బుట్టాయిగూడెం /జీలుగుమెల్లి (ప్రజా అమరావతి);
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కొరకు నిర్మించిన కాలనీలు పరిశీలించడం జరిగిందని కాలనీలలో ఇళ్లు, మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉన్నాయని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ ఝ అన్నారు.
బుధవారం బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామం , జీలుగుమిల్లి మండలం పి నారాయణపురం గ్రామంలోని పోలవరం నిర్వాసితుల కోసం నిర్మించిన గృహ సముదాయాలను ఆయన పరిశీలించారు .అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు గృహాలు సక్రమంగా నిర్మించారని ,మౌలిక వసతులు రోడ్లు, డ్రైనేజీలు ,మంచినీరు , విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశారని, వాటిని పరిశీలించడం జరిగిందని తెలిపారు. మౌలిక వసతులు చాలా వరకు పూర్తయ్యాయని మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని వాటన్నిటిని మూడు నెలలలో నాటికి పూర్తి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
పోలవరం నిర్వాసితుల కొరకు నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీ లలో పాఠశాల ,జి సి సి స్టోర్లు, అంగన్వాడీ కేంద్రాలను కూడా నిర్మించారని అయితే కొన్ని కాలనీలలో రోడ్లు ,డ్రైన్లు నిర్మించవలసి ఉందని ఆయన అన్నారు. వీటన్నిటిని అధికారులు పూర్తి చేయాలని ఆదేశించడంతో జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ కాలనీ లు ప్రత్యేక శ్రద్ధతో నిర్మిస్తుందని ఆయన అన్నారు. ఇంతకు ముందు బుట్టాయిగూడెం మండలంలోని రెడ్డి గణపవరం ఆర్ అండ్ ఆర్ కాలనీ లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ,గిరిజన ఉత్పతుల విక్రయ శాల , ఫోటో ప్రదర్శనను తిలకించి తిలకించారు . రెడ్డి గూడెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాలనీ వాసుల నుండి వినతులు తీసుకుని వారు చెప్పిన సమస్యలు విన్నారు. కాలనీ వాసులు చెప్పిన సమస్యలన్నిటిని త్వరలోనే పరిష్కారమవుతాయని ఆయన వారికి హామీ ఇచ్చారు. కొంతమంది పాత ఊరులో ఇల్లు ఖాళీ చేశామని మాకు ఇంకా డబ్బులు రాలేదని తెలిపారు. దానికి వారు డబ్బులు త్వరలోనే చెల్లించడం జరుగుతుందని బిల్లు పంపించడం జరిగిందని డబ్బులు మీ అకౌంట్ అకౌంట్ లోనే నేరుగా పడతాయని ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంచినీళ్లు సరఫరా చేసేందుకు కాలనీ కి ఆర్ఓ ప్లాంట్ మంజూరు చేయడం జరుగుతుందని , మంచినీళ్లు చివరి వరకు అందేవిధంగా పైపులైన్ లేవిల్ చూసి వేయాలని సంబంధింత అధికారులను ఆదేశించారు.
కాలనీలో సోమ్ పీట్ లు నిర్మించాలని , జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అంచనాలు రూపొందించి పంపాలనిఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం లోనూ , జీలుగుమిల్లి మండలం నారాయణపురం లో లబ్ధిదారులకు నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీ లోని ఇళ్ళ లోపాలి కి వెళ్లి ఏ విధంగా ఉన్నాయి , రోడ్లు ఏ విధంగా ఉన్నాయి ,డ్రైనేజీ ఏ విధంగా ఉన్నాయి ఆయన పరిశీలించారు .
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ చేకూరి శ్రీధర్ , ఐటిడిఎ పిఓ ఓ. ఆనంద్ , జంగారెడ్డిగూడెం ఆర్డీవో వై. ప్రసన్న లక్ష్మి , సంబంధిత తహసిల్దార్లు , ఎంపీడీవోలు , ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment