సదుం మండలం (ప్రజా అమరావతి);
భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంట నష్టం,ఆస్తి నష్టం వివ రాల నివేదికలను సిద్ధం చేయండి:
రాష్ట్ర పంచా యతీ రాజ్ గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి
మంగళ వారం రాష్ట్ర పంచా యతీ రాజ్ గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి జిల్లా పర్య టనలో భాగంగా సదుం మండలం లో విస్తృతంగా పర్య టించి జిల్లాలో ఇటీ వల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంట నష్టం,ఆస్తి నష్టం వివరాల నివే దికలను సిద్ధం చేయా లనిఅధికారులను ఆదేశించారు...
మంత్రి పర్యటనలో చిత్తూరు ఎం పి ఎన్. రెడ్డప్ప,.జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్,టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, ఎన్ ఆర్ ఈ జి ఎస్ స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఎం. విశ్వనాధ్,మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, పంచాయతీ రాజ్ చీప్ ఇంజనీర్ డి.సుబ్బారెడ్డి, పంచాయతీ రాజ్, ఆర్ &బి,ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ లు అమర్ నాధ్ రెడ్డి, దేవానందం,విజ య్ కుమార్, హౌసింగ్ పీడీ పద్మనాభం, డ్వామా పీడీ చంద్ర శేఖర్, వ్యవసాయ శాఖ జెడి దొరసాని, డి పి ఓ దశరధ రామి రెడ్డి, జడ్పీ సి ఈ ఓ ప్రభాకర్ రెడ్డి,వివిధ సంబంధింత శాఖ ల డి ఈ లు, మండల స్థాయి అధికారులు ప్రజా ప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు..
మంత్రి పర్యటన లో భాగంగా తొలుత సదుం మండల బస్ స్టాండ్ సర్కిల్ వద్ద వరద బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వo వరదల వలన ఇళ్ల లోనికి నీరు చేరి ముంపు నకు గురైన బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు..
తదుపరి సదుం లో గార్గేయ నది ప్రవాహం లో కొట్టుకుపోయిన వంతెన ను పరిశీలిం చారు... కొత్త వంతెన నిర్మాణం కొరకు రూ.6.5 కోట్లు మంజూరు కావడం జరిగిందని, నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆర్ & బి ఎస్ ఈ మంత్రి గారికి వివరించగా.. నీటి ప్రవాహానికి కొట్టుకు పోయిన వంతెన కు సంబంధించి తాత్కా లికంగా నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని మంత్రి ఆర్ &బి అధికారు లను ఆదేశించారు..
అనంతరం సదుం జడ్పీ హైస్కూల్ లో జరుగు తున్న భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు..
తదుపరి సదుం మండలం నడిగడ్డ సమీపంలో వర్షాల కారణంగా నీట ముని గిన వరి పంటను పరి శీలించి వ్యవసాయ, ఉద్యాన వన పంటల నష్టం వివరాల ను సిద్ధం చేయాలని వ్యవసాయ, ఉద్యాన వన అధికారులు ను మంత్రిఆదేశించారు..
నడి గడ్డ సచివాల యం పరిధిలో గల రఘుపతి చెరువు ముంపు బాధితులకు చెరుకు వారి పల్లి సచివాలయంలో నిత్యావసర సరు కులు పంపిణీ చేశారు...
addComments
Post a Comment