కొవ్వూరు డివిజన్ పరిధిలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది

  కొవ్వూరు  (ప్రజా అమరావతి);


కొవ్వూరు డివిజన్ పరిధిలో ఎన్నికల కోడ్ అమలులో ఉందిబుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించే  ప్రక్రియ ప్రారంభించారు

                 

     

స్థానిక సంస్థలకు నిర్వహించే ఉప ఎన్నికలకు డివిజన్  స్థాయిలో యంత్రాంగాన్ని సర్వ సన్నద్ధం చెయ్యడం జరిగిందని, బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించడానికి చర్యలు చేపట్టారని  రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు తెలిపారు. 


డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా , శాంతియుతంగా నిర్వహించే విధంగా తహసిల్దార్ లు, ఎంపిడిఓ లు, మునిసిపల్ కమిషనర్,   పోలీసు అధికారుల తో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. 

    

 బుధవారం కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్తీ కేయ మిశ్రా  ఆర్డీవో లతో, డిఎస్పీ లతో సంబంధించిన మండల, మునిసిపల్ అధికారులతో  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక ఆర్డీవో కార్యాలయం నుంచి ఆర్డీవో, డిఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, డివిజన్ పరిధిలోని పెనుగొండ జెడ్పిటిసి స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నందున  రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కొవ్వూరు డివిజన్ పరిధిలో ఎన్నికల కోడ్ అమలులో ఉందన్నారు. నేటి  నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం  అయినందున సంబంధిత కేంద్రాల్లో ఆర్వో లు,ఏఇ ఆర్వో లు అందుబాటులో ఉండి నామినేషన్ పత్రాలను స్వీకరించాలన్నారు.  నామినేషన్ల స్వీకరణకు  సంబంధించి అన్ని రకాల ఫారాలను ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు పంపించడం జరిగిందన్నారు.  వీటిని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోని, ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని పేర్కొన్నట్లు తెలిపారు. ఆర్ వో, ఏ ఆర్వో  లకు శిక్షణా కార్యక్రమాన్ని పూర్తిచేయడం జరిగిందన్నారు.  డి.ఎస్.పి తో కలిసి  స్టేషన్ హౌస్ ఆఫీసర్, సి ఐ ల తో ఎన్నికలు  ప్రశాంతంగా నిర్వహించే  విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు. 


 

    మండల పరిధిలో శాంతి భద్రతలపై సంబంధించిన తహసీల్దార్ లకు, పోలింగ్ సామగ్రి విషయం పై  ఎంపీడీవోలకు సూచనలు చెయ్యడం జరిగిందని ఆర్డీవో తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లు పై ప్రతిరోజు నివేదికను 

  జిల్లా పరిషత్ సీఈవో , జిల్లా పంచాయతీ అధికారితో పాటు ఆర్డీవో కార్యాలయానికి  పంపించాలని మల్లిబాబు సూచించారు . పోలింగ్ కి సంబంధించిన సామాగ్రి అంతాఆయా మండలాలకు  పంపించడం  నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తరువాత బ్యాలెట్ పేపర్లు ముద్రణ చేపట్టాల్సి ఉంటుందని, ఒకసారి ఎన్నికల మెటీరియల్ ను సరిచేసుకోవలని తెలిపారు. పెనుగొండ  జెడ్ పి టి సి ఎన్నిక జరుగుతున్న దృష్ట్యా కొవ్వూరు రెవెన్యూ డివిజన్ అంతా కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని   మల్లిబాబు పేర్కొన్నారు.  సోమవారం నుండి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని,  ఎన్నికల కోడ్ ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించే బృందాలు  డివిజన్ పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో  విగ్రహాలకు ముసుగులు వేయడం, పోస్టర్లు, బ్యానర్లు ను తొలగించడం చేయాలని ఆయన సూచించారు. పోలీస్ అధికారులతో సమన్వయం,  ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేసేందుకు ఎం సి సి టీములు విధుల్లో ఉండాలన్నారు.  పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు కేంద్రాలను గుర్తించాలని, పోలింగ్ మెటీరియల్ భద్రపరిచేందుకు  స్ట్రాంగ్ రూమ్ లను గుర్తించాలని, ఎన్నికలు కౌంటింగ్ నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాలు గుర్తించి సిద్ధం చేసుకోవాలని ఎంపీడీవోలకు దిశానిర్దేశం చేశారు.  పి వో లకు, ఓ పి వో లకు శిక్షణ కార్యక్రమం పూర్తి చేయాలని ఆయన అన్నారు. తాహసిల్దార్లు లా అండ్ ఆర్డర్   పర్యవేక్షణలో,  మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలు పకడ్బందీగా ఉండాలన్నారు.


      డిఎస్పీ బి. శ్రీనాధ్  మాట్లాడుతూ  ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు సెన్సిటివ్,  హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాలలోని భద్రత ఏర్పాట్లు పూర్తి చెయ్యడం జరిగిందన్నారు. సంబంధించిన ఆర్వో లతో మాట్లాడి పోలింగ్ కేంద్రాల వారీగా పోలీసు సిబ్బంది ని కేటాయించడం, రిజర్వు లో కూడా సిబ్బంది జాబితా సిద్ధం చేసుకున్నామన్నారు.   ఆయుధాలు డిపాజిట్ చేయలని, లౌడ్ స్పీకర్లకు పర్మిషన్ ఇచ్చేటప్పడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా బందోబస్తు పూర్తి చేశామని  ఆయన అన్నారు.