ఈ సాయంత్రం చెన్నై వద్ద వాయుగుండం తీరం దాటుతుందని తెలిపిన వాతావరణశాఖ అధికారులు*భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల కలెక్టర్లతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*


అమరావతి (ప్రజా అమరావతి);

*ప్రకాశం, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు, చిత్తూరు, వైయస్సార్‌ కడప జిల్లాల కలెక్టర్లు, అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌*


*సమావేశంలో పాల్గొన్న వాతావరణ శాఖ అధికారులు*

*వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలపై వాతావరణశాఖ అధికారులనుంచి సమాచారం తీసుకున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*


ఈ సాయంత్రం చెన్నై వద్ద వాయుగుండం తీరం దాటుతుందని తెలిపిన వాతావరణశాఖ అధికారులుప్రస్తుతం చెన్నై ప్రాంతంలో 60–70 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపిన అధికారులు

ఎస్‌పిఎస్‌ఆర్‌ నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైయస్సార్‌ కడప జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపిన అధికారులు

బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరో అల్పపీడనం తుపానుగా మారి దక్షిణకోస్తాంధ్రాలో తీరందాటే అవకాశాలు ఉన్నాయని తెలిపిన అధికారులు

ఈనెల 17న ఇది తీరం దాటే అవకాశాలున్నాయని ప్రాథమిక అంచనాగా తెలిపిన అధికారులు

దీనివల్ల దక్షిణ కోస్తాంధ్రలో మరో విడత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు


*అనంతరం జిల్లాల కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*

ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి : సీఎం

తడ, సూళ్లూరుపేట, మరికొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీ కన్నా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు: 

నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి :

ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి:

ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఇప్పటికే చేరుకున్నాయి:

2 బృందాలు ఇప్పటికే నెల్లూరు చేరుకున్నాయి:

మరో 2 బృందాలు చిత్తూరు చేరుకున్నాయి:

కర్నూలులో మరో 2 బృందాలు సిద్ధంగా ఉన్నాయి:

మంగళగిరిలో కూడా అదనపు బృందాలను సిద్ధంచేశాం:

పరిస్థితులను బట్టి వారి సేవలను వినియోగించుకోవచ్చు: అధికారులకు స్పష్టం చేసిన సీఎం


*సహాయపునరావాస కేంద్రాలు*

అవసరమైన చోట సహాయ శిబిరాలు తెరవండి: సీఎం

సహాయ శిబిరాల్లో ఉంచిన వారిని బాగా చూసుకోండి:

వారికి మంచి ఆహారం అందించండి:

బాధితులకు వేయి రూపాయల చొప్పున  అందించండి:

బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకోండి:

బాధితులకోసం ఒక ఫోన్‌ నంబర్‌ను అందుబాటులో ఉంచండి:

వివిధ విభాగాలతో సమన్వయం చేసుకోండి:

లైన్‌ డిపార్ట్‌మెంట్లను సిద్ధంచేయండి:

ఎస్‌ఓపీల ప్రకారం అన్నిరకాల చర్యలను తీసుకోండి:

ముంపు ప్రాంతాలనుంచి ప్రజలను తరలించేలా చర్యలు తీసుకోండి:

అవసరమైన మందులను సరిపడా అందుబాటులో ఉంచుకోండి:

పీహెచ్‌సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో, జిల్లా ఆస్పత్రుల్లో అన్నిరకాల మందులను ఉండేలా చర్యలు తీసుకోండి:

వర్షాల అనంతరం కూడా పారిశుద్ధ్యం విషయంలో చర్యలు తీసుకోండి:

అత్యవసర సేవలకు అంతరాయం రాకుండా జనరేటర్లను కూడా చర్యలు తీసుకోండి:

విద్యుత్‌స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటే.. వెంటనే వాటిని ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి:

యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేలా విద్యుత్‌శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలి:

ఆహారం, తాగునీటి ప్యాకెట్లను బాధిత ప్రాంతాల్లో పంపిణీ చేయండి :

అవసరమైన మేరకు వీటిని సిద్ధంగా ఉంచుకొండి:

భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లు, చెరువులు, గండ్లు పడకుండా తగిన చర్యలు తీసుకొండి : 

నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండండి:

ఎప్పటికప్పుడు వర్షాలను, నీటి ప్రవాహాలను అంచనా వేసుకుంటూ.. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా నీటిని విడుదల చేయండి:

ఇదే సమయంలో తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకోండి: సీఎం

రోడ్లు ఇతరత్రా మౌలిక సదుపాయాలకు ఎక్కడ నష్టం వాటిల్లినా వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోండి:

తీవ్ర ప్రభావిత మండలాల్లో అగ్నిమాపక కేంద్రాలను, సిబ్బంది సేవలను వినియోగించుకోండి:

ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనావేస్తూ... ఆ వివరాలను వెంటనే పంపించండి :

ఫోన్‌కాల్‌కు మేం అందుబాటులో ఉంటాం.. ఇంకా ఏం కావాలన్నా వెంటనే తెలియజేయండి: అధికారులకు సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ నిర్దేశం. 


క్యాంప్‌ కార్యాలయం నుంచి వీసీలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి (మైనార్టీశాఖ) ఎస్‌ బి అంజాద్‌ బాషా, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వి ఉషారాణి, ఇతర ఉన్నతాధికారులు.