తే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పటానికి ప్రభుత్వం సిద్ధమైతే వినే ఓపిక లేదు. వింటే తట్టుకోలేని పరిస్థితుల్లో వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఏది ప్రాధాన్యత అనేది వారికి అర్థంకాదు. ఎంతసేపూ రాజకీయంగా ఆలోచించాలి. సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీద బురద చల్లాలనే అజెండా తప్ప జీవితంలో ఇంకో అజెండా చంద్రబాబుకు లేదు.
రైతు సంక్షేమానికి సీఎం శ్రీ జగన్ ఏం చేస్తున్నారనటానికి మేం సిద్ధంగా ఉన్నాము. కరువు సీమగా పేరున్న జిల్లాల్లోనూ వరదలు పోటెత్తి రిజర్వాయర్లు నిండుకుండల్లా ఉన్నాయి. ప్రతిచోటా పచ్చదనం పరిఢవిల్లుతున్న పరిస్థితి ఉంది. బిడ్డ వచ్చిన వేళ.. గొడ్డు వచ్చిన వేళ అనే సామెత గుర్తుకు వస్తోందని రాజన్న బిడ్డ వచ్చిన వేళ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. సీఎం శ్రీ వైయస్ జగన్ పరిపాలనా పగ్గాలు చేపట్టారో ఆరోజు నుంచి కరువు కాటకాలు లేవు. గతంలో కరువు, చంద్రబాబు కవల పిల్లలు అనేవారు. చంద్రబాబు పరిపాలన ఏ రోజైతే అంతమైందో ఆరోజే కరువు కూడా పారిపోయింది. ప్రస్తుతం ఈ రాష్ట్రం సుభిక్షంగా రికార్డు స్థాయిలో పంటలు పండించేలా రైతాంగం ముందుకు వెళ్తున్నారు. రైతన్నలను ఈ ప్రభుత్వం చేయి పట్టి నడిపిస్తోంది. సీఎం శ్రీ జగన్ రైతు పక్షపాతిని.. రైతు పక్షపాత ప్రభుత్వమని ప్రకటించారు. మొదటి కేబినెట్ సమావేశంలో వైయస్‌ఆర్ రైతుభరోసా కార్యక్రమానికి తీర్మానం చేశారు.
ఇవాళ రాష్ట్రంలో ద్విముఖ వ్యూహంతో వ్యవసాయ రంగాన్ని, రైతు సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. తాత్కాలిక ఉపశమనంతో పాటు వారికి అవసరమైన ఆర్థిక చేయూత, ఇన్‌పుట్స్ ఇవ్వటంతో పాటు రేపటి రోజుకు వ్యవసాయాన్ని వారసత్వంగా అందించటానికి కృషి చేస్తున్నాం. దీనికోసం శాశ్వత వనరులు, వసతులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈ రంగాన్ని పునర్జీవం చేసి భవిష్యత్ తరాలకు అందించేందుకు సీఎం శ్రీ వైయస్ జగన్ నాయకత్వంలో చేస్తున్నాము. రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తోందో ఏం అభివృద్ధి జరుగుతుందో తెల్సుకునే ఓపిక ప్రతిపక్షానికి లేదని కన్నబాబు అన్నారు. టీడీపీ తీవ్రమైన అసహనంలో ఉన్నారని పార్టీ లేదు.. బొక్కాలేదనే పరిస్థితిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే అన్న సంగతిని కన్నబాబు గుర్తు చేశారు. ఆ ఫ్రస్టేషన్‌ను ఈ సభలో చూపించకుండా ప్రజలకు ఉపయోగపడే సలహాలు, సూచనలు ఇస్తే మంచిదని కన్నబాబు హితవు పలికారు.
రాష్ట్రంలో 88.77 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు సాగు అవుతున్నాయి. వర్షాలు బాగా పడుతున్నాయి. దీంతో సాంప్రదాయంగా పండించే పంటలు బదులు వేరే పంటల వైపు రైతాంగం వెళ్లేలా ప్రకృతి సహకరిస్తోంది. 3.17 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ వైపు మళ్లాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలను రైతులు పండిస్తున్నారు. వ్యవసాయ రంగం కోసం ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
రైతు సంక్షేమానికి సీఎం శ్రీ వైయస్ జగన్ ఇస్తున్నంత ఊతం గతంలో ఏ సీఎం ఇవ్వలేదు. గతంలో దివంగత వైయస్‌ఆర్ వ్యవసాయాన్ని పండగ చేస్తాను రైతాంగానికి అండగా నిలబడతానని అంటే.. నాన్న ఒక్క అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన సీఎం శ్రీ జగన్ వంద అడుగులు ముందుకు వేస్తున్నారు.
చరిత్ర పుటలు తిరగేస్తే.. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఇది నా మార్క్ అని చెప్పే ఒక్క కార్యక్రమం చేయలేదు. చంద్రబాబు హయాంలో వ్యవసాయ రంగంలో చరిత్రలో నిలిచిపోయే సంస్కరణలు తీసుకువచ్చామని మచ్చుకు ఒక్కటి కనపడదు. కానీ వచ్చిన రెండున్నర సంవత్సరాల్లోనే రెండు, మూడు తరాలు మర్చిపోలేని నిర్ణయాలు సీఎం శ్రీ జగన్ తీసుకున్నారు. చెప్పిందే కాకుండా.. చెప్పనివి కూడా చేశారు. వైయస్‌ఆర్ రైతుభరోసా-పీఎం కిసాన్ కింద పెట్టుబడి సాయం ఐదేళ్లలో రూ12,500 చొప్పన నాలుగేళ్లు ఇస్తామని సీఎం హామీ రూ.13,500 చొప్పన ఐదేళ్లపాటు ఇస్తున్నారని కన్నాబాబు గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఈ రెండున్నరేళ్లలో వైయస్‌ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ కింద రూ.18,777 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో వేసిన చరిత్ర సీఎం శ్రీ జగన్ గారిదని కన్నబాబు తెలిపారు. ఇచ్చిన దానికంటే ఎక్కువ చేయాలనే మనస్సుంది కాబట్టే ఇది సాధ్యమైందని కన్నబాబు అన్నారు.
గతంలో చంద్రబాబు బ్యాంకుల్లో బంగారు విడిపిస్తానని రైతు రుణమాఫీ చేస్తానని పెద్ద హామీ ఇచ్చారు. రూ.80,000 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉంటే.. రకరకాల లెక్కలు వేసి.. ఆనాడు రూ.15,279 కోట్లు మాత్రమే ఇచ్చారు. దానికీ, దీనికీ పొంత ఎక్కడైనా ఉందా? కానీ రెండున్నరేళ్లలో రూ.18,777 కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు. డబ్బులు ఇవ్వలేక పసుపు పత్రాలు ముద్రించి బాండ్లు ఇచ్చారు. కొంతమంది రైతులకు పత్రాలు ఇచ్చారు. కొంతమంది రైతులకు వన్ టైం సెటిల్మెంట్లు చేశారు. అలా కేవలం కొంతమందికే వన్‌టైం సెటిల్మెంట్లు చేయటం ఏంటి? వారు భూములు ఇచ్చారని త్యాగధనులని అంటారు. మరి, పోలవరం, పట్టిసీమకో భూములు ఇచ్చిన వారు త్యాగధనులు కాదా? వారికి రుణమాఫీ, వన్‌టైం సెటిల్‌మెంట్ చేయనక్కర్లేదా అని కన్నబాబు ప్రశ్నించారు.
రాష్ట్రంలో రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత వస్తుందని చివర్లో అన్నదాతా సుఖీభవ అనే కార్యక్రమం తీసుకున్నారు. ఇందులో 2019 ఫిబ్రవరిన జీఓ ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే మూడు వారాల ముందు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని తెచ్చారు. 46.76 లక్షల రైతుల ఖాతాల్లో రూ.వెయ్యి వేశారు. రెండో ఇన్‌స్టాల్‌మెంట్ కింద 43.26 లక్షల మందికి రూ.3,000 వేశారు. మొత్తం రూ.1765 కోట్లు అన్నదాత సుఖీభవ కింద గత ప్రభుత్వంలో వేశారు. ఎన్నికల ముందు ఒక ఫార్స్‌గా పథకాన్ని తీసుకొచ్చి రైతును ఓటు బ్యాంకుగా టీడీపీ చూశారు తప్ప వారికి మేలు చేసిన దాఖలాలు లేవు.
*వైయస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం*
వైయస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం పొందాలంటే ముందు ప్రీమియం కట్టాలి ఆ కంపెనీ ఎంత ఇస్తుందో తెలియని పరిస్థితి ఉండేది. కానీ శ్రీ జగన్ గారు ఈ-క్రాప్ నమోదు చేసుకుంటే ఉచిత పంటల బీమా పథకం ఆటోమ్యాటిక్‌గా వర్తిస్తుందని చెప్పారు. వైయస్‌ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ పథకం క్రింద రూ.3713.32 కోట్లు ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించిందని మంత్రి కన్నబాబు తెలిపారు. గతంలో చంద్రబాబు కట్టలేని బకాయిల్ని కూడా ఈ ప్రభుత్వం చెల్లించిందని కన్నబాబు గుర్తు చేశారు. 2012-13లో రూ.596 కోట్లు, 2018-19 రబీ బకాయిలు కూడా DBT కింద చెల్లించటం జరిగింది. కమిట్‌మెంట్ ఉంటే పంటల బీమా బకాయిలు, సున్నా వడ్డీ బకాయిలు ఇంత పెద్ద ఎత్తున బకాయిలు పెట్టే పరిస్థితి వస్తుందా?
లక్ష రూపాయిలు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారికే సున్నా వడ్డీ పథకం వర్తిస్తుంది. లక్షకు పైన రుణం తీసుకున్న వారికి సున్నా వడ్డీ పథకం వర్తించదని కన్నబాబు అన్నారు. సున్నా వడ్డీ రాయితీకి సంబంధించి గతంలో ఎక్కడో ఉద్యోగం, వ్యాపారం చేసుకుంటూ రైతుకు దక్కాల్సింది యజమానులు అనుభవించేవారు. కానీ ఇప్పుడు నిజంగా సాగు చేసే రైతులకు దక్కేలా విధానం తీసుకువచ్చాం. ఈ విషయం టీడీపీ వారికి కూడా తెల్సు. వడ్డీ రైతు కడితే ప్రభుత్వం తర్వాత రైతు ఖాతాలో జమ చేస్తుంది. సున్నా వడ్డీ పథకం రూపం ఏమిటో తెలియకుండా టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి మాట్లాడటం సరికాదు.
ప్రకృతి విపత్తుల నిధిని రూ.2000 కోట్లతో ఏర్పాటు చేస్తానని సీఎం శ్రీ జగన్ వచ్చిన వెంటనే నెరవేర్చారు. ఇన్‌పుట్ సబ్సిడీ కింద చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఏదైనా ప్రకృతి విపత్తు జరిగి రైతు
నష్టపోతే ఎప్పుడు పరిహారం వస్తుందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఏ సీజన్‌లో పంట నష్టపోతే ఆ సీజన్‌లోనే పరిహారం ఇవ్వాలని సీఎం శ్రీ జగన్ నిర్ణయించారు. దాని ప్రకారమే పరిహారం ఇస్తున్నారు.
గతేడాది నివర్ తుఫాను, ఇటీవల గులాబీ తుఫాను సందర్భంగా పంటలు నష్టపోతే రెండు నెలల్లో డబ్బులు వేసిన చరిత్ర సీఎం శ్రీ జగన్ గారిదే. 2020లో 12.15 లక్షల రైతుల ఖాతాల్లో నేరుగా రూ.932
కోట్లు వేయటం జరిగింది. జూన్ 2019 - అక్టోబర్ 2020 వరకు 16.66 లక్షల ఎకరాలకు రూ.123.69 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయటం జరిగింది. ఇందులో చిన్న తప్పు జరగకుండా నష్టపోయిన
రైతుల వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో, గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నాం. మూడు రోజుల క్రితం గులాబ్ తుఫాన్ వల్ల నష్టపోయిన 34,586 మంది రైతుల ఖాతాల్లో రూ.22 కోట్లు వేయటం జరిగిందని కన్నబాబు వివరించారు. మరోవైపు ఎన్యుమరేషన్ జరుగుతుండగానే భారీ వర్షాలు వచ్చాయి. భారీ వర్షాలు తగ్గాక నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని కన్నబాబు పేర్కొన్నారు.
*ఏది చేసినా నాడు-నేడులా*
ఏ పని చేసినా నాడు-నేడులా చేయండని సీఎం గారు చెబుతారు. తుఫాను వస్తే వాటిని చేత్తో అడ్డుకుంటామని గత ప్రభుత్వం నమ్మించటానికి ప్రయత్నించారు. తుఫాను కంటే ముందే ఫీల్డ్‌లో ఉంటామని గతంలో ప్రచారం చేసుకున్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుండా రైతుల్ని మాయ చేసి వెళ్లిపోయారనికన్నబాబు గుర్తు చేశారు.
మా దృష్టిలో పంటలు పండించేవారు రైతులు. వారికి రైతులు అంటే అమరావతి భూములు వ్యాపారం చేసేవారు రైతులు. సిగ్గు అనేది లేదు. అమరావతి రైతుల విషయం లేవనెత్తటానికి పాయింట్ ఆఫ్ ఆర్డర్ బుచ్చయ్య చౌదరి ఎత్తటం ఏంటని కన్నబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దానికీ, దీనికి పొంతన ఏంటని కన్నబాబు ప్రశ్నించారు. ఎంత దాచుకోవాలన్నా అమరావతి భూములపై ఉన్న
ప్రేమను టీడీపీ నేతలు దాచుకోలేకపోతున్నారని కన్నబాబు అన్నారు. మేం పంటలు పండించే రైతులు అనుకుంటాం కానీ రియల్ ఎస్టేట్ రైతులు అనుకోవటం లేదని కన్నబాబు అన్నారు.
2018 ఖరీఫ్‌లో ఇన్‌పుట్ సబ్సిడీ రూ.1832 కోట్ల సబ్సిడీ, పెథాయ్ తుఫాను రూ.690 కోట్లు కలిపి రూ.2195 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఎగ్గొట్టి చంద్రబాబు వెళ్లిపోయారు. అన్నదాతకు, పసుపు కుంకుమకు ఎలాంటి అడ్డు రాలేదు. కానీ ఇన్‌పుట్ సబ్సిడీ ఎగ్గొట్టారని కన్నబాబు అన్నారు. గోరంత చేసినా కొండంత చూపే మీడియా ఉండటం వల్ల టీడీపీ ఆటలు సాగుతున్నాయి. రైతుల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకే లేదు. ఇన్ని గొప్పలు చెప్పుకున్నవారికి రూ.2195 కోట్లు బాకీ ఎందుకు పెట్టారని కన్నబాబు ప్రశ్నించారు.
క్రాప్ ఇన్‌స్యూరెన్స్ - నాడు - మీ సేవా కేంద్రానికి వెళ్లి నమోదు చేసుకోవాలి. కంపెనీల దయాదాక్షణ్యాల మీద ఆధారపడాలి. కానీ నేడు ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోవాలి. 2019-20లో 49.81 లక్షల మంది రైతులకు బీమా ఇవ్వటం జరిగింది. రిజిస్ట్రేషన్ల సిస్టం సెట్‌రైట్ కాలేదు. 2020-21లో 71.30 లక్షల రైతాంగానికి ఇన్‌స్యూరెన్స్ చేయించటం జరిగింది. 2016-17లో 17.79 లక్షల మంది రైతులకు
బీమా ఇచ్చారు. 2017-18లో 18.22 లక్షలు, 2018-19లో 24.83 లక్షలు మొత్తం కలిపి 60.84 లక్షల రైతాంగానికి మాత్రమే చేయగలిగారు. వారు ఐదేళ్లలో చేసిన బీమా కన్నా రెట్టింపు ఈ రెండేళ్లలో 121 లక్షల మందికి బీమా ఈ ప్రభుత్వం చేసింది. ఏ ఖర్చు తీసుకున్నా, ఏ గణాంకాలైనా తీసుకున్నా రెట్టింపు ఖర్చు, సెటిల్‌మెంట్లు చేయటం జరిగింది. 2016-17లో రూ.954 కోట్లు, 2017-18లో రూ.720
కోట్లు, 2018-19లో రూ.1263 కోట్లు. మొత్తంగా రూ.2900 కోట్లు. 2019 నుంచి ఇప్పటి వరకు క్లైంలు కలిపి చూస్తే..రూ.3,716 కోట్లు. ఐదేళ్ల వాళ్ల పరిపాలన కన్నా రెండేళ్లలో ఈ ప్రభుత్వం రెట్టింపు సాయం చేసింది.
*రైతు ముంగిటకే.. విత్తనం*
గతంలో విత్తనాలు సక్రమంగా లభించేవి కావు. మండల కేంద్రాలకు వెళ్లాలి. పోలీసులతో తన్నులు తినాలి. విత్తనం దొరికినా నాణ్యం ఉంటుందో లేదో తెలియదు. ఇది మనం చూసిన సంఘటనలు. కానీ ఈరోజు రైతు ముంగిటకే విత్తనాన్ని తీసుకువెళ్లి వారు అంగీకరించిన నాణ్యతే ఉంటే విత్తనం సరఫరా చేస్తున్నాం. పూర్తిగా నాణ్యమైన విత్తనం సరఫరా చేస్తున్నాము. రైతు వద్దు అంటే నష్టం వచ్చిన
భరించాలి. టెండర్లు పిలిచి విత్తనాలు కొనుగోలు చేసే కార్యక్రమం చేసేవారు. కానీ రైతు నుంచి విత్తనాలు సేకరించి శుద్ధి చేసి విత్తనాలు అందిస్తున్నాము. లారీలు రాష్ట్రంలో రాకముందే.. చెక్‌పోస్టుల
దగ్గర నమోదు చేయించిన చరిత్ర ఆనాటి ప్రభుత్వంలో కనిపించింది. ఈనాడు మన గ్రామాల్లో రైతులు పండించిన విత్తనం రైతులకు సరఫరా చేస్తున్నాము. సీడ్ సబ్సిడీ రూ.384 బకాయిలు ఉన్నాయి . అవి కూడా సీఎం శ్రీ జగన్ చెల్లించారు. ఇంతకుముందు ఒక పథకాన్ని ప్రారంభిస్తే క్రమక్రమంగా లబ్ధిదారుల్ని ఎలా తగ్గించాలని గత ప్రభుత్వం ఆలోచించేది. కానీ ఇప్పుడు వైయస్‌ఆర్-రైతు భరోసా
పథకంలో లక్షలాది మంది నమోదయ్యారు. 2019-20లో 46.69 లక్షల మంది వైయస్‌ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ కింద నమోదైతే 2020-21 నాటికి 51.59 లక్షల మంది రైతాంగానికి సాయం
అందించాం. 2021-22 నాటికి 51.98 లక్షల మందికి వైయస్‌ఆర్ రైతు భరోసా అందుతోంది. దీన్ని పెద్ద మనసు అనరా? ఎలాంటి వంకలు, నిబంధనలు పెట్టకుండా.. సాయం చేస్తాను అనే సీఎం దేశంలో ఎక్కడైనా ఉన్నారా అని కన్నబాబు అన్నారు.
గత ప్రభుత్వం సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన బకాయిలు రూ.688.28 కోట్లు 38.42 లక్షల మంది రైతాంగానికి సీఎం శ్రీ జగన్ చెల్లించారని కన్నబాబు తెలిపారు.
*రుణ పరపతి విషయానికి వస్తే...*
గత ప్రభుత్వంలో రైతాంగానికి 2014-15 నుంచి 2018-19 వరకు మొత్తం కలిపి రూ.3.54 లక్షల కోట్లు క్రాప్, టర్మ్ లోన్లుగా ఇచ్చారు. 2019-20లో 1.13 లక్షల కోట్లు, 2020-21లో రూ.1.46 లక్షల కోట్లు, 2021-22లో దాదాపుగా ఇప్పటికీ రూ.75 వేల కోట్లు ఇవ్వటం జరిగింది. ఐదేళ్లలో వారిచ్చిన మొత్తం రెండేళ్లలో రైతాంగానికి ఇవ్వటం జరిగింది. అంతేకాదు రైతు రుణపరపతిని కాపాడటం జరుగుతోంది.
*కౌలు రైతులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు*
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ యజమానులతో పాటు కౌలు రైతులకూ సాయం అందుతోంది. 5 లక్షల పైచిలుకు సీసీఆర్‌సీ కార్డులు తీసుకురావటం జరిగింది. ఇంకా కౌలు రైతులు మిగిలిపోయారు. అధికారికంగా పత్రాలు ఇవ్వటం లేదంటే.. జేఎంజీ, ఆర్‌ఎంజీ, రైతు మిత్ర గ్రూపులు పెట్టి రుణాలు అందించాలని సీఎం శ్రీ జగన్ ఆదేశించారు.
కృష్ణా జిల్లాకు చెందిన వీరయ్య చౌదరి అనే రైతు మంచి చేస్తే మర్చిపోరు అనటానికి ఉదాహరణ అని కన్నబాబు గుర్తు చేశారు. ఇంతకుముందు ఇలాంటి వ్యవస్థలు ఏవైనా వేరే రాష్ట్రంలో ఉంటే స్ఫూర్తిగా తీసుకొని మనం అమలు చేసేవాళ్లం. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఇలాంటి వ్యవస్థను సీఎం శ్రీ జగన్ రూపకల్పన చేశారని ప్రసంసిస్తోంది. 10778 రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రంలో ఉన్నాయి. రైతులు నేరుగా ఆర్బీకేలకు వెళ్లి వారికి కావల్సిన ఏవైనా నాణ్యమైన ఉత్పత్తులు వారికి అందజేస్తున్నాం. ఇలాంటివి దేశంలో ఎక్కడాలేదు. రైతు భరోసా కేంద్రం నాలెడ్జ్ సెంటర్లుగా, కొనుగోలు కేంద్రాలుగా పనిచేస్తున్నాయి.
*సీడ్ టు సేల్ కాన్సెప్ట్ మొచ్చుకున్న జర్మనీ దౌత్యవేత్తలు*
కేంద్రంలో వ్యవసాయ చట్టాలపై ఉద్యమం జరుగుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎలాంటి ఉద్యమాలు, డిమాండ్లకు తావులేకుండా అమలవుతున్నాయి. గతంలో రైతులకు ఏమైనా చేయాలంటే ఎర్రజెండాలు ఎగరాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎగురుతున్న ఒకే ఒక్క జెండా.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి జెండానే. వారి అజెండానే ఈ ప్రభుత్వమని కన్నబాబు అన్నారు. రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు అందజేసి, రైతు గ్రూపులు ఏర్పాటు చేసి బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమిస్తున్నాము. రైతు ఆర్బీకేలకు వెళ్తే అన్ని కార్యక్రమాలు చూసుకునేలా తీసుకువచ్చామన్నారు. ఆర్బీకేలకు నూతనంగా సొంత భవనాలు నిర్మిస్తున్నాం. ఆర్బీకేలకు మంచి నెట్‌వర్క్ తీసుకువచ్చామని కన్నబాబు తెలిపారు.ఇలాంటి ఆర్బీకేలపై నీతి అయోగ్ ఛైర్మన్ స్వయంగా స్పందించి మన అధికారులను పిలిపించి శభాష్ అన్నారు. ఇలాంటి వ్యవస్థ దేశంలో ఉండాలని నీతి అయోగ్ చెప్పింది. జర్మనీ దౌత్యవేత్తలు సీడ్స్ టు సేల్ కాన్సెప్ట్ విశ్వ వ్యాప్తంగా ఉండాల్సిందన్నారు.
*చంద్రబాబే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు*
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా?
ఈ రాష్ట్రంలో రైతాంగానికి శ్రీ జగన్ ఏం చేశారో, చరిత్రలో ఏవిధంగా నిలిచిపోతారో.. గత ప్రభుత్వంలో వైఫల్యాలు, చేసిన మోసాలను డైవర్ట్ చేయటానికి చంద్రబాబు మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అసందర్భంగా మాట్లాడిన రికార్డుల నుంచి తొలగించాలని కన్నబాబు కోరారు. అసలు చంద్రబాబు గురించి మాట్లాడితే ఏడాది పాటు సభ పెట్టినా సరిపోదని విమర్శించారు. చంద్రబాబు కౌగిలించుకోని పార్టీ ఒక్క వైయస్‌ఆర్‌సీపీ మాత్రమే. ఒకసారి జనసేన, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కౌగిలించుకున్నారు. రాహుల్ గాంధీ మీద చేయి వేశారు. కాంగ్రెస్ మటాష్ అయిపోయింది. ఎన్టీఆర్ నుంచి మోడీ వరకు ఏం మాట్లాడారు. హోం మంత్రి అమిత్ షా తిరుపతికి వస్తే రాళ్లు వేయించిన చంద్రబాబు, ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆయన కాళ్లు పట్టుకున్నాడు. మోడీని, అమిత్‌షాను ఎన్ని తిట్టారు. వాళ్ల దగ్గర అధికార ప్రతినిధుల్ని పెట్టుకొని శ్రీ జగన్ గారిని పచ్చి మాటలు మాట్లాడించి తిట్టించారు. పార్టీలేదు బొక్క లేదని తిరుపతిలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే అన్న సంగతిని కన్నబాబు గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని మంత్రి ప్రశ్నించారు. మంగళగిరిలో కొడుకు లోకేశ్ ఓటమిని తట్టుకున్న గుండె చంద్రబాబుది, కుప్పంలోనూ ఓటమి ఆయనకు లెక్కకాదని కన్నబాబు అన్నారు. నిన్న అచ్చెన్నాయుడు సభ ఎన్నిరోజులు పెడతారని అడిగారు. ఈ 26వరకు విజయగాథలు రోజూ ప్రతిపక్షం వింటారు. శ్రీ జగన్ విజయాలతో ప్రతిపక్షం బాధ, కోపం, అసూయతో ఉన్నారు.
*ఆర్బీకేలకు ప్రతిష్ట సంస్థల పురస్కారాలు*
ఆర్బీకేల ఏర్పాటుతో రైతుల గుండెల్లో శ్రీ జగన్
FAO (The Food and Agriculture Organization)వాళ్లే ముందుకు వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం అవుతామని చెప్పటం చిన్న విషయం కాదని కన్నబాబు చెప్పారు. రైతాంగానికి ఎరువుల సప్లై చేసే విషయంలో మార్గదర్శిగా ఉన్నారని డెరెక్టర్ ఆఫ్ ఫెర్టిలైజర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అన్నారు. కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో తిరిగి ఈ వ్యవస్థను మా దగ్గర పెడతామని మీ సహకారం కావాలని అడిగి వెళ్లారు. కమ్యూనిస్టులకే ఆదర్శంగా మా ముఖ్యమంత్రి నిలిచారు. తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చి ఆర్బీకేల ద్వారా అద్భుతమైన వ్యవస్థ ఏపీలో నడుస్తోందన్నారు. దీన్ని కూడా ఆర్బీకేలను దత్తత తీసుకుంటామని తెలంగాణ మంత్రి అన్నారు. ఆర్బీకేలకు స్కోచ్ గోల్డ్ 2021 వచ్చింది. ఇవన్నీ మనం అడిగి తెచ్చుకున్నవి కావు. వేరే సమ్మిట్‌లకు వెళ్లి తెచ్చుకున్నవి కాదు. వారంతట వారు వచ్చి వ్యవస్థను మెచ్చుకొని ఇచ్చారు. ఫ్రేంలు మేం కట్టించుకోవటం కాదు. రైతుల గుండెల్లో, ఇళ్లలో శ్రీ జగన్ ఫ్రేమ్‌లు కట్టించుకుంటున్నారు.
గ్రామ, మండలి, జిల్లా స్థాయిల్లో రైతు సలహా మండలి ఏర్పాటు చేశాం
ప్రతి గ్రామంలో పార్టీ, కులం చూడకుండా.. అనుభవం ఉన్న రైతులతో సలహా మండలి ఏర్పాటు చేశాం. ప్రతి నెలా మొదటి శుక్రవారం వారు సమావేశమై అజెండాను మండలంకు పంపిస్తారు. ప్రతినెలా రెండో శుక్రవారం మండలి సలహా మండలికి పంపుతారు. అందులో శాసనసభ్యుల్ని భాగస్వామ్యుల్ని చేశాం. మూడో శుక్రవారం జిల్లా స్థాయి సలహా మండలి కూర్చుంటారు. సీనియర్ రైతును ఛైర్మన్‌గా పెట్టాం. గౌరవ ఛైర్మన్‌గా ఇంఛార్జి మినిస్టర్, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ భాగస్వాములు అవుతారు. వారు తీసుకున్న నిర్ణయాలు అగ్రికల్చర్ కమిషనర్, అనుబంధరంగాల కమిషనర్లు, సెక్రటరీలు ఒక విధానంలో తీసుకొచ్చి ఉన్నతస్థాయిలో మాట్లాడి తక్షణమే ఆదేశాలు ఇస్తారు. దాదాపు లక్ష మంది రైతుల భాగస్వామ్యంలో రైతలు సలహా మండలి నడుస్తోంది. ముఖ్యమంత్రిగా శ్రీ జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు మార్కెట్ కమిటీలకు గౌరవ ఛైర్మన్‌లుగా ఎమ్మెల్యేలను నియమించారు. కుప్పంకు చంద్రబాబు, అచ్చెన్నాయుడు తన నియోజకవర్గానికి ఛైర్మన్. ఒక్కరోజైనా ఒక్క సలహా ఇచ్చారా అని కన్నబాబు ప్రశ్నించారు. కడుపు మంటతో రగిలిపోవటం తప్ప ఏమీ చేయలేదు.
*రైతుల కోసం కాల్ సెంటర్*
రైతులకు సంబంధించి డిస్ట్రిక్ రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేసి ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ 15525 నెంబరు ఇచ్చాం. 2020-21లో (మే 2020) 3.50 లక్షల కాల్స్ రైతులకు అవసరమైన సమాచారం ఇవ్వటం జరిగింది. దీనికోసం యూనివర్శిటీల నుంచి శాస్త్రజ్ఞులను తీసుకువచ్చాం. ఆర్బీకేల నుంచే శాస్త్రజ్ఞులతోసమాధానం ఇచ్చే పరిస్థితి తెస్తున్నాం. రైతు వాట్సా్ప్ ద్వారా పురుగు ఫొటో పంపిస్తే రెస్పాన్డ్ అయ్యే విధంగా తీర్చిదిద్దనున్నాం. రైతు భరోసా కేంద్రాలపై ఆర్బీకే ఛానల్ ఏర్పాటు చేయనున్నాం. ఎప్పటికప్పుడు రైతులకు అవసరమైన అధునాతనమైన విధానాలు, మార్కెట్ వివరాలు అందించే కార్యక్రమం చేస్తున్నాం.
*గతం కంటే రెట్టింపైన వ్యవసాయ బడ్జెట్*
2014-15లో రూ.13,846 కోట్లు వ్యవసాయానికి బడ్జెట్‌లో చంద్రబాబు కేటాయించారు. 2021-22లో రూ.31,256 కోట్లు సీఎం శ్రీ జగన్ గారు వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయించారని కన్నబాబు తెలిపారు. లబ్దిదారులు ఎక్కడైనా పెరగటం చూస్తామా? ప్రతి ఏడాది మిగిలిపోయిన లబ్దిదారులకు కూడా సాయం చేయమని సీఎం శ్రీ జగన్ చెప్పారు. చంద్రబాబు పెట్టిన బకాయిలు ఏవీ రైతు మోయకూడదని సీఎం శ్రీ జగన్ గారు సాయం చేశారు.
ఆయిల్‌ఫాం రైతుకు గతంలో టన్నుకు రూ.7వేలు వస్తే.. ఇప్పడు రూ.19,300లు వస్తున్నాయ్
ఆయిల్ ఫాం రైతులకు గతంలో టన్నుకు రూ.7వేలు వచ్చేవి. సీఎం శ్రీ జగన్ ఒక కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణకు సమానంగా ఇవ్వాలని జీఓలు ఇచ్చారు. దానిపై కొంత మంది కోర్టులకు వెళ్లినా రైతాంగానికి, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. ఇప్పడు టన్నుకు రూ.19,300లు ఆయిల్ ఫాం రైతులకు వస్తోంది. రేటు పెరగటం, ప్రభుత్వం తోడుగా ఉండటంతో తోటల విస్తరణ జరుగుతోంది. మొక్కలు కూడా దొరకటం లేదు.
రూ.136 కోట్ల విలువైన పొగాకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేశాం
చెరుకు అంటేనే చంద్రబాబు గుర్తుకు వస్తారు. ఎందుకు అంటే.. చెరుకు కర్మాగారాలన్నింటినీ చంద్రబాబు ప్రైవేటీకరించారు. చెరకు రైతును కాపాడతామని కన్నబాబు తెలిపారు. పొగాకు రైతులకు దన్నుగా ప్రభుత్వం నిలిచింది. పొగాకు ధర పడిపోతుంటే.. సీఎం శ్రీ జగన్ సమావేశం పెట్టి ఐటీసీ కంపెనీలు ఉన్నచోట రేపటి నుంచి ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేస్తుంది. మీరు మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయొద్దని సీఎం గారు అన్నారని కన్నబాబు తెలిపారు. 48 గంటల్లో మార్క్‌ఫెడ్ ద్వారా రూ.136 కోట్ల పొగాకు కొని ధరల స్థిరీకరణ చేశామని కన్నబాబు తెలిపారు. గతంలో ఏనాడైనా ఇలా రైతులకు మేలు చేయాలని చంద్రబాబు ఆలోచించారా అని కన్నబాబు ప్రశ్నించారు. శెనగ రైతులు నష్టపోయారని ప్రతి ఎకరానికి 6 క్వింటాలు రూ.9000 చొప్పన సీఎం శ్రీ జగన్ మంజూరు చేశారు. ఇలాంటి ఆలోచన ఏనాడైనా ఇచ్చారా అని కన్నబాబు నిలదీశారు.
*విత్తనాలు అందించే రైతుకు లబ్ది చేకూరుస్తున్నాం*
వచ్చే ఐదేళ్లలో ఏ పంట పండిస్తారు. ఏ క్వాలిటీ సీడ్ అందించాలి. రైతుల రిజిస్ట్రేషన్ పక్కాగా చేసి సీడ్ పాలసీ తీసుకువచ్చాం. సీడ్ పాలసీ అమలు చేసే విషయంలో అవసరమైతే విత్తనాలు సేకరించి.. వాటిని ప్రభుత్వానికి ఇచ్చే రైతుకు కేజీకి రూ.10లు ఎక్కువైనా ఇవ్వండని సీఎం శ్రీ జగన్ చెప్పారు. ఆ ప్రకారం.. సీడ్ పాలసీ తీసుకువచ్చాం. అలాగే సీఎం శ్రీ జగన్ సూచనల మేరకే పుడ్ ప్రాసెసింగ్ పాలసీని రూపొందించామని కన్నబాబు తెలిపారు.
*ఆర్గానిక్ పాలసీపై చర్చలు జరుగుతున్నాయ్.* ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజన్సీ రాష్ట్రంలో తెచ్చాం.
రాష్ట్రంలో ఎరువులు తగ్గాలని ప్రకృతి పంటలు పండిస్తే ఇన్సెంటివ్ ఇవ్వాలని పాలసీ తీసుకువస్తున్నాము. పురుగు మందులపై మార్కెట్ మాయాజాలంలో కంపెనీలు తయారు చేయిస్తున్నాయి. ఏ జిల్లాలో పురుగు మందులు, ఎరువులు వినియోగం ఎక్కువ ఉందో చూసి ఆర్గానిక్ పాలసీ తయారు చేస్తున్నాం. ప్రపంచానికే పాఠాలు నేర్పామన్న గత ప్రభుత్వ నాయకుడు.. లేని వ్యవస్థల్ని సృష్టించాలని ప్రయత్నించలేదు. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ గతంలో రాష్ట్రంలో లేదు. కానీ సీఎం శ్రీ జగన్ గారి నేతృత్వంలో ఏజెన్సీ తీసుకువచ్చామని కన్నబాబు తెలిపారు.
అడ్వైజరీ బోర్డుల సహకారంతో ఇతర పంటలు పండించేలా రైతుల్ని ప్రోత్సహిస్తున్నామని కన్నబాబు చెప్పారు. కులం, మతం, పార్టీ చూడటం లేదని ప్రతి ఒక్కరూ ప్రతి దాంట్లో లబ్ధిదారులుగా ఉండాలి. రాజకీయ కారణాల వల్ల ఒక కుటుంబానికి నష్టం జరిగినా ఒప్పుకోను అని సీఎం శ్రీ జగన్ చెప్పటమే కాకుండా దానికోసం వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ తెచ్చారు. తద్వారా ఎవరి చేతులు తడపాల్సిన అవసరం లేకుండా సోషల్ ఆడిట్ కూడా జరుగుతోందని కన్నబాబు వివరించారు. వ్యవసాయం అంటే కేవలం పంటలు పండించటం విత్తనాలు, సబ్సిడీలు కాదు. అన్ని రంగాలు కలిపి కలిసికట్టుగా ముందుకు తీసుకుపోవటమనేది సీఎం శ్రీ జగన్ ఫిలాసఫీ. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కటీ అభివృద్ధి చేస్తున్నామని కన్నబాబు తెలిపారు. పశు సంవర్థశాఖలో దేశంలో తొలిసారిగా సంచార వైద్యశాలలు అంబులెన్స్‌లు ప్రవేశపెట్టడం జరిగింది. మనిషికి ఆపద వస్తేనే.. 108 గత ప్రభుత్వంలో రాలేదు. కానీ పశువుల కోసం తొలిసారిగా సంచార వెటర్నటీ క్లినిక్స్ మంచి పేరు తెచ్చుకుంటాయని కన్నబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానికంగా 58 గోజాతి పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా 53 నూతన వెటర్నరీ ఆసుపత్రులను రెండేళ్లలో ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా వెటర్నటీ ఆసుపత్రులను కూడా నాడు-నేడు కింద అభివృద్ధి చేయనున్నామని కన్నబాబు తెలిపారు. వైయస్‌ఆర్ పశునష్టపరిహారం కింద సాయం అందిస్తున్నాం. పాడి పశువు చనిపోతే రూ.30వేలు, గొర్రె, మేక చనిపోతే రూ.6వేలు సీఎం శ్రీ జగన్ వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్నారు. వైయస్‌ఆర్ పశునష్టపరిహారం కింద ఇప్పటి వరకు రూ.169.52 కోట్లు సాయం అందజేయటం జరిగింది. గాలికుంట తొలగించాలని రెండేళ్లుగా ప్రభుత్వం చేసిన కృషి వల్ల ఇప్పుడు ఆ వ్యాధి రాష్ట్రంలో లేదు. 154 నియోజకవర్గాల్లో పశువ్యాధి నిర్ధారణ కేంద్రాలు మంజూరు చేయటం జరిగిందని కన్నబాబు తెలిపారు.
addComments
Post a Comment