విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు, సంస్కరణలకు, సంక్షేమ పథకాలకు మూలబిందువై


అమరావతి (ప్రజా అమరావతి);


*జగనన్న విద్యా దీవెన – పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌*


*క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*ఈ సందర్భంగా మాట్లాడిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యార్ధులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*ఆదిమూలపు సురేష్‌, విద్యాశాఖ మంత్రి*


విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు, సంస్కరణలకు, సంక్షేమ పథకాలకు మూలబిందువై



, అమ్మ ఒడిలాంటి గొప్ప పధకానికి స్పూర్తిదాతగా నిలిచిన సీఎంగారికి ధన్యవాదాలు. ఈ రోజు మరపురాని రోజు, ఇచ్చిన మాటకు కట్టుబడిన రోజు. ఒక భరోసా, ఒక విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన రోజు. పేదరికం ఉన్నత విద్యకు అడ్డు కాకూడదనే ఉద్దేశంతో జగనన్న విద్యా దీవెన పధకాన్ని తీసుకొచ్చారు. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు ఉన్నత ఆశయంతో ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ పధకాన్ని ప్రవేశపెట్టారు. కానీ గత ప్రభుత్వం ఈ పధకానికి తూట్లుపొడిచి, అరకొర ఫీజులు చెల్లించి, మోసం,దగాతో పరాభవం చెంది అధికారాన్ని కోల్పోయింది. కోవిడ్‌లాంటి క్లిష్ట సమయంలో కూడా ఏటికి ఎదురొడ్డి అనేక చట్టాలను తీసుకొస్తూ, ఉన్న చట్టాలను సవరిస్తూ ఉన్నత విద్యకు పేదరికం అడ్డుకాకూడదన్న లక్ష్యంతో ఈ పధకాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. అభివృద్ది, సంక్షేమానికి వైఎస్‌ఆర్‌ ఒక అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తాననే మాటను నిజం చేశారు. ఫుల్‌ ఫీజ్‌ రీఇంబర్స్‌మెంట్‌ చేస్తూ విద్యార్ధులకు వారి తల్లిదండ్రులకు భరోసానిస్తూ ముందుకెళుతున్నారు. ఉన్నత ప్రమాణాలతో నడుస్తున్న కాలేజీలలో చదువుకుంటున్న విద్యార్ధుల ర్యాంకులే ఇందుకు ఉదాహరణ. జగనన్నను విద్యార్ధులు వారి మేనమామగా భావిస్తున్నారు. ప్రతీ విద్యార్ధి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను. సీఎంగారికి వస్తున్న మంచి పేరు చూసి తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీ నేతలు కడుపుమంటతో నీచంగా మాట్లాడుతున్నారు. విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారు. అక్కచెల్లెమ్మలందరూ మా ఆయుష్షు కూడా పోసుకుని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్పూర్తిగా దీవిస్తున్నారు. ధ్యాంక్యూ సార్‌. 


*అలివేలు మంగ, విద్యార్ధి తల్లి, తూర్పుగోదావరి జిల్లా*


నమస్తే అన్నా, మీకు హృదయపూర్వక వందనాలు, అన్నా మీరు ప్రవేశపెట్టిన పధకాల్లో విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి పధకాలు ఎక్సలెంట్‌. నాలాంటి ఒంటరి మహిళలు ఈ రోజు పిల్లలను చదివించుకుంటున్నామంటే అది మీ వల్లే. గతంలో మా అబ్బాయి పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేసుకుంటూ చదువుకునేవాడు, కానీ ఈ రోజు ఫుల్‌ ఫీజు ఇస్తున్నారు, అంతేకాదు వైఎస్సార్‌ చేయూత ద్వారా నేను చాలా లబ్దిపొందాను, నేను రెండు సార్లు రూ. 18,750 తీసుకున్నాను, ఆ డబ్బుతో చిన్న వ్యాపారం ప్రారంభించాను. గతంలో నేను డ్వాక్రా మహిళగా ఉన్నా రుణమాఫీ జరగలేదు, మీరు వచ్చిన తర్వాత మా గ్రూప్‌లో రుణమాఫీ జరిగింది. మేం కట్టిన ప్రతీ రూపాయికి వడ్డీ కూడా వెనక్కి వచ్చింది. నా భర్త నన్ను, పిల్లలను వదిలేసి వెళ్ళిపోయాడు, అగ్రిగోల్డ్‌లో జాయిన్‌ అయి చాలా మందితో డబ్బు కట్టించి, వారంతా నా ఇంటిపై రాళ్ళేసిన రోజులున్నాయి, విజయవాడలో రోడ్లపై పోరాటాలు చేసినా ఒక్క రూపాయి వెనక్కిరాలేదు. మీరు వచ్చిన తర్వాత రెండు దఫాలుగా మాకు డబ్బు అందింది, ఆ డబ్బుతో పిల్లలకు కంప్యూటర్‌ ఫీజులు కట్టాను. నేను చాలా లబ్దిపొందాను. కోవిడ్‌ సమయంలో కూడా మీరు రేషన్,డబ్బు ఇచ్చారు, మీరు ఇంటింటికీ రేషన్‌ పంపుతున్నారు. నేను ఒకే రోజు మీకు 18 చోట్ల పాలాభిషేకం చేశాను సార్‌. నేను డ్వాక్రా గ్రూప్‌ లీడర్‌ను. వలంటీర్‌ వ్యవస్ధ చాలా బావుంది, ప్రతీ ఇంటికి వచ్చి అన్నీ దగ్గరుండి చూస్తున్నారు. ఇంటింటికీ వచ్చి వ్యాక్సిన్‌ వేస్తున్నారు. నాకు ఉన్న తమ్ముడు కూడా ఇంత చూడలేదు, మీరు అంతకంటే ఎక్కువగా చూస్తున్నారు. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను, ధ్యాంక్యూ సార్‌


*తన్మయి, విద్యార్ధిని, కర్నూలు జిల్లా*


సార్, నేను ఏపీ ఎంసెట్‌ కౌన్సిలింగ్‌లో ప్రైవేట్‌ యూనివర్శిటీలో సీట్‌ సాధించాను. నాకు చాలా ఆనందంగా ఉంది. విట్‌ యూనివర్శిటీ గురించి నేను విన్నాను, అక్కడ ధనవంతుల పిల్లలే చదువుకుంటారని అనుకున్నా, మా తల్లిదండ్రులు మధ్య తరగతి వారు, అంత స్ధోమత లేదు, కానీ ఈ ఏడాది నేను మీ ద్వారా 35 శాతం కోటాలో సీట్‌ పొందానంటే అది మీ వల్లే. నేను కలలో కూడా ఊహించలేదు. మీరు దేశంలోనే మొదటి రాష్ట్రంగా ప్రైవేట్‌ యూనివర్శిటీలలో కూడా గవర్నమెంట్‌ కోటా తెచ్చి నాలాంటి చాలామంది పిల్లలను చదివిస్తున్నందుకు ఆనందంగా ఉంది. మీరు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా మైక్రోసాఫ్ట్‌ ప్రోగ్రామ్‌ తెచ్చి మా డిగ్రీలు పూర్తయ్యేసరికి జాబ్‌ వచ్చే విధంగా తీర్చిదిద్దుతున్నారు. నేను ఎప్పుడూ మర్చిపోలేను, నాతో పాటు నా తోటి విద్యార్ధుల అందరి తరపునా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 


*సత్యరాజేశ్వరి, బీటెక్‌ ఫైనల్‌ ఇయర్, జేఎన్టీయూ, విజయనగరం*


అన్నా మాది మధ్యతరగతి రైతు కుటుంబం, నేను డిప్లొమా చదువుతున్న సమయంలో బీటెక్‌ చదవాలా వద్దా అని ఆలోచిస్తూ మీరు ప్రవేశపెట్టిన విద్యాదీవెన, వసతి దీవెన పధకాల గురించి తెలుసుకుని ధైర్యంగా బీటెక్‌లో జాయిన్‌ అయ్యాను. అనుకున్నట్లే మీరు టైం ప్రకారం ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ తల్లుల ఖాతాల్లో వేస్తున్నారు, దీంతో మేం మా కాలేజీ యాజమాన్యాలకు చెల్లించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకుంటున్నాం. అలాగే మాకు హాస్టల్‌ అవసరాల కోసం వసతి దీవెన పధకాన్ని రూ. 20 వేలకు పెంచడం జరిగింది. ఇందులో మొదటి దఫా రూ. 10 వేలు అందాయి, అంతేకాదు మీరు ల్యాప్‌టాప్‌ ఆప్షన్‌ పెట్టడం వల్ల మా ఆన్‌లైన్‌ ఉద్యోగాలకు, ఇంటర్న్‌షిప్‌కు చాలా ఉపయోగంగా ఉంది, దీంతోపాటు మైక్రోసాఫ్ట్‌ ప్రొడక్ట్స్‌ మీద శిక్షణ ఇప్పించడం వల్ల మాకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. దిశ యాప్, దిశ పోలీస్‌ స్టేషన్ల వల్ల మేం ధైర్యంగా బయటికి వెళ్ళగలుగుతున్నాం. మేం చదువుతున్న కాలేజీని మీరు యూనివర్శిటీ హోదా కల్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చాలా ఇబ్బందులు పెట్టినా మీరు చెరగని చిరునవ్వుతో మాకు సేవ చేయడానికి సీఎంగా తిరిగొచ్చారు. దేవుడే సీఎం రూపంలో మాకు వచ్చారా అని మేం ఫీలవుతున్నాం. మీరే మళ్ళీ మళ్ళీ సీఎంగా రావాలని మా యువత కోరుకుంటుంది. మీ మంచితనాన్ని గురించి చెప్పాలంటే సమయం సరిపోదు, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.


*నాగసాయి, విద్యార్ధిని తల్లి, శింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా*


అన్నా నాకు ఇద్దరు పాపలు. పెద్దపాప ట్రిబుల్‌ఐటీలో, చిన్నపాప బీకామ్‌ కంప్యూటర్స్‌ చదువుతున్నారు. మేం మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాం, మీరు మాలాంటి పేదలను దృష్టిలో ఉంచుకుని విద్యాదీవెన, వసతిదీవెన పధకాలు పెట్టారు. మేం పిల్లలను చదివించలేక ఆపేద్దామనుకునే సమయంలో ఈ పధకాలు వచ్చాయి. మీరు చెప్పిన ప్రతీ మాట గుర్తుంది, చదువు అనే ఆస్తి మీరు మాకు పంచారు, విద్యాదీవెనలో మాకు రెండు దఫాలుగా లబ్దిజరిగింది, వసతి దీవెనలో వచ్చిన డబ్బు కూడా మేం యాజమాన్యానికి చెల్లించాం. మీరు పాదయాత్రలో చెప్పిన ప్రతీ మాట నెరవేర్చుతున్నారు. మా కుటుంబం చాలా పధకాల ద్వారా లబ్దిపొందింది. నాడు నేడు పధకం ద్వారా విద్యాలయాలను దేవాలయాలుగా మార్చారు మీరు. దీని వల్ల గతంలో ఎవరూ గవర్నమెంట్‌ స్కూల్‌కు వెళ్ళేవారు కాదు కానీ ఇప్పుడు అందరూ వెళ్తున్నారు. మీరు సచివాలయ వ్యవస్ధని తీసుకురావడం వల్ల వలంటీర్‌లు వచ్చి ప్రతి పధకం గురించి చెబుతున్నారు. మా ఇంటి ముందుకే రేషన్‌ వస్తుంది, రైతు భరోసా లబ్ది కూడా మా మామయ్యకు వచ్చింది, మాలాంటి పేదలను మీరు ముందుకు తీసుకెళ్ళాలని, పేదరికాన్ని చదువనే ఆస్తిని ఇచ్చి తొలగించాలని మరలా మరలా కూడా మీరే సీఎంగా రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నా. ధ్యాంక్యూ.

Comments