విద్యకు పేదరికం ఏమాత్రం అడ్డు కాకూడదు

 


*విద్యకు పేదరికం ఏమాత్రం అడ్డు కాకూడదు!*


** *రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా*


** *2020–2021 విద్యా సంవత్సరానికి "జగనన్న విద్యా దీవెన" మూడవ విడత లబ్ది మొత్తాన్ని కంప్యూటర్‌ బటన్‌ నొక్కి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి*


** *ప్రభుత్వ సాకారాన్ని విద్యార్థులు సద్వినియోగించుకోవాలి : జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు*


** *జిల్లా వ్యాప్తంగా అర్హులయిన 73,017 మంది విద్యార్థులకు చెందిన 65,648 మంది తల్లుల ఖాతాల్లో రూ.46.20 కోట్లు జమ.*


కడప, నవంబర్ 30 : విద్యకు పేదరికం ఏ మాత్రం అడ్డు కాకూడదన్నదే.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా  పేర్కొన్నారు. 


మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్సు ద్వారా.. 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి మూడవ విడత "జగనన్న విద్యా దీవెన" లబ్ది మొత్తాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి.. నేరుగా అర్హులయిన విద్యార్థుల తల్లుల ఖాతాలో జమచేయడం జరిగింది. 


ఈ కార్యక్రమానికి కాలెక్టరేట్ విసి హాలు నుండి.. జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజుతో పాటు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా, రాష్ట్ర ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, బద్వేలు ఎమ్మెల్యే డా.దాసరి సుధ, జడ్పి ఛైర్మెన్ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, కడప నగర మేయర్ కె.సురేష్ బాబు, అడా చైర్మన్ గురుమోహన్, కడప ఆర్డీవో ధర్మ చంద్రారెడ్డిలు హాజరయ్యారు.


ముఖ్యమంత్రి విసి ముగిసిన అనంతరం... 2020-21 విద్యాసంవత్సరానికి మూడవ విడతగా జిల్లాలోని 73,017 మంది విద్యార్థులకు మంజూరయిన "జగనన్న విద్యా దీవెన" లబ్ది మొత్తం రూ. 46,20,28,717 ల మెగా చెక్కును.. విద్యార్థులు, వారి తల్లులకు.. కార్యక్రమానికి హాజరైన అతిథులు చేతుల మీదుగా అందజేశారు. 


అనంతరం.. కార్యక్రమానికి హాజరైన వారితో ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా  మాట్లాడుతూ.. విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల సంక్షేమం కోసం ఎన్నోరకాల పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. పేద విద్యార్థుల చదువులు తల్లిదండ్రులకు ఏ మాత్రం భారం కాకూడదనే ఉద్దేశ్యంతో.. అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక వంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.  


"నాడు-నేడు" కార్యక్రమం ద్వారా.. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వాటి అనుబంధ వసతి గృహాలను అధునాతన వసతులతో సమూలమైన మార్పును తీసుకురావడం జరుగుతోందన్నారు.  9 రకాలయిన మౌలిక వసతులను సంతృప్త స్థాయిలో, కొర్పొరేటు స్థాయికి ధీటుగా తీర్చి దిద్దడం జరుగుతోందన్నారు. డిగ్రీ కళాశాలలను కూడా "నాడు-నేడు" కార్యక్రమంలో ఆధునీకరించడం జరుగుతోందన్నారు.  ప్రభుత్వం అందిస్తున్న సాకారాన్ని.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని.. సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు ప్రధాన భూమిక పోషించాలని ఆయన ఆకాంక్షించారు. 


జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు మాట్లాడుతూ... దేశ చరిత్రలోనే తొలిసారిగా పూర్తి స్థాయి ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అమలు చేయడం రాష్ట్ర ప్రజల అదృష్టం అన్నారు. "జగనన్న విద్యాదీవెన" అనే పథకం.. రాష్ట్రంలో ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, ఆపై స్థాయి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికి ముఖ్యమంత్రి అందిస్తున్న సువర్ణావకాశం కల్పిస్తున్నారు. నిరుపేద విద్యార్థులకు సైతం.. ఉన్నత స్థాయి చదువులను చదివే అవకాశం ప్రభుత్వం కల్పించినందుకు... లబ్ది పొందిన విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుకుంటున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్య దీవెన సాయం అందుకుని.. ఆర్థిక సమస్యలను పక్కన పెట్టి  చదువుపై ఏకాగ్రత ఉంచి.. భవిష్యత్ లక్ష్యం పైపు అడుగులేయాని ఆకాంక్షించారు. 


రాష్ట్ర ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేద విద్యార్థుల పాలిట మేనమామగా నిలిచిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అడగకుండానే విద్యార్థులకు అన్ని వసతులను సమకూర్చుతున్నారన్నారు. అడబిడ్డలకు అన్నగా నిలిచి వారి ఆర్థికాభివృద్ధికి ఎలా పాటు పడుతున్నారో.. వారి బిడ్డల విద్యా బాధ్యత కూడా తనదేనంటూ.. విద్యార్థుల సంక్షేమానికి శ్రీకారం చుట్టడం దేశానికే గర్వకారణం అన్నారు. 


ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య మాట్లాడుతూ... "జగనన్న విద్యాదీవెన" లబ్ది సొమ్మును తల్లుల అకౌంట్లో జమ చేస్తుండడం ద్వారా.. తల్లుల్లో ఆత్మ గౌరవం పెరుగుతోంది. తల్లులు స్వయంగా తమ బిడ్డల కాలేజీలకు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడి, అక్కడి వసతులు సరిగా లేకపోతే ప్రశ్నించగల ధైర్యాన్ని, అన్యాయాన్ని ఎదురించే తత్వాన్ని వారిలో పెంపొందించేలా.. చేస్తోందన్నారు. అంతేకాకుండా ఈ పథకం లబ్ది కోసం.. 75 శాతం హాజరు తప్పనిసరి అనే నిబంధన విధించడం ద్వారా.. విద్యార్థుల హాజరు కూడా 100 శాతం పెరిగేందుకు దోహద పడుతోందన్నారు.


బద్వేల్జ్ ఎమ్మెల్యే డా. దాసరి సుధా మాట్లాడుతూ... "జగనన్న విద్యాదీవెన" పథకం కింద ప్రతి విద్యార్థికి పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించే బృహత్తర పథకాన్ని ఈ ఏడాది  3వ విడతగా వారి తల్లుల ఖాతాల్లో జమచేయడం ఎంతో సంతోష కరమైన విషయం అని పేర్కొన్నారు. విద్యాదీవెన పథకం ద్వారా.. లక్షలాది మంది పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకొనే అవకాశం కలిగిందన్నారు. ఎప్పటికీ జగన్ మోహన్ రెడ్డే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు.


కడప మేయర్ కె.సురేష్ బాబు మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే తొలిసారిగా పూర్తి స్థాయి ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అమలు చేయడం అభినందనీయం అన్నారు. నిరుపేద విద్యార్థులకు సైతం.. ఉన్నత స్థాయి చదువులను చదివే అవకాశం ప్రభుత్వం కల్పించినందుకు... లబ్ది పొందిన విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుకుంటున్నామన్నారు. 


జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేద విద్యార్థుల పాలిట మేనమామగా నిలిచిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అడగకుండానే విద్యార్థులకు అన్ని వసతులను సమకూర్చుతున్నారన్నారు. అడబిడ్డలకు అన్నగా నిలిచి వారి ఆర్థికాభివృద్ధికి ఎలా పాటు పడుతున్నారో.. వారి బిడ్డల విద్యా బాధ్యత కూడా తనదేనంటూ.. విద్యార్థుల సంక్షేమానికి శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను.. ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవడం రాష్ట్ర ప్రజలుగా మనందరికీ గర్వకారణం అన్నారు. 


** *జిల్లా 2020-21 విద్యాసంవత్సరానికి గాను మూడవ విడత "జగనన్న విద్యా దీవెన" పథకం ద్వారా.. జిల్లాకు మంజూరైన లబ్ది మొత్తం వివరాలను జిల్లా కలెక్టర్ తెలియజేసారు.*


** జిల్లాలో మొత్తం 73,017 మంది విద్యార్థులు అర్హత సాధించగా, అర్హులైన 65,648 మంది తల్లుల ఖాతాల్లో  మంది  రూ. 46,20,28,717 లు మంజూరైంది.


** అందులో ఎస్సి సంక్షేమం కింద 13,017 మంది విద్యార్థులకు గాను, 11,669 మంది తల్లుల ఖాతాల్లో రూ.6.98 కోట్లు విడుదలైందన్నారు.


** ఎస్టి సంక్షేమం కింద 1,352 మంది విద్యార్థులకు చెందిన 1201 మంది తల్లుల ఖాతాల్లో రూ.75.47 లక్షలు విడుదలైందన్నారు.


** బిసి సంక్షేమం కింద 26,391 మంది విద్యార్థులకు గాను, 23,543 మంది తల్లుల ఖాతాల్లో రూ.15.45 కోట్లు విడుదలైందన్నారు.


** కాపు సంక్షేమం కింద 7,020 మంది విద్యార్థులకు గాను, 6,542 మంది తల్లుల ఖాతాల్లో రూ.4.56 కోట్లు విడుదలైందన్నారు.


** ఈబిసి కింద 16,008 మంది విద్యార్థులకు గాను, 14,435 మంది తల్లుల ఖాతాల్లో రూ.13.44 కోట్లు విడుదలైందన్నారు.


** ముస్లిం మైనారిటీ కింద 9,082 మంది విద్యార్థులకు గాను 8,131 మంది తల్లుల ఖాతాల్లో రూ.4.90 కోట్లు విడుదలైందన్నారు.


** క్రిస్టియన్ మైనారిటీ కింద 147 మంది విద్యార్థులకు గాను, 127 మంది తల్లుల ఖాతాల్లో రూ.9.16 లక్షలు విడుదలైందన్నారు.


అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి విద్యా సంబందిత సంక్షేమ పథకాల ఫలాలు అందలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి. లక్ష్యం అని.. "జగనన్న విద్యా దీవెన" లబ్ధి పొందడంలో ఏవైనా సమస్యలు, అభ్యంతరాలు ఎదురయితే... సంబందిత సంక్షేమ శాఖల జిల్లా అధికారికి గానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వ కాల్ సెంటర్ నెంబర్ 1902 కు కాల్ చేయవచ్చన్నారు.


ఈ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ ఈడి, బీసీ సంక్షేమ శాఖాధికారి డా.సి.హెచ్ వెంకటసుబ్బయ్య, మైనారిటీ సంక్షేమ శాఖాధికారి మస్తాన్ వలి, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఈడీలు, విద్యాశాఖ అధికారులు, జిల్లాలోని పలు డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర ప్రొఫైషనల్ కోర్సుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. 


*** *పలువురు విద్యార్థుల అభిప్రాయాలు...*


1. *దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాం..*


'జగనన్న విద్యా దీవెన' పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం గర్వించదగ్గ విషయం. మూడవ విడత విద్యాదీవెన ద్వారా ఫీజు రీయింబర్స్ మెంట్ అమౌంట్ మా అమ్మ అకౌంట్లో జమ అయ్యింది. చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడే వారికి జగన్ సార్ అందిస్తున్న సాయం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాం. వసతి దీవెన కూడా పెండింగ్ లేకుండా అందుతోంది.


- సి.ప్రియాంక, (బి.టెక్ ఫైనల్ ఇయర్, అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్) రవీంద్రనగర్, కడప 


2. *ఏ సీఎం ఇంత గొప్పపని చేయలేదు..*


గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా.. ఇలాంటి గొప్పపని చేయలేదు. మాలాంటి పేదవారికి ఉన్నత వహాదువులు చదువుకోవడానికి ముఖ్యమంత్రి కల్పిస్తున్న గొప్ప వరం. "జగనన్న విద్యా  దీవెన" ద్వారా ఆర్థిక సాయం అందడంతో.. మా తల్లిదండ్రులకు చదువు కోసం.. ఆర్థికావస్థ పడే భారం తగ్గింది. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వమే అందిస్తుంటే.. అంతకంటే ఇంకేం కావాలి. 


- జి.నవ్యశ్రీ, (బిఎస్సి విద్యార్థిని, కోటిరెడ్డి మహిళా డిగ్రీ కాలేజి), బద్వేలు.


3. *విద్యా ప్రదాత మా జగన్ సార్..!*


మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్య ప్రదాతగా.. ఆంధ్రరాష్ట్ర చరిత్రలోనే సుస్థిర స్థానాన్ని సంపాదించారు. విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో.. "జగనన్న విద్యా దీవెన" అనే బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యకు అంత్యంత ప్రాధాన్యం ఇచ్చి.. పాఠశాలల్లో అధునాతన వసతులు కల్పించారు. సీఎం సార్ చాలా గ్రేట్..!!


- కె.వాణి, (బి.టెక్ విద్యార్థిని, అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్)  చిన్నచౌక్, కడప.


4. *పేద విద్యార్థుల పాలిట వరం !*


ఫీజుల కోసం కుటుంబంలో తల్లిదండ్రులు పడే కష్టాలు చూసి చదువు మానేసే వారిని చాలామందిని చూసాను.  విద్యాదీవెన పథకం మాలాంటి పేద విద్యార్థుల పాలిట వరంగా మారింది. రాష్ట్రంలో పేద విద్యార్థులకు అధునాతన విద్యా వసతులు కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థులందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. 


- జి.సంధ్య, (ఐ&ఎం ఓకేషనల్ ద్వితీయ సంవత్సరం) చెన్నంపల్లె, ఓబులవారిపల్లె మండలం.


5. *తల్లులకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు..*


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన నాటి నుండి  రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో అనూహ్యమైన మార్పులు సంతరించుకుంది. విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చి.. విద్యార్థుల్లో చదువుపై మరింత ఇష్టాన్ని పెంచుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల తల్లులకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి.. ఆర్థిక లావాదేవీల విషయంలో జగన్ సార్ నైపుణ్యాన్ని పెంచుతున్నారు.


- కె.శిల్ప (బిఎ ఫైనల్ ఇయర్, ఉమెన్స్ కాలేజ్) కమలాపురం.