ఏ టెక్నాలజీ వాడినా ఆ ఫలాలను ప్రజలకు క్షేత్రస్థాయిలోఅందించి వారికి సత్వర న్యాయం చేకూర్చినప్పుడే అది అర్థవంతం



డి‌జి‌పి కార్యాలయం మంగళగిరి (ప్రజా అమరావతి);


జాతీయస్థాయిలో మరోసారి సత్తా చాటిన ఏపీ పోలీస్ శాఖ....ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నూతన ఆవిష్కరణలు, తీసుకువస్తున్న సంస్కరణలు, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెక్నాలజీ వినియోగంలో  మూడు జాతీయ స్థాయి సంస్థలు(SKOCH, FICCI, NCRB/MHA) దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  పోలీసు శాఖ ను ప్రధమ  మరియు ఉత్తమ రాష్ట్రంగా గుర్తించి గౌరవించడం విశేషం. ఒకే రోజు మరో 20 అవార్డులను అందుకున్న ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ. మొత్తం 150 జాతీయ అవార్డులను ఏపీ పోలీస్ శాఖ దక్కించుకోవడం గమనార్హం. SKOCH అవార్డులను ఈ రోజు దక్కించుకున్న జిల్లా పోలీస్ యూనిట్ లు. పోలీస్ ప్రధాన కార్యాలయం (6),అనంతపురం (3), చిత్తూరు (3), కృష్ణ (3),తిరుపతి అర్బన్ (2), కడప (2),  పోలీస్ బెటాలియన్స్ (1).


*స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ " అవార్డు వివరాలు* 

ఆటోమేటెడ్ పోలీస్ ఆన్‌లైన్ సిస్టమ్(AP పోలీస్ Hqrs)

హాక్ వెహికల్(AP పోలీస్ కమ్యూనికేషన్స్)

సమ్మానము(APSP బెటాలియఎన్)

కోవిడ్ ట్రీట్‌మెంట్ ట్రాకర్(DIG , ATP)

కోవిడ్ సెల్(అనంతపురం)

ఫ్యాక్షన్ కంట్రోల్ సెల్(అనంతపురం)

ఆపరేషన్ సమైఖ్య(చిత్తూరు)

టెక్నికల్ అనాలిసిస్ వింగ్(చిత్తూరు)

ఐ-స్పార్క్(కడప)

టెక్ సపోర్ట్ ఆన్ వన్ క్లిక్‌(కడప)

గ్రామ సంరక్షణ దళం - విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్(కృష్ణ) 

పోలీస్ వెల్ఫేర్ ఇన్ పాండమిక్(కృష్ణ)

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ప్రకాశం)

త్రినేత్ర(తిరుపతి అర్బన్)

*SKOCH సిల్వర్ అవార్డ్స్ ప్రాజెక్ట్ పేరు*

ఆటోమేటెడ్ పోలీస్ ఆన్‌లైన్ సిస్టమ్(AP పోలీస్ Hqrs).

హాక్ వెహికల్ (AP పోలీస్ కమ్యూనికేషన్స్)

3 నేత్ర (తిరుపతి అర్బన్ యూనిట్)

పోలీస్ వెల్ఫేర్ ఇన్ పాండమీక్ (కృష్ణా యూనిట్)

ఆపరేషన్ సమైఖ్య(చిత్తూరు యూనిట్)

కోవిడ్ ట్రీట్‌మెంట్ ట్రాకర్(DIG , ATP)


ఈ‌ సంధర్భంగా గౌరవ డి‌జి‌పి గారు మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ టెక్నాలజీ వినియోగంలో  దేశంలోనే  అగ్రగామిగా కొనసాగుతుందని ఇప్పటికే జాతీయ స్థాయిలో  అత్యంత స్వల్ప  కాలంలో 150 జాతీయ అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ దక్కించుకుంది. ఏ  టెక్నాలజీ వాడినా ఆ ఫలాలను ప్రజలకు క్షేత్రస్థాయిలోఅందించి వారికి సత్వర న్యాయం చేకూర్చినప్పుడే  అది అర్థవంతం 



అవుతుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఇప్పటివరకు చేసిన మరియు చేస్తున్న కృషి నాకు ఎంతగానో సంతృప్తినిచ్చింది.ఈ విజయం వెనుక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిరంతర సూచనలు, సలహాలు, దిశా  నిర్దేశం, వెన్నుతట్టి ప్రోత్స హించడం ఎంతగానో తోడ్పాటుని అందించింది .ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి గారికి పోలీస్ శాఖ తరుపున  కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం ఏ ఒక్కరితోనూ సాధ్యమయ్యేది కాదు. క్షేత్ర స్థాయి సిబ్బంధి  నుండి ఉన్నత స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ నిరంతరం శక్తివంచన లేకుండా చేస్తున్న కృషికి ప్రతిఫలం ఈ జాతీయ స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ దక్కించుకున్న గౌరవంగా భావిస్తున్నాను. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందని సగర్వంగా నేను తెలియజేస్తున్నాను.

ఈ సంధర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వైస్.జగన్ మోహన్ రెడ్డిగారు మాట్లాడుతూ రాష్ట్రం లోని ప్రజలకు సామాజిక న్యాయం, ముఖ్యంగా మహిళలు ,చిన్నారులు, సమాజంలో అత్యంత వెకబడిన వర్గాలకు చెందిన వారికి చేరుకునే విధంగా, వారికి  మెరుగైన భద్రత కల్పిస్తున్నాము అనే బరోసా  కల్పించేందుకు ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖలో గతంలో ఎన్నడు లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో తీసుకువస్తున్న సమూలమైన  మార్పులు, సిబ్బంది లోని జబాబుదారీతనం ప్రజలకు సత్వర న్యాయం అందించే దిశగా  వస్తున్న మార్పులు, దేశంలో ఎక్కడ లేనివిధంగా ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ  అత్యంత ఆధునిక టెక్నాలజీ ని వినియోగించడమే కాకుండా క్షేత్రస్థాయిలో దాని ఫలాలు రాష్ట్రం లోని  ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేస్తూ నిరంతరం ప్రజా రక్షణకు పాటుపడుతున్న పోలీసు శాఖను నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

Comments