"మహిళలపై హింసను తుదముట్టించాలి
" అనే యునైటెడ్ నేషన్స్ యొక్క క్యాపెయిన్ లో భాగంగా గుంటూరు (ప్రజా అమరావతి); కె.ఎల్.విశ్వవిద్యాలయం యొక్క గ్రీవన్వెస్ రెడ్రెస్సల్, ఉమెన్స్ ఫారం ఆధ్వర్యంలో కేఎల్ షిరోస్ టీం స్వీయ రక్షణ అవగాహన మరియు అభ్యాస కార్యక్రమం అనే కార్యక్రమం గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో నవంబర్ 23 నుంచి 26 వరకు నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి వెంగళాయపాలెం సర్పంచ్ లలిత, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి సమాజంలో మహిళలు వారి కుటుంబం పిల్లల పెంపకం కోసం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మహిళలు ఆదర్శవంతమైన పాత్రను పోషిస్తున్నారని అన్నారు.మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ది సాధించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని పేర్కొన్నారు.మహిళలను వివిధ అంశాలపై చైతన్యపరిచి సమాజంలో ఎదురవుతున్న సమస్యలపై స్పందించేందుకు ముందుకురావాలన్నారు. మహిళలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. అనంతరం విశ్వవిద్యాలయ విద్యార్థి సంక్షేమ అధికారి డీన్ డాక్టర్ కెఆర్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ,కేఎల్ షిరోస్ టీం అనేది విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు కలిసి మహిళా సాధికారత మరియు లింగ వివక్షిత నిర్మూలన లక్ష్యంగా పని చేస్తుందని తెలిపారు.కేఎల్ షిరోస్ టీం ద్వారా వివిధ గ్రామంలో, పాఠశాలలో లింగ వివక్షిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.వెంగళాయపాలెంలో విద్యార్థులకు స్వీయ రక్షణ పై అవగాహన కల్పించి, వారికి వ్యాస రచన పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్వైసర్ డాక్టర్ హబీబుల్లా ఖాన్ ,ఉమెన్స్ ఫోరం ఇన్చార్జి డాక్టర్ లలిత, కేఎల్ షిరోస్ టీం అధ్యాపకులు డాక్టర్ వాసుజాదేవి, డాక్టర్ సౌజన్య, డాక్టరు రుతురమ్య, డాక్టర్ శ్రీ లక్ష్మి పాల్గొన్నారు.
addComments
Post a Comment