స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్

 గుంటూరు (ప్రజా అమరావతి);    స్నేహితులు లేని వారు అరుదుగా ఉంటారు. ఎటువంటి సమస్యనైనా స్నేహితునితో పొరపొచ్చాల్లేకుండా చర్చించుకోవచ్చు. మంచిస్నేహితుడు కష్టనష్టాల్లో అండగా ఉంటాడు. బుద్ధి వికాసానికి బాటలు వేయగలిగే శక్తికూడా స్నేహానికే ఉంది. నిస్వార్థమనేది కేవలం స్నేహంలోనే ఉంటుంది అన్నా అతిశయోక్తి కాదు. అమ్మఒడిలో అమ్మ దగ్గర అప్యాయతను చూసిన తర్వాత, మనిషి చూసే మరో ఆప్యాయత స్నేహంలో కనబడుతుంది. అటువంటి స్నేహమే గుంటూరుకు చెందిన హరినారాయణ, బాపయ్యలది. ఇద్దరూ 70 వసంతాలు పూర్తి చేసుకున్న వారే..

గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం లెమల్లపాడు గ్రామానికి చెందిన చిగురుపాటి బాపయ్య చిన్నప్పటి నుండి వ్యవసాయం చేసేవారు. తనకున్న పదెకరాలతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని మరీ మిర్చి, పొగాకు, అపరాలు పండించే వారు. అలా కష్టపడి వ్యవసాయం చేసి పిల్లల్ని బాగా చదివించారు. ప్రస్తుతం కుమారుడు అమెరికా లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. కూతురుని ఉన్నత చదువు చదివించి గుంటూరు లోనే ఆటోమొబైల్ వ్యాపారునికి ఇచ్చి వివాహం చేశారు. అలా తన బాధ్యతలు అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత భార్యతో కలసి తన శేష జీవితాన్ని గుంటూరు పట్టణంలో గడపాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలోని వ్యవసాయ భూములను కౌలుకి ఇచ్చేసి 20 సంవత్సరాల క్రితం గుంటూరుకు మకాం మార్చారు.

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గుంటూరు ఎన్.టి.ఆర్. స్టేడియంలో నడక, కాసేపు గుడి దగ్గర కూర్చుని తోటి వారితో ఆధ్యాత్మిక విషయాలపై చర్చించుకోవడం.. జీవితానుభవాలు పంచుకోవడం.. అమెరికాలో ఉంటున్న పిల్లలు, మనుమలతో ఫోన్ లో మాట్లాడటం ఇదే వారి ప్రధాన దినచర్య. ఈ క్రమంలో సరిగ్గా అలాంటి నేపధ్యం నుండే వచ్చిన మాచవరపు హరినారాయణతో బాపయ్యకు స్నేహం కుదిరింది. ఇద్దరు కలసి వాకింగ్ చేయడం, తమ వ్యవసాయ అనుభవాలు, కుటుంబ విషయాలు చర్చించుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నిమ్మగడ్డ వారిపాలెం కు చెందిన మాచవరపు హరినారాయణ కూడా తనకు పదేళ్ళ వయసున్నప్పుడే హలం చేతబట్టారు. కష్టపడి వ్యవసాయం చేసి తండ్రి ఇచ్చిన ఐదెకరాలను పదిహేను ఎకరాలు చేయడమే కాకుండా పిల్లలను బాగా చదివించి అమెరికా పంపారు. ప్రస్తుతం కూతురు, కొడుకు పెళ్ళిళ్ళు చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. ఈయన కూడా జీవిత చరమాంకంలో గుంటూరులో ఉండాలని, పొలం కౌలుకి ఇచ్చి గుంటూరు రాజేంద్ర నగర్ లో భార్యతో కలసి ఉంటున్నారు.

ఓరోజు అలా వాకింగ్ చేస్తూ, మోకాలి నొప్పుల గురించి మాట్లాడుకున్నారు. ఇద్దరు కలసి విజయవాడ, గుంటూరులోని చాలా హాస్పిటల్స్ కి వెళ్లి చూపించుకున్నారు. మోకాలి మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని అక్కడ డాక్టర్లు సూచించారు. మోకాలి ఆపరేషన్ అనగానే హరినారాయణ భయపడ్డారు. వయసు రీత్యా వచ్చే సమస్యలు, బిపి, షుగర్ లతో బాధ పడుతున్న తాము ఆపరేషన్ చేయించుకోగలమా? పైగా పిల్లలు కూడా దగ్గర లేరు.. మంచానికే పరిమితమైతే ఎలా? ఇలా ఎన్నో సందేహాలతో వెనకడుగు వేశారు.

కొద్ది రోజుల తర్వాత సత్తెనపల్లికి చెందిన మరో స్నేహితుడు డా. గుడారు జగదీష్ గారి గురించి మాట్లాడుతుండగా వారు విన్నారు. తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో పదవీ విరమణ చేసిన తర్వాత డా. జగదీష్ గారు గుంటూరు రమేష్ హాస్పిటల్ కి వస్తున్నారని, మోకాలి ఆపరేషన్లు వేల సంఖ్యలో చేసారని, ఆపరేషన్ అయిన వెంటనే నడిపిస్తున్నారని తెలుసుకుని ఇద్దరూ కలసి రమేష్ హాస్పిటల్ కి వచ్చారు. డాక్టర్ జగదీష్ గారితో మాట్లాడిన తర్వాత వారికున్న భయాలన్నీ తొలగిపోయాయి.. ఇద్దరికీ ఒకేసారి ఆపరేషన్ చేయాల్సిందిగా వారు కోరారు.

అవసరమైన పరీక్షలన్నీ చేసిన తర్వాత వారిద్దరికీ ఒకేరోజు, ఒకే సమయంలో ఆపరేషన్ చేయడానికి సిద్ధం చేశారు. ఇద్దరికీ రెండు మోకాళ్ళ కీళ్ళు ఒకేసారి మార్చడం అంటే నాలుకు కీళ్ళ మార్పిడి ఆపరేషన్ లు ఒకేసారి చేయడం. ఇది చాలా సంక్లిష్టమైన పని. ఒక ఆపరేషన్ థియేటరులో ఒక కాలికి మాత్రమే ఆపరేషన్ చేయడానికి వీలు ఉంటుంది. మరో ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ థియేటరు తో పాటు మొదటి ఆపరేషన్ కి ఉపయోగించిన పరికరాలన్నీ తిరిగి స్టెరిలైజ్ చేయాల్సి ఉంటుంది. 

గుంటూరు లోని రమేష్ ఆసుపత్రిలో అత్యాధునిక, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నాలుగు మాడ్యులర్ ఆపరేషన్ థియేటరులను ఎంపిక చేసుకుని మొదట బాపయ్య కుడికాలుకి ఆపరేషన్ చేశారు. అతడిని రెండో కాలు ఆపరేషన్ కోసం మరో ఆపరేషన్ థియేటరుకు తరలించే లోపు హరినారాయణ కుడి కాలుకి కూడా శస్త్ర చికిత్స చేసి ఎడమ కాలు ఆపరేషన్ కోసం మరో థియేటరుకి తరలించారు. మళ్ళీ బాపయ్య ఎడమ కాలుకి ఆపరేషన్ చేసిన తర్వాత హరినారాయణ ఎడమ కాలుకి ఆపరేషన్.. ఇలా ప్రత్యామ్నాయ పద్ధతిలో ఉదయం ఆరు గంటలకు మొదలు పెట్టిన ఈ ఆపరేషన్ ఏకధాటిగా అయిదున్నర గంటలపాటు కొనసాగింది. పదకొండున్నర వరకు డాక్టర్ గుడారు జగదీష్ విరామం లేకుండా శ్రమించి, ఒకేసారి ఆపరేషన్ చేయించుకోవాలన్న ఆ స్నేహితుల కోరికను తీర్చడమే కాక వారు పూర్తిగా కోలుకునే వరకు పక్క పక్కనే బెడ్లు సైతం ఏర్పాటు చేసారు. ఎప్పుడూ కలిసుండే ఆ స్నేహితులు హాస్పిటల్ లో కూడా ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ అనుకున్న సమయం కంటే ముందే కోలుకుని డిశ్చార్జి కావడం విశేషం.

రమేష్ హాస్పిటల్ లో ఎలాంటి వ్యాధులు, ప్రమాదాల బారిన పడిన వారికైనా వైద్యం అందించగల అత్యంత అధునాతనమైన పరికరాలు, దేశంలోనే నిష్ణాతులైన శస్త్ర చికిత్స నిపుణులు అందుబాటులో ఉన్నారు. గుండె, ఎముకలు, కాలేయం, కిడ్నీలు, ఊపిరి తిత్తులు.. ఇలా మానవ శరీరంలోని ప్రతి అవయవానికి సంబంధించిన నిపుణులైన వైద్య బృందం ఎలాంటి సమస్యలకైనా చికిత్స చేసి రోగుల ముఖాల్లో చిరునవ్వులు నింపుతున్నారు. 


--PATIENT’S WORDS--

“మోకాలి ఆపరేషన్ అని చెప్పగానే చాలా భయపడ్డాను. నాకు షుగరు మరియు బిపి ఉన్నాయి. డా. గుడారు జగదీష్ గారి గురించి మా స్నేహితుడు చెప్తుండగా విన్నాను. జగదీష్ గారిని కలవాలంటే చాలా రోజులు సమయం పడుతుందని, ఆపరేషన్ చేయించుకోవాలంటే కనీసం ఒక సంవత్సరం వేచి ఉండాలని విన్నాను. కానీ డాక్టరు గారు గుంటూరు రమేష్ ఆసుపత్రికి వస్తున్నారని తెలిసి వెంటనే అపాయింట్ మెంట్ తీసుకున్నాను. డాక్టరు గారితో మాట్లాడిన తర్వాత నాకు భయం పూర్తిగా పోయింది. ధైర్యంగా ఆపరేషన్ చేయించుకున్నాను. డా. జగదీష్ గారు నాకు, మా స్నేహితుడికి ఇద్దరికీ ఒకేసారి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అయిన కొద్దిసేపటికే నేను నడవడం మొదలు పెట్టాను. నా పనులు నేనే స్వయంగా చేసుకోగలుగుతున్నాను. నా పిల్లలు దగ్గర లేరనే లోటు తెలియకుండా హాస్పిటల్ సిబ్బంది చాలా బాగా చూసుకున్నారు. హాస్పిటల్ లో ఉన్నాను అనే భావన లేదు.. నాకు ఇంట్లో ఉన్నట్లే ఉంది. నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్ గారికి, రమేష్ హాస్పిటల్ సిబ్బందికి ధన్యవాదాలు.”

- మాచవరం హరినారాయణ 

రాజేంద్ర నగర్, గుంటూరు.“నేను గత ఆరు సంవత్సరాలుగా మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతున్నాను. చాలా హాస్పిటల్స్ తిరిగాను. కానీ ఎక్కడా నాకు తగిన వైద్యం దొరకలేదు. ఒకసారి ఎన్.టి.ఆర్. స్టేడియంలో వాకింగ్ చేస్తున్నప్పుడు, సత్తెనపల్లికి చెందిన మా బంధువులొకరు కూడా వాకింగ్ కి వచ్చారు. వారు కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారని, తిరుపతిలో డాక్టర్ గుడారు జగదీష్ గారిచే ఆపరేషన్ చేయించుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నానని, వాకింగ్ కూడా చేయగలుగుతున్నానని చెప్పారు. అయితే తిరుపతిలో డాక్టర్ గారి అపాయింట్ మెంట్ దొరకడం చాలా కష్టం అనీ, ఎంతో మంది రోగులు జగదీష్ గారితోనే ఆపరేషన్ చేయించుకోవాలని సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారని తెలిసింది. మా అదృష్టమో, మరేంటో తెలియదు గానీ, డాక్టర్ జగదీష్ గారు గుంటూరు రమేష్ హాస్పిటల్ కి వస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లి కలిశాము. డాక్టరు గారు వెంటనే మాకు అన్ని పరీక్షలూ చేసి, ఆపరేషన్ చేయాలని చెప్పారు. అయితే నాకు, మా మిత్రునికి, ఇద్దరికీ ఒకేసారి ఆపరేషన్ చేయాలని డాక్టరు గారిని అడిగాము. వారు అలాగే చేస్తాను అని మాకు మాటిచ్చారు. ఇద్దరికీ, రెండు మోకాళ్ళకు కీళ్ళ మార్పిడి ఆపరేషన్ ఒకేసారి చేసారు. ఆపరేషన్ చేసిన మరుసటి రోజు నుంచే మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం. ఇక్కడ డాక్టర్లు, నర్సులు, ఫిజియోతెరఫీ సిబ్బంది మమ్మల్ని చాలా ప్రత్యేకంగా చూసుకున్నారు. మా కుటుంబ సభ్యుల లాగా చాలా ఆప్యాయంగా చూసుకున్నారు.”

- చిగురుపాటి బాపయ్య,

నలంద నగర్, గుంటూరు.

Popular posts
దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కొడాలి నాని
Image
ముఖ్యమంత్రి హెూదాలో పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టిన వైఎస్సార్ ను ఎలా మర్చిపోగలం
Image
ప్రజల గుండెల్లో చురస్మరణీయమైన స్థానం పొందిన వ్యక్తి నారా లోకేష్
Image
ఎన్టీఆర్ అభిమానిగా సీఎం జగన్మోహనరెడ్డికి పాదాభివందనం చేస్తున్నా
Image
మెడల్ హౌస్.... - రూ. 3.24 లక్షల్లోనే డబుల్ బెడ్‌రూం ఇల్లు - 15 రోజుల్లో పదిమంది కూలీలతో నిర్మాణం - కరీంనగర్‌లో యువబిల్డర్ ప్రయోగం సక్సెస్ ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండు పనులూ కష్టసాధ్యమనే ఉద్దేశంతోనే అలా చెప్పారు. ఇప్పుడు రోజులు మారాయి. అంతా రెడీమేడ్ యుగం. కేవలం పదిహేను రోజుల్లోనే డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించవచ్చు! మీరు విన్నది నిజమే. కరీంనగర్ శివారు బొమ్మకల్ బైపాస్ సమీపంలో నిర్మించిన ఈ ఇంటిని చూస్తే మాత్రం ఇల్లు కట్టడం ఇంత సులభమా? అనిపించకమానదు. అతితక్కువ ఖర్చుతో రెండు పడకగదులున్న పక్కాభవంతిని కట్టి చూపించాడు కరీంనగర్‌కు చెందిన యువబిల్డర్ పేరాల కృష్ణారావు. వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ నిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న ఈయన, కేవలం పదిమంది కూలీలతో 15 రోజుల్లో రూ.3.24 లక్షల తో ఈ ఇంటిని నిర్మించారు. దీనికి మోడల్ హౌస్ అని నామకరణం కూడా చేసేశారు. డిజైన్‌లో మార్పులు చేస్తే కేవలం రూ.3 లక్షల్లో నిర్మించి ఇవ్వవచ్చని చెప్తున్నారు. ఇదీ ఇంటి ప్లాన్: 128 చదరపు గజాల(1155 చదరపు అడుగుల) స్థలంలో 510 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా (కింది విస్తీర్ణం), 815 చదరపు అడుగుల స్లాబ్ ఏరియా(పైన స్లాబ్ విస్తీర్ణం)తో ఇల్లు ఉంటుంది. మెట్లు పోను 10 ఫీట్లు, ఇంటిపక్కన 8 ఫీట్లు ఖాళీ స్థలం మిగులుతుంది. నిర్మాణం ఇలా: మొదట కందకం తీసి, బేస్‌మెంట్ నిర్మించారు. పిల్లర్లు, గోడలు, స్లాబ్ కోసం ఒకరోజులో అల్యూమినియం ఫ్రేమ్‌లు బిగించారు. తలుపులు, కిటికీలు అమర్చా రు. మరోరోజు రాడ్లు నిలిపి, అల్లారు. మరుసటి రోజు రెడీమిక్స్‌తో కాంక్రీట్ నింపారు. తర్వాత అల్యూమీనియం ఫ్రేం లను తొలగించి, నాలుగు నుంచి ఐదురోజులు క్యూరింగ్ చేశా రు. ఈ ఇంటికి ప్లాస్టరింగ్ అవసరం ఉండదు. అందుకే కొద్ది గా లప్పం కోటింగ్ చేసి, మిషన్ ద్వారా ఒకేరోజు కలర్ కూడా వేసేయొచ్చు. మిగిలిన రోజులు చిల్లరపనులకు పోతుంది. ఖర్చు పెట్టారిలా: గోడలు, స్లాబ్‌కు 33 క్యూబిక్‌మీటర్ల కాం క్రీట్ మిక్స్ (రెడీమిక్స్) సరిపోయింది. క్యూబిక్‌మీటర్‌కు రూ.2800చొప్పున రూ.84వేల ఖర్చు వచ్చింది. రెండు టన్నుల రాడ్‌కు రూ.85వేలు. నాలుగు తలుపులు, కిటికీలకు రూ.25వేలు. మేస్త్రీ, కూలీలకు రూ.60వేలు. కరెంట్ ఖర్చు రూ.15వేలు, ప్లంబర్ చార్జి రూ.15వేలు. మొత్తం రూ.3.24 లక్షలు. ధరలు పెరిగినా, డిజైన్‌లో మార్పు ఉన్నా ధరల్లో కొం త వ్యత్యాసం ఉండవచ్చు. ఎలివేషన్(ఇంటి ముందు భాగపు డిజైన్) మారిస్తే మరో రూ.60వేలు అదనపు ఖర్చు ఉంటుం ది. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తే ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. చైనా, జర్మనీల్లో చూసి ప్లాన్‌చేశారు పేరాల కృష్ణారావు, ఎండీ, వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ ఇంటి నిర్మాణానికి మనం పెట్టే ఖర్చు ప్రపంచంలో ఎక్కడా పెట్టరు. తక్కువ ఖర్చుతో ఇల్లు ఎలా నిర్మించవచ్చో తెలుసుకునేందుకు చైనా, జర్మనీ, అమెరికాలో పర్యటించారు. చైనా, జర్మనీల్లో కాంక్రీట్ గోడలు, రోబోసాండ్‌తో ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇది నాకు నచ్చింది. పేద ప్రజల కలను నిజం చేసేందుకు ఈ విధానం సరిపోతుంది. అందుకే ఈ ఇంటిని కట్టి మోడల్ హౌస్ అని పేరుపెట్టారు
Image