అక్కచెల్లెమ్మల కోసం మనసా, వాచా, కర్మణా...


అమరావతి (ప్రజా అమరావతి);


*మహిళా సాధికారతపై శాసనసభలో చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*శాసనసభలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ ఏమన్నారంటే.....:*


ఈ రోజు మహిళా సాధికారిత మీద చర్చ జరుగుతోంది. అచ్చెన్నాయుడు గారు బీఏసీలోకి వచ్చినప్పుడు, చంద్రబాబునాయుడు గారు కూడా వస్తారేమోనని కాస్తా ఆలస్యం కూడా చేశాం. మహిళా సాధికారతమీద చర్చ జరుగుతున్నప్పుడు తాను (చంద్రబాబు) కూడా ఉంటే బాగుంటుందని చెప్పి వేచి చూశాం. ఇక్కడే ఉన్నారు వస్తారని అన్నారు. బాగా ఆలస్యం చేసినా రాలేదు. ఆయనకున్న కష్టమేమిటో, ఇక్కడ (శాసనసభలో) ఉన్నారో లేదో తెలియదు.  


మా వాళ్లందరూ కుప్పం ఎఫెక్ట్‌ అని అంటున్నారు. మొత్తానికైతే చంద్రబాబు కనిపించలేదు. 


*అక్కచెల్లెమ్మల కోసం మనసా, వాచా, కర్మణా...*


అక్కచెల్లెమ్మలు వారి జీవితాలు బాగుపడాలని మనసా, వాచా, కర్మణా ఆరాటపడుతున్న ప్రభుత్వం మనది, మాది అని గర్వంగా చెబుతున్నాను. అక్కచెల్లెమ్మలు బాగుండాలని ఒక ఉద్యమంగా, ఒక విప్లవంగా మహిళా సాధికారతకు అర్ధం తీసుకురావాలని, వారు సామాజికంగాను, విద్యాపరంగాను, ఆర్ధికంగానూ, రాజకీయంగానూ ఎదగాలని గట్టిగా అడుగులు వేశాం. 

ఇందుకు సంబంధించి కొన్ని అంశాలను  గౌరవ సభ ముందు ఉంచదల్చుకున్నాను. 


*సువర్ణాధ్యాయం*

మహిళా సాధికారత చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం ఈ రెండున్నర సంవత్సరాలకాలంలో లిఖించామని ఆ అక్కచెల్లెమ్మలకు అన్నగా, తమ్ముడిగా ఈ సభ ద్వారా సగర్వంగా తెలియజేస్తున్నాను. 

44.50 లక్షల మంది తల్లులకు తద్వారా 85 లక్షల మంది పిల్లలకు ప్రతి సంవత్సరం బడులకు పంపితే చాలు, పిల్లలు పనులు బాట పట్టకూడదు, బడి బాటపట్టాలని, బడులకు పంపించాల్సిన బాధ్యత బరువు కాకూడదు, చిరునవ్వుతో పంపించాలని జగనన్న అమ్మఒడి ప్రవేశపెట్టాం. ఈ ఒక్క పథకం ద్వారానే సంవత్సరానికి రూ.6500 కోట్లు 44 లక్షల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నాం. 

ఈ ప్రక్రియలో కూడా ఎక్కడా లంచాలకు తావులేవు, వివక్షకు తావులేదు, మన పార్టీ, తన పార్టీ అనే తేడా లేదు, రాజకీయాలు కూడా లేవు. 

ఈ రెండు సంవత్సరాల కాలంలో అక్కచెల్లెమ్మలకు రూ.13,023 కోట్లు నేరుగా వారి అకౌంట్లో జమ చేశాం. ఈ పథకం ద్వారా పిల్లలను బడులకు పంపించే గొప్ప విప్లవానికి నాంది పలికాం.


*వైయస్సార్‌ పెన్షన్‌ కానుక గురించి చెప్పుకుంటే...* కాసేపటి క్రితం తెలుగుదేశం పార్టీకి చెందిన రాజమండ్రి ఎమ్మెల్యే పెన్షన్‌ల గురించి మాట్లాడారు. గతంలో ఎటువంటి దారుణమైన పరిస్ధితుల్లో పించన్లు ఉండేవంటే... ఒక పించన్‌ రావాలంటే జన్మభూమి కమిటీ సిఫార్సు ఉండాలి. జన్మభూమి కమిటీలంటే సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వాళ్లు పించన్లు ఇచ్చే ముందు అడిగే మొట్టమొదటి ప్రశ్న మీరు ఏ పార్టీ వారు అని? 

గతంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు అంటే అక్టోబరు 2018 వరకు, పేరుకు 44 లక్షల పించన్లు అందులో ఇచ్చేది 90 శాతం అంటే 39 లక్షల మందికి కేవలం రూ.1000 పించన్‌ ఇచ్చేవారు. ఆ రోజుల్లో నెలకు ప్రభుత్వానికి కేవలం నెలకు రూ.400 కోట్లు బిల్లు వచ్చేది.


ఈ రోజు పించన్లు అక్షరాలా 61.73 లక్షలు. ఇంతకముందు సగటున 90 శాతం పించన్లు ఇస్తే...  ఈ రోజు 98 శాతం పించన్లు ఇస్తున్నాం. 61.73 లక్షలమందికి కూడా అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి రూ.2250 ఇస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వానికి ఫించన్‌ బిల్లు రూ.1500 కోట్లకు పైగా ఉంది. 


*రూపాయి లంచం లేకుండానే*

*36.70 లక్షలమంది అవ్వలకు, అక్కలకే....*

61.73 లక్షల మందిలో 36.70 లక్షల మంది అవ్వలకు, అక్కలకే పించను ఇస్తున్నాం. మహిళా సాధికారత కాబట్టి వాళ్ల గురించే మాట్లాడుతున్నాం.  రూ.21,899 కోట్లు వాళ్ల చేతుల్లో నేరుగా పెట్టడం జరిగింది.

ఆ డబ్బులు కోసం కూడా ఎవరూ దేహీ అని అడగాల్సిన పనిలేదు, నాయకులు చుట్టూ తిరగాల్సిన అవసరమూ లేదు, రూపాయి లంచం ఇవ్వాల్సిన పని లేదు, మీరు ఏ పార్టీ వాళ్లు అని అడిగే పరిస్థితి లేదు. వాళ్ల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ప్రతి నెలా ఒకటో తారీఖున ఆదివారమైనా, సెలవైనా సూర్యోదయం కంటే ముందే నేరుగా వారి ఇంటి వద్దనే, చిరునవ్వుతో వాలంటీర్‌ తలుపు తట్టి గుడ్‌మార్నింగ్‌ అని చెప్పి ఆ అక్క, అవ్వల చేతుల్లోనో డబ్బులు పెట్టి వాళ్ల ఆశీస్సులు తీసుకుని బయలుదేరుతున్నారు. 


*వైయస్సార్ ఆసరా*

మహిళా సాధికారతలో అడుగులు ముందుకు వేస్తూ.. వైయస్సార్‌ ఆసరా పథకాన్ని తీసుకొచ్చాం. మొత్తం 78.86 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్ల కాలంలో జరిగే మేలు రూ.25,517 కోట్లు.. నేరుగా వీళ్ల చేతుల్లోకి పోతుంది. ఈ రెండు సంవత్సరాల కాలంలో ఇప్పటికే వీళ్లకు అందించిన లబ్ది రూ.12,758 కోట్లు.


*సున్నా వడ్డీ*

సున్నా వడ్డీ పథకం ద్వారా దాదాపుగా కోటిమంది అక్కచెల్లెమ్మలకు మరో రూ.2,354 కోట్లు ఇచ్చాం. ఎన్నికల వేళ గత పాలకులు రుణాలు మాఫీ చేస్తామని మోసం చేస్తే.. .అప్పటి దాకా ఉన్న సున్నావడ్డీ పథకం సైతం 2016 అక్టోబరు నుంచి ఇవ్వకుండా ఎగ్గొడితే వీటి ఫలితంగా పొదుపు సంఘాల గ్రూపుల ఎన్‌పీయేలు అక్షరాలా 18.36 శాతం పోయింది. ఏ గ్రేడ్‌లో ఉండాల్సిన సంఘాలు సీ, డీ గ్రేడ్‌లకు దిగజారిపోయి, మొత్తం పొదుపు సంఘాల వ్యవస్ధే చతికిలపడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో వైయస్సార్‌ ఆసరా అనే పథకం ఆక్సిజన్‌గా అక్కచెల్లెమ్మలకు తోడుగా నిల్చిందని గర్వంగా చెపుతున్నాను.


*వైయస్సార్‌ చేయూత మనస్ఫూర్తిగా చేపట్టాం.* మొక్కుబడిగా కాకుండా ప్రతి సంవత్సరం వరుసగా  క్రమం తప్పకుండా ఇస్తూ.. నాలుగేళ్ల పాటు అక్కచెల్లెమ్మలకు, ప్రతి సంవత్సరం రూ.18,750 చొప్పున ఇచ్చాం. అలా ఇవ్వడం వల్ల వాళ్లు ఆర్ధికంగా వ్యాపారంలో నిలదొక్కుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. 

వైయస్సార్‌ చేయూత ద్వారా 24.56 లక్షల మంది 45 నుంచి 60 యేళ్ల మధ్యలోనున్న అక్కచెల్లెమ్మలకు అందించాం. 

ఇది చాలా బాధ్యతాయతమైన వయస్సు. వారి చేతిలో డబ్బు పెడితే... అది వారి కుటుంబానికి ఎలా మంచి జరుగుతుందో ఆలోచిస్తారు. అలా బాధ్యతాయుతమైన వయస్సులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు రెండు విడుతలుగా రూ.8944 కోట్లు ఇచ్చాం. నాలుగుదఫాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా రెండు సార్లు రూ.18,750 చొప్పున ఇచ్చాం. కేవలం డబ్బులిచ్చి బాధ్యతల నుంచి తప్పుకునే ఆలోచన కూడా చేయలేదు. డబ్బులిచ్చి వాళ్ల తెలివైన వారు, వాళ్ల వ్యాపారాలు వాళ్లు చేసుకోగలుగుతారని తెలిసినా... ఇంకా ప్రభుత్వం తరపున సూచనలు, సలహాలు ఇచ్చే విషయంలో నాలుగు అడుగులు ముందుకు వేశాం. 


*కార్పొరేట్ సంస్ధలతో టై అప్‌*

డబ్బులివ్వడంతో పాటు వివిధ కార్పొరేట్‌ సంస్ధలతోను, బ్యాంకర్లతోనూ, రిలయెన్స్, ఐటీసీ, అమూల్‌ వంటి పెద్ద, పెద్ద సంస్థలతో అనుసంధానం చేశాం. ఇలా చేయడం వల్ల గ్రామీణ ప్రాంతంలో వీళ్లందరినీ డీలర్లుగా మార్చి, వీళ్లందరితో రీటైల్‌ షాపులు పెట్టించాం. 


హిందుస్తాన్‌ లీవర్, పీ అండ్‌ జీ వంటి సంస్ధల ఉత్పత్తులను వాళ్ల ఏజెంట్లుకిచ్చే డబ్బులకన్నా కూడా తక్కువకే అక్కచెల్లెమ్మలకు ఇస్తూ... వారినే కంపెనీ ఏజెంట్లుగా మారుస్తూ.. వారికి అన్ని రకాలుగా తోడుగా నిలుస్తున్నాం. దీనివల్ల ప్రతిఅక్క అదనంగా నెలకు రూ.7వేలు నుంచి రూ.15వేలు సంపాదించే పరిస్థితి వచ్చింది. 


1.10 లక్షల మంది అక్కచెల్లెమ్మెలు రీటెయిల్‌ షాపులు పెట్టగా... ఆవులు, గేదెలు కొనుక్కుని 1,34,103 మంది మేలు పొందారు. మేకలు, గొర్రెలు ద్వారా 82,556 మందికి మేలు జరిగింది. 

దాదాపు 3.40 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఉపాధి చూపించాం.


*వైయస్సార్ జగనన్న కాలనీలు*

వైయస్సార్‌ జగనన్న కాలనీల ద్వారా  మహిళా సాధికారతను మరో అడుగు ముందుకు తీసుకెళ్లాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల పంచాయతీలు ఉంటే, 17 వేల వైయస్సార్‌ జగనన్న కాలనీలు ఉన్నాయి. 31 లక్షల ఇళ్ల పట్టాలు అందించాం. అంటే దాదాపు కోటి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టించే కార్యక్రమం ఇది. రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒకవంతు ఇది. ఇళ్ల స్ధలాలు వారి చేతికి అందించాం. ఇందులో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. పనులు కూడా చక,చకా జరుగుతున్నాయి. ఈ ఇంటి నిర్మాణం పూర్తయితే ఇంటి స్దలం విలువ, ఇంటి నిర్మాణం విలువ ఆ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కూడా పూర్తయితే ప్రతి అక్క చేతిలోనూ రూ. 5 నుంచి రూ.10 లక్షల ఆస్తి వాళ్ల చేతిలో పెట్టినట్లవుతుంది. దీంతోమహిళా సాధికారతను ఒక స్ధాయిలోకి తీసుకుపోయినట్లవుతుంది. 


*ఆశీర్వదించాల్సింది పోయి...*

31 లక్షల అక్కచెల్లెమ్మలు, ఇంటి స్ధలం, ఇళ్ల నిర్మాణం మొత్తం కలుపుకుంటే రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్లు సంపదను వాళ్ల చేతిలో పెట్టినట్లవుతుంది. చివరకు ఇలాంటి మంచి పథకం చేస్తున్నందుకు ఆశీర్వదించాల్సింది పోయి.. దీన్ని అడ్డుకునేందుకు ఏకంగా కోర్టులను కూడా ఆశ్రయించి.. ఇలాంటి మంచి పథకాన్ని ఆపాలని చూడటం ధర్మమేనా అని అడుగుతున్నాను ? 


*కచ్చితంగా దేవుడు మొట్టికాయలు వేస్తాడు*

ఎక్కడ జగన్‌కు మంచి పేరు వస్తుందో, ఇది జరగకూడదని దుర్భిద్ధితో ఇన్ని కుట్రలు పన్నుతున్నప్పుడు నిజంగా దేవుడు కచ్చతంగా మొట్టికాయలు వేయకుండా ఉంటాడా ? కుప్పంలో అందుకనే మొట్టికాయలు వేశాడు.

మహిళా సాధికారిత కోసం ప్రతి అడుగులోనూ మహిళకు తోడుగా ఉన్నాం. పిల్లలను చదివించాలి, ఆ పిల్లలు బాగా ఎదగాలి, బాగా చదువుకోవాలి, పేదరికం నుంచి బయటపడాలి. చదువొక్కటే పిల్లల తలరాతను మార్చగలుగుతుంది, పేదరికం నుంచి ఆ కుటుంబాలను బయటకు వేయలుగుతుంది. 


*పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌*

ఇది గట్టిగా నమ్మిన ప్రభుత్వమే మన ప్రభుత్వం. అందుకనే ఇంతకముందు అరాకొరగా ఇచ్చామంటే ఇచ్చామనే ఫీజులను పూర్తిగా మార్చేశాం. పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ తీసుకొచ్చాం. పిల్లలకు ఎంత ఫీజులైతే కట్టాలో ఆ మొత్తం ఫీజులను కూడా కాలేజీలకు బకాయిలు లేకుండా చెల్లించాం. ప్రతి క్వార్టర్‌కు అంటే క్వార్టర్‌ అయిపోయిన వెంటనే వాళ్లకు ఫీజులు ఇచ్చేట్టుగా అవి కూడా నేరుగా తల్లులకిచ్చేట్టుగా, అ తల్లులు నేరుగా కాలేజీలకు కట్టేటట్టుగా చేశాం. ఆ కాలేజీల్లో కూడా వసతులున్నీ బాగున్నాయో లేదో వాళ్లే చూసేటట్టుగా జగనన్న విద్యా దీవెన అనే గొప్ప పథకాన్ని తీసుకొచ్చాం. 

18.51 లక్షల మంది తల్లులకు రూ.5573 కోట్లు ఇచ్చాం. 


*జగనన్న వసతి దీవెన*

జగనన్న వసతి దీవెన ద్వారా పిల్లల చదివించడం కోసం, బోర్డింగ్‌ ఇతర ఖర్చుల కోసం తల్లులు ఇబ్బంది పడకూడదు, ఆ పిల్లలు బాగా చదవాలి అని వారి చదువులు కోసం 15.57 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.2270 కోట్లు వసతి దీవెన పథకం కింద తల్లులకు ఇచ్చాం. 

ఇంజనీరింగ్‌ చదువుతున్న విద్యార్ధికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కాకుండా, సంవత్సరానికి బోర్డింగ్‌ ఇతర ఖర్చుల కోసం రూ.20 వేలు రెండు దఫాలుగా ఇచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 

పేదల తలరాతలు మార్చాలని, చదివించాలని మనసా, వాచా ఒక గొప్ప ఉద్యమానికి నాంది పలికాం. పిల్లవాడు పుట్టకముందు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి తల్లి గురించి ఆలోచించి అడుగులు వేస్తున్న ప్రభుత్వం మనది.


*వైయస్సార్ సంపూర్ణ పోషణ*

వైయస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం ద్వారా గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించడమే కాకుండా ఆరేళ్లలోపు ఉన్న పిల్లలందరికీ కూడా వారి ఎదుగుల ఎక్కువగా ఇప్పుడే ఉంటుంది కాబట్టి... వారి కోసం పౌష్టికాహారాన్ని అందించడమే ధ్యేయంగా ఈ పథకాన్ని తీసుకొచ్చాం. 

ఈ వైయస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం ద్వారా అంగన్వాడీలు అన్నింటినీ పౌండేషనల్‌ స్కూల్స్‌గానూ, శాటిలైట్‌ పౌండేషనల్‌ స్కూల్స్‌గానూ, పౌండేషనల్‌ ప్లస్‌ స్కూల్స్‌గానూ మారుస్తూ.. .అక్కడ కూడా ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చాం. ఆ వయస్సులోనే వీరికి ఇంగ్లీషు మీడియంలో పునాదులు వేసే కార్యక్రమం చేస్తున్నాం. ఈ పోషణ పథకం ద్వారా  30.16 లక్షల మందికి మేలు జరుగుతుంది. ప్రతియేటా దీని కోసం అక్షరాలా రూ.1990 కోట్లు ఖర్చవుతుంది. ఇదే పథకానికి గత ప్రభుత్వం రూ.500 కోట్లు కూడా ఖర్చు పెట్టేవారు కాదు. 


*గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ పోషణ ప్లస్‌*

77 గిరిజన ప్రాంతాల్లో అక్కచెల్లెమ్మలకు మరికొంత పోషణ అందించాలన్న తపనతో వైయస్సార్‌ సంపూర్ణ పోషణ్‌ ప్లస్‌ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. వైయస్సార్‌ కాపు నేస్తం అనే పథకం తీసుకొచ్చి 5 సంవత్సరల పాటు ఆ అక్కచెల్లెమ్మెలకు తోడుగా ఉంటూ నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. 

3.28 లక్షల మంది అక్కచెల్లెమ్మెలకు రూ.982 కోట్లు మేలు చేశాం. 


*ఈబీసీ నేస్తం*

ఇదే దిశగా అడుగులు ముందుకు వేస్తూ... ఎకనామికల్లీ బ్యాక్‌వర్డ్‌ కమ్యూనిటీలో (ఓసీల్లో) కూడా పేదలున్నారు. వాళ్లందరికీ కూడా ఇంకా మంచి చేయాల్సిన అవసరం ఉందని గట్టిగా భావించి ఈ జనవరి 9నుంచి అంటే పాదయాత్ర ముగిసిన రోజు నుంచి ఈబీసీనేస్తం అనే కొత్త పథకానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. 


*నామినేటెడ్‌ పదవులు, పనులలో 50 శాతం..*

మహిళలు ప్రతి అడుగులోనూ ముందుకు రావాలి, వారికి తోడుగా ఉండాలి, ఆర్ధికంగా, సామాజింగా, రాజకీయంగా అడుగులు ముందుకువేయాలి, వాళ్లకుఅన్ని రకాలగా చేయూతనివ్వాలన్న ఉద్దేశ్యంతో వాళ్లకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తూ.. . నామినేటెడ్‌ పదవుల్లో, పనుల్లో ఇచ్చేటట్టుగా  చట్టం చేశాం. 


*మహిళలను మహరాణులగా మార్చే ప్రభుత్వమిది*

మహిళలను మహరాణులుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం మనది. మనందరి ప్రభుత్వంలోనే ఏపీ కేబినెట్‌లో హోంమంత్రిగా ఒక చెల్లికి, ఉప ముఖ్యమంత్రిగా మరో ఎస్టీ మహిళకు స్ధానం కల్పించాం. ఎమ్మెల్సీలుగా ఇద్దరు మైనార్టీ మహిళలను, ఒక బీసీ మహిళను తీసుకొచ్చాం. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా అధికారిని నియమించాం. ఇది కూడా మన ప్రభుత్వంలోనే జరిగింది. 


*నామినేటెడ్ పదవుల్లో సైతం..*

నామినేటెడ్‌  కార్పొరేషన్‌ ఛైర్మన్లు, డైరెక్టర్లలో మహిళలకు 51 శాతం పదవులిచ్చాం. మొత్తంగా 202 ఛైర్మన్‌ పదవులిస్తే.. .అందులో 102 పదవులు అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం. 1154 డైరెక్టర్‌ పదవులు ఇస్తే... వీటిలో 586 పదవులు అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం. మొత్తం 1356 పదవుల్లో 688 అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం. 


*కార్పొరేషన్లు, మున్సిపాల్టీలలోనూ*

మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగరపంచాయతీల ఛైర్మన్లు, మేయర్లు వీటిలో కూడా సగభాగానికిపైగా అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం. నిన్న వచ్చిన ఫలితాలకు ముందే చట్టప్రకారం ఇవ్వాల్సింది కేవలం 42 అయితే మనం ఇచ్చింది 52 అంటే 60.47 శాతం ఇచ్చాం.


*53 శాతం మంది వాలంటీర్లు నా చెల్లెమ్మలే..*

 అంతే కాకుండా 202 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్లలో సగం మంది అక్కచెల్లెమ్మలే ఉన్నారు. వాలంటీర్లగా గ్రామాల్లోనూ, నగరాల్లోనూ సేవలందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న వారు దాదాపు 2.50 లక్షల మంది ఉంటే ఇందులో  53 శాతం నా చెల్లెమ్మెలే అని సగర్వంగా చెప్తున్నాను. 


ఇటీవల జరిగిన జెడ్పీ ఛైర్మన్ల ఎన్నిక రాష్ట్ర చరిత్రలోనే ఒక విప్లవం. 13 జెడ్పీ ఛైర్మన్లు ఉంటే 7 మంది అక్కచెల్లెమ్మలే. వైస్‌ ఛైర్మన్లు 26 మంది ఉంటే అందులో 15 మంది అక్కచెల్లెమ్మలే. చాలా మంది పురుష ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అందరూ మనసారా ఆశీర్వదించి అడుగులు వేస్తారని ఆశిస్తున్నాను.


*మహిళా భద్రతే ముఖ్యం* 

మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మనది. దిశా చట్టం చేసి, కేంద్రానికి ఆమోదం కోసం పంపాం. చట్టం అనేది మన చేతిలో ఉండదు. మనం చట్టం చేయాలి, కేంద్రానికి పంపాలి వాళ్లు ఆమోదించాలి. దానికి కొంత సమయం పడుతుంది. దిశా చట్టం చేయడమే కాకుండా 18 దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశాం. దిశ కోసం ప్రత్యేకంగా ప్రాసిక్యూటర్లను నియమించాం. ప్రతి జిల్లాలోనూ నియమించాం. ఫోరెన్సిక్‌ ల్యాబుల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రత్యేక కోర్టుల తీసుకొచ్చే దిశగా అడుగులు ముందుకువేస్తున్నాం. ఇది పూర్తిగా మన చేతిలో ఉన్న అంశం కాదు... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతిలో ఉన్న అంశం కాబట్టి ఆయన్ను పలు సందర్భాల్లో కలిసి వారిని కూడా పరిగణలోకి తీసుకుని వీటి ఏర్పాటు దిశగా వేగవంతంగా అడుగులు ముందుకు వేస్తున్నాం.


*దిశ యాప్ ఉంటే అన్నయ్య తోడున్నట్టే..* 

దిశ యాప్‌ తీసుకొచ్చాం. దాదాపు 90 లక్షలమంది అక్కచెల్లెమ్మల చేతిలోని సెల్‌ఫోన్లలో దిశ యాప్‌ ఉంది. ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్‌ తీసుకొని పోతే వారితో పాటు ఒక అన్న తోడుగా ఉన్నట్టే. ఏ అక్క చెల్లెమ్మ అయినా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే ఈ ఎస్‌ఓఎస్‌ యాప్‌ నొక్కినా, లేదంటే ఫోన్‌ను ఐదుసార్లు అటూ ఇటూ ఊపినా పదినిమిషాల్లో పోలీసులు వస్తున్నారు. 

6880 మందిని ఇప్పటివరకూ పోలీసులు కాపాడగలిగారు. మహిళా సాధికారతలో ఇంకా అడుగులు ముందుకువేశాం. 


*లాభాపేక్ష లేకుండా బెల్టుషాపులు తీసేశాం*

లాభాపేక్ష ఉంటే బెల్టుషాపులు తీసేయలేం అని చెప్పి ప్రైవేటు షాపులు లేకుండా చేశాం. గత ప్రభుత్వంలో వీధికొకటి చొప్పున వెలిసిన దాదాపు 44వేల బెల్ట్‌ షాపులను పూర్తిగా తొలగించాం. మద్యం దుకాణాలు 4380 గతంలో ఉంటే వాటిని 2934కు తగ్గించాం. గతంలో మద్యం దుకాణాల పక్కనే పర్మిట్‌ రూంలు ఉండేవి. అక్కచెల్లెమ్మలు ఆ దారిలో పోవాలంటే చాలా ఇబ్బంది పడేవారు. ఆ పర్మిట్‌ రూంలను రద్దు చేశాం. మహిళలకు ఇబ్బంది కలిగించే పరిస్తితులను మార్చివేస్తూ.. రాత్రి 8 గంటలు దాటితే మద్యం దుకాణాలను మూసే కార్యక్రమం జరుగుతుంది. 

ఇవన్నీ కాకుండా మద్యం మీద షాక్‌ కొట్టే విధంగా రేట్లు వేశాం. గతంలో ఐఎంఎఫ్‌ఎల్‌ నెలకు 34 లక్షల కేసులు అమ్మే పరిస్థితి ఉంటే ఈ రోజు కేవలం నెలకు 21 నుంచి 22 లక్షల మద్యలో అమ్మకాలు జరుగుతున్నాయి. గతంలో బీర్లు 17 లక్షల కేసులు అమ్ముతుంటే ప్రస్తుతం 7 లక్షల కేసులకు పరిమితం అయ్యాం. ఇవన్నీ చేశాం కాబట్టే మద్యాన్ని నియంత్రించగలిగాం.


ప్రతి అడుగు కూడా అక్కచెల్లెమ్మలకు ఏం చేస్తే మంచి జరుగుతుందో ఆ విధంగా ముందుకు పోవటం జరిగింది. అంతేకాకుండా.. మహిళల భద్రత కోసం ప్రతి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో మహిళల పోలీసులున్నారు. లా అండ్‌ ఆర్డర్‌కు ప్రాముఖ్యత ఇస్తున్నాం కాబట్టే మహిళలపై నేరాలను వెంటనే స్పందించి అరికట్టుగులుతున్నాం. మహిళలపై నేరాల మీద చర్యల విషయంలో గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంతటి తేడా ఉందో కొన్ని వ్యత్యాసాలను చెబుతాను. 


దేశంలోనే ఒక విప్లవంగా దిశ ఆప్‌ రూపొందించి ఇప్పటి వరకు 90 లక్షల డౌన్‌లోడ్లు జరిగేలా చేసిన ప్రభుత్వం మనదని సగర్వంగా తెలియజేస్తున్నాను. 


*ఏపీ దేశంలో నెంబర్ వన్‌*

గత ప్రభుత్వంలో  60 రోజుల్లో సెక్సువల్‌ నేరాల మీద పోలీసు దర్యాప్తు చేసిన సందర్భాలు ఎన్ని అని చూస్తే.. కేవలం 14.5 శాతం. అదే మన ప్రభుత్వంలో సెక్సువల్‌ నేరాల మీద పోలీసు దర్యాప్తు 93.6 శాతంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ దేశంలో నెంబర్‌ వన్‌. ఈ విషయంలోజాతీయ సగటు 40 శాతంగా ఉంది. మహిళల మీద ఎవరైనా అకృత్యాలు చేస్తే త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నాము. గత ప్రభుత్వంలో  2014–19 మధ్య రేప్, మర్డరు కేసుల్లో దర్యాప్తు సగటున 318 రోజులు పడితే.. ఇప్పుడు మన ప్రభుత్వంలో కేవలం 42 రోజులకు తగ్గించాం.గ్యాంగ్‌ రేప్‌ మీద విచారణ గత ప్రభుత్వంలో సగటున 257 రోజులు పడితే ఈ రోజు గ్యాంగ్‌ రేప్‌ మీద విచారణ కేవలం 42 రోజులకు తగ్గింది. గత ప్రభుత్వంలో పోక్సో చట్టం ప్రకారం దర్యాపునకు 175 రోజులు పడితే ఇదే పోక్సో చట్టం ప్రకారం మన ప్రభుత్వంలో అది కేవలం 41 రోజులకు తగ్గింది. రేప్‌కేసుల మీద విచారణ గత ప్రభుత్వంలో సగటున 261 రోజులు పడితే.. మనందరి ప్రభుత్వంలో అది కేవలం 47 రోజులకు తగ్గింది. గత ప్రభుత్వంలో సెక్సువల్‌ అపెండర్స్‌ను జియో ట్యాగింగ్‌ చేయలేదు.  కానీ, ఈ రోజు 2,17,647 మందికి జియో ట్యాగింగ్‌ చేయటం జరిగింది. వారు ఎక్కడకి పోతున్నా పోలీసులు చూస్తున్నారు. గతంలో ఏ ఒక్క పోలీసు స్టేషన్‌లో ఉమెన్‌ హెల్ప్‌ డెస్క్‌లు లేవు. ఈరోజు ప్రతి పోలీసు స్టేషన్‌లో మహిళాధికారి అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తున్నారు. 


గత ప్రభుత్వంలో క్రైం సీన్‌ మేనేజ్‌మెంట్‌కు ఒక్క వెహికల్‌ ఇవ్వలేదు. ఇప్పుడు మన ప్రభుత్వంలో 18 వాహనాలు తీసుకురావటం జరిగింది. ఈ వాహనాలు పోలీసు స్టేషన్లకు కేటాయించాం.


*21 వ శతాబ్ధపు భారతీయ మహిళ ఏపీ నుంచే*

మహిళాపక్షపాత ప్రభుత్వంగా మనం అమలు చేస్తున్న కార్యక్రమాల ద్వారా 21వ శతాబ్ధపు భారతీయ మహిళ మన రాష్ట్రం నుంచే ఆవిర్భవిస్తుందని సగర్వంగా తెలియజేస్తున్నాను.


*స్వేచ్ఛ కార్యక్రమం*

స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అక్షరాల 10,388 పాఠశాలలు, ఇంటర్‌మీడియట్‌ కళాశాలల్లో టీనేజ్‌ బాలికలకు బ్రాండెడ్‌ శానిటరీ నాప్‌కిన్స్‌ను ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మన ప్రభుత్వమే ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 56,703 ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు ఇతర విద్యా సంస్థల్లో మన బడి, నాడు–నేడు కార్యక్రమం ద్వారా మౌలిక వసతులు పెంచుతున్నాం. టాయిలెట్లు అక్కడ ఎంతో ముఖ్యం. టాయిలెట్లు లేక బాలికలు బడులు మానేసిన సందర్భాలు ఉన్నాయి. ఎవ్వరూ పట్టించుకోలేదు. దాన్ని పూర్తిగా మార్చాలని ప్రభుత్వం అడుగులు వేశాం.  బాలికల కోసం నిరంతరం నీటి సరఫరాతో ఉన్న టాయిలెట్లు ప్రత్యేకంగా నిర్మిస్తున్నాం. ఇందులో భాగంగా మొదటి దశలో 15,715 పాఠశాలల్లో నాడు–నేడు క్రింద కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పటికే మొదటి దశ పూర్తయింది. జులై 2023 నాటికి అన్ని పాఠశాలలో పూర్తి అవుతుంది. టాయిలెట్ల నిర్వహణకు కూడా పాఠశాలల్లో పేరెంట్స్‌ కమిటీ పర్యవేక్షణలో హెడ్‌మాస్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాము.


ఇదంతా మనసుతో  చేశాము. మహిళలు ప్రతి రంగంలో ఎదగాలనే సంకల్పంతో  చేశాము. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఏ ఎన్నికలకు వెళ్లినా  వైయస్‌ఆర్‌సీపీ గొప్పగా, గర్వంగా ఉంది.


*కుప్పంలో బ్రహ్మరథం*

కుప్పంలాంటి చోట అక్కచెల్లెమ్మలు వైయస్‌ఆర్‌సీపీకి బ్రహ్మరథం పట్టారంటే ఇదొక్కటే నిదర్శనం. ఇప్పటికైనా చంద్రబాబుకు అర్థమైతే.. తను ఎలా ఉన్నాడో, మనం ఎలా ఉన్నామో తెలిస్తే సంతోషం. కుళ్లుతో, కుట్రలతో ఇళ్లపట్టాలు అక్కచెల్లెమ్మలకు ఇవ్వకుండా కేసులు వేయించి ఇబ్బందులు పెట్టించే పరిస్థితి నుంచి ఇప్పటికైనా జ్ఞానోదయం అవుతుందేమో. దేవుడు మొట్టికాయలు వేశారు కాబట్టి బుద్ధి వస్తుందేమో ఆశిస్తున్నాను.


*97 శాతం ఆశీర్వాదం*

నిన్న 12 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్‌ కౌంటింగ్‌ ముగిసిశాయి. 12 చోట్ల వైయస్‌ఆర్‌సీపీ ఒకే ఒక్కచోట టీడీపీ వచ్చింది. కొండపల్లిలో టై. మిగిలిన అన్నీ క్లీన్‌ స్వీప్‌. దాని అర్థం 97శాతం వైయస్‌ఆర్‌సీపీని ఆశీర్వదించారని గ్రాఫ్‌ను సీఎం జగన్‌ ప్రదర్శంచారు.


 మనం అధికారంలో వచ్చినప్పుడు 50 శాతం ఓట్‌ షేర్‌ వస్తే... ఇప్పుడు నగర పంచాయితీల్లోనే 55.77 శాతం వైయస్‌ఆర్‌సీపీకి వస్తే..  టీడీపీకి 34.2 శాతం వచ్చాయని గణాంకాలు వివరించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.


*చంద్రబాబు ఇక్కడ ఉన్నా... విన్నా బాగుండేది*

ఒక బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రభుత్వానికి చంద్రబాబు సహకరించాల్సిన అవసరం ఉందని గుర్తిస్తారని.. ప్రతి సందర్భంలో కోర్టుల ద్వారా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కనీసం ఇప్పటికైనా కూడా చంద్రబాబుకు జ్ఞానోదయం కలుగుతుందని ఈ విషయం చెపుతున్నా. చంద్రబాబు ఇక్కడ ఉన్నట్లైతే బావుండేది. ఆయన ఈ విషయాలు విన్నట్లైతే బావుండేది. దురదృష్టవశాత్తూ ఆయన ఇక్కడ లేరు. చంద్రబాబు ఇక్కడ లేకపోయినా టీవీల్లో చూస్తూ ఉంటారని ఆశిస్తున్నానని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ అన్నారు.

Popular posts
Gudivada - Kankipadu road widening, development works start
Image
నైపుణ్యాల‌కు ప‌దును పెట్టండి... విజేత‌లుగా నిల‌వండి
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image
ఆస్తినష్టం, పంట నష్టం అంచనాల తయారీలో ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
Image
రైతు బజార్లలో 70 మెట్రిక్ టన్నుల టమాటా విక్రయాలకు రంగం సిద్దం
Image