చివరి రోజు నామినేషన్ దాఖలు వివరాలు :*చివరి రోజు నామినేషన్ దాఖలు వివరాలు :-*

 

కర్నూలు, నవంబర్ 05 (ప్రజా అమరావతి):  జిల్లాలోని కొలిమిగుండ్ల జడ్ పి టి సి స్థానానికి సంబంధించి వైయస్సార్ సిపి పార్టీ నుంచి 2 నామినేషన్లు, ఇండిపెండెంట్  నుంచి 01 నామినేషన్ మొత్తం మూడు కాగా, నంద్యాల జెడ్ పి టి సి స్థానానికి సంబంధించి బిజెపి పార్టీ నుంచి 1 నామినేషన్ దాఖలు అయ్యాయి..   కొలిమిగుండ్ల, నంద్యాల  జడ్పీటీసీ స్థానాలకు కలిపి మొత్తం 4 నామినేషన్లు దాఖలయ్యాయి.*


అలాగే 10 ఎంపిటిసిల స్థానాలకు సంబంధించి మొత్తం ఇప్పటి వరకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి.


సర్పంచులకు సంబంధించి సి.బెళగల్ మండలం యనగండ్ల గ్రామపంచాయతీ సర్పంచ్ కు ఈ రోజు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం ఇప్పటి వరకు 4 నామినేషన్ లు దాఖలయ్యాయి.


అలాగే కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామ పంచాయతీ సర్పంచ్ కు ఈ రోజు 5 నామినేషన్లు దాఖలు కాగా ఇప్పటి వరకు మొత్తం 8 నామినేషన్లు దాఖలయ్యాయి.


ఎమ్మిగనూరు మండలం తిమ్మాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ కు ఈ రోజు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 5 నామినేషన్లు దాఖలయ్యాయి.


21 వార్డ్ మెంబర్ లకు ఈ రోజు 28 నామినేషన్ దాఖలు కాగా మొత్తం ఇప్పటి వరకు 33 నామినేషన్లు దాఖలయ్యాయి.


బేతంచర్ల మున్సిపాలిటీ 20 వార్డ్ లకు  ఈ రోజు 91 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 3 రోజులకు 131 నామినేషన్లు దాఖలయ్యాయి.


నందికొట్కూరు మున్సిపాలిటీ 10 వార్డ్ కు  నిన్నటి రోజు (04-11-2021) 01 నామినేషన్ దాఖలు కాగా ఈ రోజు 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎమ్మిగనూరు మున్సిపాలిటీ 10 వార్డ్ కు 2 నామినేషన్ లు దాఖలయ్యాయి.