స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం స్ఫూర్తిని నిల‌బెట్టండి

 స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం స్ఫూర్తిని నిల‌బెట్టండి


జిల్లా సంయుక్త కలెక్టర్  హౌసింగ్  నిశాంతి


అనంతపురం, నవంబర్11 (ప్రజా అమరావతి): దేశంలో ప్ర‌జాస్వామ్యం మ‌నుగ‌డ సాగించడానికి, స‌మాచార హ‌క్కు చ‌ట్టం ఎంతో కీల‌క‌మ‌ని, దాని స్ఫూర్తిని నిల‌బెట్టాల‌ని జిల్లా  సంయుక్త కలెక్టర్ (  హౌసింగ్)  నిశాంతి  స్ప‌ష్టం చేశారు. దీనిపై ప్ర‌తీఒక్క‌రూ అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని సూచించారు.


         స‌మాచార హ‌క్కు చ‌ట్టం వారోత్స‌వాల్లో భాగంగా, గురువారం

  శ్రీ కృష్ణదేవరాయ  యూనివర్సిటీ నందు గల  పాలిమర్ సైన్స్  డిజిటల్  కాన్ఫరెన్స్ లో  డిపార్ట్ మెంట్ అఫ్  లా,  యూనివర్సిటీ  , స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో  మరియు  ప్రొహిబిషన్  & ఎక్సైజ్  డిపార్ట్ మెంట్ లు సంయుక్తంగా  కలసి   సమాచార హక్కు  చట్టం అవగాహనా  సదస్సు  కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో J .రామ మోహన  రావు ,అడిషనల్  సూపరింటెండెంట్  అఫ్ పోలీస్ , SEB ,అనంతపురము  , ప్రొఫెసర్  జీవన్ కుమార్,  సమన్వయ కార్యకర్తగా Dr .R .S కుమరేశ్వరన్ , నోడల్ ప్రొహిబిషన్  & ఎక్సైజ్ సూపరింటెండెంట్, పాల్గొన్నారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ 

మాట్లాడుతూ, పౌరుల చేతిలో స‌మాచార హ‌క్కు చ‌ట్టం వ‌జ్రాయుధం లాంటిద‌ని పేర్కొన్నారు. ఈ చ‌ట్టం వ‌ల్ల పాల‌న‌లో పార‌ద‌ర్శ‌క‌త ఏర్ప‌డుతుంద‌న్నారు. ప్ర‌తీ పౌరుడు స‌మాచారాన్ని తెలుసుకొనే హ‌క్కు ఈ చ‌ట్టం వ‌ల్ల ల‌భిస్తుంద‌న్నారు. ఆర్‌టిఐ సెక్ష‌న్ 41బి ప్ర‌కారం, ప్ర‌తీ ప్ర‌భుత్వ కార్యాల‌యంలో 17 అంశాల‌తో కూడిన స‌మాచారాన్ని ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచాల‌న్నారు. అధికారులంతా త‌ప్ప‌నిస‌రిగా స‌మాచార‌హ‌క్కు చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌డం ద్వారా, ఈ చ‌ట్టం స్ఫూర్తిని నిల‌బెట్టాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో   విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు. విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


       

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image