గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకృతి విపత్తుల వల్ల ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్‌ ముగిసేలోగానే పంట నష్టపరిహారం పంపిణీ

 

అమరావతి (ప్రజా అమరావతి);


*గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకృతి విపత్తుల వల్ల ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్‌ ముగిసేలోగానే పంట నష్టపరిహారం పంపిణీ*




*2021 సెప్టెంబర్‌లో సంభవించిన గులాబ్‌ సైక్లోన్‌ కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ. 22 కోట్ల పంట నష్టపరిహారం క్యాంప్‌ కార్యాలయం నుంచి రైతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేసిన శ్రీ వైఎస్‌ జగన్‌*


*ఈ సందర్భంగా మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రైతులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి*


సార్, ఏదైనా ఒక మాట అంటే దానిని ఎలా నిలబెట్టుకోవాలనేది ఈ దేశంలో ఒకే ఒక నాయకుడు ఇవాళ ఉదాహరణగా ఉన్నారనడానికి నేనేం సందేహించడం లేదు. సెప్టెంబర్‌లో గులాబ్‌ తుఫాన్‌ వచ్చి పంట నష్టం జరిగితే 50 రోజులలోపు పరిహారం ఇస్తున్న ఏకైక రాష్ట్రం. దేశంలో మరే రాష్ట్రంలో ఇలా జరగలేదు. ఇది అతిశయోక్తి కాదు. ఈ రోజు రైతుల అకౌంట్‌లో మీరు వేయడమనేది రైతులు కూడా ఊహించి ఉండరు. దాదాపు 34,586 మంది రైతులకు రూ.22 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఈ రోజు మీ ద్వారా అందజేయడం, భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇది ఆసరాగా ఉంటుంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 13.96 లక్షల మంది రైతు కుటుంబాలకు వారి అకౌంట్లలో నేరుగా రూ. 1,071 కోట్లు పంట నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ప్రకృతి విపత్తు సహాయ నిధి రూ. 2 వేల కోట్లతో ఏర్పాటుచేసి ఏ కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా తక్షణమే రైతాంగాన్ని ఆదుకుంటామనే భరోసానివ్వడంతో పాటు ద్విముఖ వ్యూహంగా వ్యవసాయానికి, వ్యవసాయరంగానికి ఊతమిచ్చే విధంగా కదులుతున్నారు. ఒకటి వ్యవస్ధలను శాశ్వతంగా సమూలంగా మార్పు చేయడం, సంస్కరణలు తీసుకురావడం, తాత్కాలికంగా వెంటనే ఆదుకోవడం వంటి చర్యలతో మీ నాయకత్వంలో వ్యవసాయరంగం పురోగతి సాధిస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను, ధ్యాంక్యూ సార్‌


*వీర్రాజు చౌదరి, రైతు, పెదపూడి, అనపర్తి నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లా*


సీఎంగారు నమస్కారం, నేను ఐదెకరాలు సొంత భూమిలో, మరో ఐదెకరాలు కౌలుకు సాగు చేస్తున్నాను. నేను నిన్న ఆర్‌బీకేలో లైబ్రరీ చూద్దామని వెళ్ళాను, అక్కడ లిస్ట్‌లో మా కుటుంబం పేర్లు ఉన్నాయి, వెంటనే ఏవోని అడిగాను, ఆయన ఇన్‌పుట్‌ సబ్సిడీ లిస్ట్‌ పెట్టాం అన్నారు, నాకు ఐదెకరాలకు ఎకరాకు రూ. 6 వేల చొప్పున రూ.30 వేలు, మా చెల్లికి రూ. 30 వేలు, అమ్మకు రూ. 30 వేలు, మొత్తం రూ. 90 వేలు మా కుటుంబానికి వచ్చాయి. 45 రోజుల్లో ఈ పరిహారం వచ్చిందంటే మేం నమ్మలేకపోతున్నాం. నేను 30 ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నాను. కానీ ఇంత త్వరగా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. మీరు పాదయాత్రలో చెప్పినట్లు రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, రైతు భరోసా, సున్నా వడ్డీ, వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీ ఇవన్నీ అద్బుతంగా ఉన్నాయి. మేం మిగిలిన రైతులకు కూడా తక్కువ ధరకే సాయం చేస్తున్నాం. 108 అంటే నాన్నగారు ఎలా గుర్తుకొస్తారో ఆర్‌బీకేకు వెళితే మీరు గుర్తుకొస్తారు. ఇవి చూసి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. వీటిని ఎవరూ కదపలేరు. ఈ–క్రాప్‌ వలన నేరుగా దళారీల వ్యవస్ధ లేకుండా అమ్ముకుంటున్నాం. మాకు మంచి విత్తనాలు, మంచి ఎరువులు, మంచి పురుగుమందులు అందుబాటులోకి వచ్చాయి. ఆర్‌బీకేకు వెళితే గుడికి వెళ్ళినట్లు ఉంటుంది రైతులకు. మా రైతాంగానికి ఈ–క్రాప్‌ చాలా ఉపయోగంగా ఉంది. అకాల వర్షాలకు చాలామంది రైతులు నష్టపోయారు, ఈ డబ్బు సరిగ్గా సమయానికి మాకు అందుతుంది. మా రైతులకు అండదండగా ఉన్న ప్రభుత్వం ఇది. మీరు ఏర్పాటుచేసిన ఆర్‌బీకేలు ఇతర రాష్ట్రాలు పెడుతున్నాయి, గతంలో నాన్నగారు 108 ఏర్పాటుచేస్తే కొన్ని రాష్ట్రాలు ఏర్పాటుచేశాయి. మీ దూరదృష్టి రైతాంగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు కలకాలం ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నాం, ధ్యాంక్యూ సార్‌. 


*ధనరాజ్, రైతు, మాధవరం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమగోదావరి జిల్లా*


సార్, నమస్కారం, నేను దాదాపు రెండున్నర ఎకరాలలో వరి సాగు చేశాను, నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు రూ. 14 వేలు వచ్చాయి. అనుకోకుండా సెప్టెంబర్‌ నెలలో వచ్చిన తుఫాన్‌కు పంట నష్టపోయాను, ఆర్‌బీకే వాళ్ళు వచ్చి పంట నష్టం లెక్కలు రాసుకుపోయారు. ఇప్పుడు ఏవో గారు ఫోన్‌ చేసి పంట నష్టపోయిన రైతులకు డబ్బు వేస్తున్నారు అన్నారు. నేను దిగులుగా ఉన్న సమయంలో నాకు రూ. 14 వేలు వస్తునాయి అన్న సంతోషంతో నాకు నిద్రపట్టలేదు. మిమ్మల్ని మీ నాన్నగారిని తలుచుకుంటూనే ఉన్నాం. రైతుకు మీరు చేస్తున్న సాయం చెప్పుకోలేనంత సంతోషాన్నిస్తుంది. ఆర్‌బీకేలు దేవుడి గుడి కంటే పెద్దవి, గతంలో విత్తనాలు, ఎరువుల కోసం నానా ఇబ్బంది పడేవాళ్ళం కానీ ఇప్పుడు ఫోన్‌ చేసి మరీ ఇస్తున్నారు మా ఊర్లోనే. గత ఏడాది ఇన్సూరెన్స్‌ కూడా వచ్చింది, దాదాపు రూ. 60 వేలు వచ్చాయి, బ్యాంకు వాళ్ళు కూడా నీ డబ్బు తీసుకో అని ఇస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా ధాన్యం రూ. 1450 బస్తాకు చొప్పున కొంటుంది. మా రైతుల గుండెల్లో మీరు పదికాలాల పాటు నిలిచిపోతారు. ధన్యవాదాలు సార్‌. 


*లక్ష్మి, మహిళా రైతు, నిమ్మలవలస, చీపురుపల్లి మండలం, విజయనగరం జిల్లా*


సార్‌ గులాబ్‌ తుఫాన్‌ సమయంలో నా ఎకరా భూమిలో పంట నష్టపోయాను, నాకు నష్టపరిహారం వచ్చిందని తెలిసి చాలా సంతోషంగా ఉంది. గతంలో కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసేవాళ్ళం కానీ ఇప్పుడు ఇంత త్వరగా వస్తాయనుకోలేదు. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం రోజుల తరబడి తిరిగేవాళ్ళం కానీ ఇప్పుడు అన్నీ కూడా ఆర్‌బీకేలలో దొరుకుతున్నాయి. ప్రతీ శుక్రవారం మేం సమావేశాలు పెట్టుకుని రైతులకు సంబంధించి అన్నీ చర్చించుకుంటున్నాం. మాకు మీరు దేవుడిలాంటివారు, ఆర్‌బీకేలు దేవాలయాలు, మేం భక్తులం. నాడు నేడు క్రింద మా గ్రామంలో స్కూల్‌ అంతా మారిపోయింది, అంతేకాదు ఇప్పుడు పెన్షన్‌ కూడా ఒకటో తారీఖు ఇంటికే వస్తుంది, అందరూ మా పెద్ద కొడుకు ఇస్తున్నారన్న సంతోషంగా ఉన్నారు. మాకు అన్ని పథకాలు అందుతున్నాయి, మాకు సున్నావడ్డీ అందింది. మేం సంతోషంగా ఉన్నామంటే మీరే కారణం, ధన్యవాదాలు సార్‌.


*మహాలక్ష్మినాయుడు, కౌలు రైతు, అనకాపల్లి, విశాఖపట్టణం జిల్లా*


సార్, నేను గత ఇరవై ఏళ్ళుగా కౌలు రైతుగా సాగు చేసుకుంటున్నాను. నాకు వ్యవసాయంతో పాటు పాడిపశువులు కూడా ఉన్నాయి. కౌలు రైతులకు కూడా పంట నష్టం నమోదు చేయాలని మీరు చెప్పిన ఆదేశాల మేరకు ఆర్‌బీకే నుంచి వ్యవసాయ అధికారులు సాగు చేస్తున్న రైతుల పేర్లే నమోదు చేశారు. గులాబ్‌ తుఫాన్‌ వల్ల అంతా మునిగిపోయాయి, కానీ అధికారులు మాలాంటి కౌలు రైతులను కూడా నమోదుచేసి నా పేరు మీద రూ. 10,500 వచ్చాయి. ఈ పంట నష్టపోయిన సమయంలో మీరు చేసిన సాయం వచ్చే పంటకు ఉపయోగపడుతుంది. పాడిపశువుల విషయంలో కూడా వైద్యాదికారులు వచ్చి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మీరు రైతుపక్షపాతిగా ఉండి మా రైతుల వెనకుండి ముందుకు నడిపిస్తున్నారు. మా రైతన్నలందరి తరపున మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. మేం వ్యవసాయం చేయాలంటే మీ వల్లే ఎలాంటి భయంలేకుండా ముందుకెళుతున్నాం, నాకు ఇద్దరు పిల్లలు, పదిపైసలు కూడా ఖర్చు లేకుండా నేను చదివించుకుంటున్నాను. ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌ కూడా వస్తుంది. నాతో పాటు నాతోటి రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మేం కౌలు రైతులం, మేం ఐదుగురు సభ్యులం గ్రూప్‌గా ఉన్నాం, డీసీసీబీ బ్యాంకులో మాకు లోన్‌ ఇస్తామన్నారు, మానుంచి ఎలాంటి హమీ అడగకుండా ఒక్కొక్కరికి రూ. లక్ష లోన్‌ ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా మీ దయ వల్లే, మీరే ఎప్పటికీ సీఎంగా ఉండాలని ఆ దేవున్ని ప్రార్ధిస్తున్నాను సార్‌.

Comments