ప్రముఖులు ఘన స్వాగతం


నెల్లూరు, నవంబర్ 12 (ప్రజా అమరావతి): మూడు రోజుల నెల్లూరు పర్యటన నిమిత్తం విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడుకి వెంకటాచలం రైల్వే స్టేషన్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు ఘన స్వాగతం


పలికారు. శుక్రవారం ఉదయం రేణిగుంట నుంచి ప్రత్యేక రైలులో  వెంకటాచలం రైల్వే స్టేషన్ కు  విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడుకి నెల్లూరు జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీలు శ్రీ వాకాటి నారాయణరెడ్డి, శ్రీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు, గుంటూరు రేంజ్ డిఐజి శ్రీ త్రివిక్రమ వర్మ, ఎస్పీ శ్రీ విజయరావు, ఏఎస్పి శ్రీమతి వెంకటరత్నం, జాయింట్ కలెక్టర్లు శ్రీహరేంధిరప్రసాద్, శ్రీ గణేష్ కుమార్,  శ్రీ విదేహ్ ఖరే,ట్రైనీ కలెక్టర్ శ్రీ పర్హాన్ అహ్మద్ ఖాన్, ఆర్డివోలు శ్రీ చైత్ర వర్షిని,  శ్రీ శీనా నాయక్ తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక రైలులో వెంకయ్య నాయుడుతో పాటు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు.