చిత్తూరు (ప్రజా అమరావతి);
చిత్తూరు జిల్లా పెద్ద పంజాణి మండలం, వీరప్పల్లే గ్రామము.
రెండవ రోజు కేంద్ర బృందం చిత్తూరు జిల్లా లో పర్యటన.
ఇంటర్ మినిస్టీరియ ల్ సెంట్రల్ టీమ్ సభ్యులు అభేకుమార్,డైరెక్టర్,మిని స్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు జిల్లా లో కురిసిన వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయి లో పరిశీలించు టలో భాగంగా శనివారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా పెద్ద పంజాణి మండలం, వీరప్పల్లే గ్రామము లో జరిగిన వరి పంట నష్టం ను పరిశీలించారు.
పెద్ద పంజాణి మండలం వీరప్పల్లే గ్రామము లో మొత్తం 194 ఎకరాలు ఉండగా 138 ఎకరాల్లో పంట నష్టం జరిగింది..అందులో 130 ఎకరాలలో వరి పంట సాగు చేయడం జరిగిందని,మిగిలిన 8 ఎకరాల లో చెరకు కాలిఫ్లవర్,బ్రింజల్, టమాటా పంటలు సాగు చేయడం జరిగిందని అధికారులు వివరించారు...
శనివారం మధ్యాహ్నం
చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం, చారాల గ్రామము
చౌడేపల్లి మండలం, చారాల గ్రామము లో వ్యవసాయం సాగు కింద వరి మరియు వేరుశెనగ 206 హెక్టార్ల లలో సాగు అవు తుండగా 103.24 హెక్టార్ల లలో పంట నష్టం జరగగా, ఉద్యాన వన పంటల సాగు 45 హెక్టార్ల లలో సాగు తుండగా 15 హెక్టార్ల లలో పంట నష్టం జరగిందని, టమోటా, బంగాళ దుంప, కాలి ఫ్లవర్ మరియు చామంతి, బంతి పూల కు నష్టం జరిగిందని అధి కారులు వివరిం చారు...
ప్రతి చోట రైతులు వారికి జరిగిన పంట నష్టం, నీట మునిగిన వరి పంట ను మరి యు ఉద్యాన వన పంటల నష్టం ను వివరిస్తూ.. మమ్మల్ని ఆదు కోవాలని రైతులుకేంద్ర బృందం సభ్యులకు విన్నవించుకున్నారు.
ఈ పర్యటనలో కేంద్ర బృందం సభ్యులు వెంట మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ జె.డి లు దొరసాని, వెంకట్రావ్,ఉద్యాన వన శాఖ డి డి శ్రీనివాసులు,ఇతర మం డల స్థాయి అధి కారులు,ప్రజా ప్రతి నిధులు, రైతులు కలరు
addComments
Post a Comment