అమరావతి పాదయాత్ర రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటాం.



*-అధికారవికేంద్రీకరణతోనే రాష్ర్ట సమగ్రాభివృధ్ది సాధ్యమవుతుంది*


*-కర్నూలును న్యాయరాజధాని కాకుండా అడ్డుకుంటారా ?*


*- చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను సాగనివ్వం.*


*-న్యాయరాజధానికి సిపిఐ కట్టుబడి ఉంది*


*-న్యాయరాజధాని సాధనకు పాదయాత్రలు చేస్తాం.*


-అమరావతి పాదయాత్ర రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటాం.



కర్నూలు (ప్రజా అమరావతి);

 అధికారవికేంద్రీకరణపరిరక్షణసమితి' ఆధ్వర్యంలో' అధికారవికేంద్రీకణ - మూడు రాజధానుల ఏర్పాటు' అనేఅంశంపై సదస్సులో కర్నూలులోజరిగినసదస్సులో పలువురు రాజకీయనేతలు మేధావులు,వక్తలు అని అభిప్రాయపడ్డారు.


          రాష్ట్రంలోని అన్నిప్రాంతాల సమగ్రాభివృద్ధిని ఆశించి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడురాజధానులు ఏర్పాటుచేయాలని తీసుకున్ననిర్ణయంపై తెలుగుదేశంనేతలు అడ్డుతగలడం దారుణం. కేవలం అమరావతిలోల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో తక్కువధరకు సేకరించినభూములను ఎక్కువధరలకు అమ్ముకొని కోట్లాదిరూపాయలను సొమ్ముచేసుకునేందుకు చంద్రబాబు,ఆయన తనయుడు నారాలోకేష్‌ అక్కడి అమాయక రైతులనురెచ్చగొడుతున్నారు.టీడీపీ ముసుగులో చేపట్టినపాదయాత్రలో రైతులు ఎవరైనా ఉన్నారా? అందరూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, తెలుగుదేశంపార్టీనేతలు, కార్యకర్తలే పాదయాత్రలో ఉన్నారు. ఇప్పటికైనా అమరావతి రైతులు నిజాన్ని గ్రహించాలి. అలాగే ...ఎన్నోత్యాగాలు చేసిన కర్నూలువాసుల చిరకాలస్వప్నమైన న్యాయరాజధానిని సాధించుకునేందుకు కలిసిరాని రాజకీయనేతలందరు కాలగర్భంలో కలిసిపోకతప్పదని పలువురు మేధావులు, నేతలు హెచ్చరించారు. అమరావతి పాదయాత్ర రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటాం అని స్పష్టం చేశారు.

                అధికార వికేంద్రీకరణ పరిరక్షణసమితి' ఆధ్వర్యంలో' అధికారవికేంద్రీకణ - మూడురాజధానులఏర్పాటు' అనేఅంశంపై సోమవారం ఉదయం కర్నూలులోని మెగాసిరిఫంక్షన్‌హాల్‌లో' సదస్సు నిర్వహించారు.అధికారవికేంద్రీకరణపరిరక్షణసమితి అధ్యక్షులు శ్రీ క్రిష్టఫర్‌ ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు.


సదస్సులో పాల్గొన్న వారు ఏమన్నారంటే .........

రాయలసీమపౌరుషాన్నిచూపిస్తాం ... కాటసానిరాంభూపాల్‌రెడ్డి, పాణ్యంఎమ్మెల్యే మాట్లాడుతూ

పాణ్యం శాసనసభ్యుడు శ్రీ కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ 1953 నుంచిచారిత్రాత్మక త్యాగాలుచేసిన కర్నూలు వాసులు ఇక త్యాగాలు చేసేస్థితిలోలేరని, అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన న్యాయరాజధానిని సాధించుకునేందుకు రాయలసీమ పౌరుషాన్నిచూపిస్తాం అని అన్నారు. జిల్లాలోశ్రీశైలం ప్రాజెక్టు ఉన్నా,ప్రాజెక్టు నీటిమట్టం 854 అడుగులకు మించిఉంటేతప్ప ఆనీటిని ఇక్కడి రైతులు ఉపయోగించుకునేస్థితిలో లేరన్నారు. రాష్ట్రసమగ్రాభివృద్దిని ఆశించి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్ గారు మూడురాజధానులు ప్రకటిస్తే టీడీపీ అడ్డుకోవడం దారుణం. న్యాయరాజధానిని సాధించుకుంటే కర్నూలుజిల్లా ఎంతోఅభివృద్ధి చెందుతుంది. వేలమందికిఉద్యోగ, ఉపాధిఅవకాశాలులభిస్తాయి. కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుకు జరుగుతున్నఈ ఉద్యమంలోకలిసిరాని రాజకీయనేతలను ప్రజలేకాలగర్భంలోకలిపేస్తారు అని అన్నారు.కర్నూలు అభివృద్ధిని ఆశించి ఇక్కడి టీడీపీనేతల్లో రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే ఇకనుంచి చేపట్టే ఉద్యమాల్లో కలిసి రావాలి అని కోరారు.  


పాదయాత్రలో  నిజమైన రైతులు ఉన్నారా? ... డా. జెసుధాకర్, కోడుమూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ

        చంద్రబాబు డైరెక్షన్‌లో సాగుతున్నఅమరావతి రైతుల పాదయాత్రలో నిజమైన రైతులుఉన్నారా? అని ప్రశ్నించారు. ఆ యాత్రలోరియల్‌ ఎస్టేల్‌ వ్యాపారులు, చంద్రబాబు బినామీలు, టీడీపీనేతలు, కార్యకర్తలే ఉన్నారన్నారు. స్వార్థంతో పేద, మధ్యతరగతి రైతులనుంచి తక్కువధరకు కొనుగోలుచేసిన భూములకు కోట్లు సంపాదించాలని నిజమైనరైతులను మోసంచేసేందుకు టీడీపీనేతలు డ్రామాలు ఆడుతున్నారు. న్యాయరాజధానిని సాధించుకునేందుకు జిల్లాకుచెందిన మాజీకేంద్ర,రాష్ట్రమంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారు. కుట్రలు, కుతంత్రాలతో మూడురాజధానులను అడ్డుకుంటే ప్రజలు క్షమించరు అని అన్నారు.


ఉద్యమానికి తొలి అడుగు పడింది ... డా.ఎస్‌ సంజీవ్‌కుమార్, కర్నూలుపార్లమెంట్‌ సభ్యులు. మాట్లాడుతూ

          రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన న్యాయరాజధాని సాధనకోసం తొలిఅడుగుపడింది.  పాదయాత్రలు, నిరాహారదీక్షలు, నిరసనదీక్షలు చేపట్టాల్సిఉంది అని ఎంపి సంజీవ్ కుమార్  అన్నారు. అవసరమైతే లక్షలమందితో దీక్షలు చేపట్టి ఈ అంశాన్నిదేశ ప్రజలందరికి తెలియజెప్పాలన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం అప్పట్లోనే 55వేలఎకరాలను ఇచ్చిన రైతులకు నేడు నీళ్లులేని పరిస్థితి ఉంది. జిల్లాలో 95 కిలోమీటర్లమేర తుంగభద్ర ప్రవహిస్తున్నా, తాగేందుకు కూడా నీరులేని పరిస్థితి ఇక్కడ ఉందన్నారు. అన్నివిధాల నష్టపోయిన కర్నూలుజిల్లా న్యాయరాజధానితో అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్న తరుణంలో టీడీపీ అడ్డుకోవడం, కేసులు వేయడం వంటిచర్యలకు పాల్పడుతోందని అన్నారు. న్యాయరాజధాని ఇక్కడ ఏర్పాటైతే 25 వేల కుటుంబాలు ఇక్కడికి వస్తాయి. తద్వారా అభివృధ్ది జరుగుతుందని అభిప్రాయపడ్డారు.


అమరావతి పాదయాత్ర సీమలో అడుగుపెడితే అడ్డుకుంటాం  బీక్రిష్టఫర్, 


అధికారవికేంద్రీకరణపరిరక్షణసమితి అధ్యక్షులు మాట్లాడుతూ

   అమరావతి రైతులపేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేయిస్తున్నపాదయాత్ర రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ స్పూర్తితో చేపట్టిన అధికారవికేంద్రీకణ,  మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రంలోని అన్నిప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు. 


న్యాయరాజధాని సాధనకు పోరు షురూ చేయాలి  ... బీ.వై.రామయ్య, నగరమేయర్ మాట్లాడుతూ

కర్నూలులో ఏర్పాటు చేయాలనుకున్న న్యాయరాజధానిని సాధించుకునేందుకు ఉద్యమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఇప్పటికే కర్నూలు ప్రజలు మూడు పర్యాయాలు మోసపోయారన్నారు. సోనియాగాంధీ కుట్రతో రాష్ట్రం విడిపోయింది. శ్రీభాగ్‌ ఒప్పంధం నిర్ణయాలను అమలుచేసేందుకు రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమకు చెందిన కొందరు నేతలు ఈప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడం వారి రాజకీయభవిష్యత్తుకే మంచిదికాదని అన్నారు.   కరువుకాటకాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఇక్కడి రైతులను ఆదుకోలేని టీడీపీనేతలు అమరావతి రైతుల నకిలీఉద్యమాలకు చందాలు ఇవ్వడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.


న్యాయరాజధానికి సిపిఐ కట్టుబడి ఉంది ... రామక్రిష్ణారెడ్డి, సీపీఐనేత మాట్లాడుతూ

కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుచేసే అంశానికి తమపార్టీ కట్టుబడిఉందని స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణపరిరక్షణసమితి భవిష్యత్తులో చేపట్టబోయే ఉద్యమాలకు సీపీఐ సంపూర్ణ సంఘీభావం ప్రకటించడంతోపాటు ప్రత్యక్షంగాపాల్గొంటుంది.ఈమేరకు పార్టీనిర్ణయం తీసుకుందని అన్నారు.


3 రాజధానులకు మధ్దతుగా 450 రోజులుగా దీక్షలు చేస్తున్నాం ... శ్రీనివాసరావు,  నవ్యాంధ్ర ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షులు (గుంటూరు) మాట్లాడుతూ

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన మూడురాజధానులకు మద్దతుగా 450 రోజులుగా అమరావతిలో దీక్షలు చేస్తూనే ఉన్నామని శ్రీనివాసరావు అన్నారు. అమరావతి రైతులపేరుతో కొనసాగుతున్న పాదయాత్రలు వట్టిబూటకం. కేవలం చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలో వారంతా కేవలం పాత్రధారులే. తమ ఆస్తులను ఇంకా పెంచుకునేందుకు చంద్రబాబు, ఆయన తనయుడు నారాలోకేష్‌ అక్కడి అమాయకరైతులను రెచ్చగొడుతున్నారు అని అన్నారు. భారతరాజ్యాంగస్పూర్తితోనే ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు అని తెలియచేశారు.


న్యాయ రాజధాని సాధనకు పాదయాత్రలు ... సీహెచ్‌ వెంగళరెడ్డి, ఏపీఎన్‌జీఓస్‌ జిల్లాఅధ్యక్షులు మాట్లాడుతూ

కర్నూలులో న్యాయరాజధానిని సాధించుకునేందుకు కర్నూలునుంచి హైకోర్టువరకు పాదయాత్రలు చేపడదాం అని అన్నారు. అందుకు అవసరమైతే ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక, ప్రజా, మహిళా సంఘాలతో కలిసి ఉద్యమాన్నిఉధృతం చేద్దాం. ఉద్యమాన్ని గ్రామస్థాయిలోకి తీసుకుపోయేందుకు ఉద్యోగులందరం ఒక వారం రోజులపాటు మాస్‌ క్యాజువల్‌ లీవ్‌ పెట్టేందుకైనా వెనుకాడమని, న్యాయరాజధాని కర్నూలుహక్కు అని అన్నారు. 




ఎంతటిత్యాగాలకైనాసిద్దం ... ఐవిజయకుమార్‌రెడ్డి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు మాట్లాడుతూ

కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటయ్యేంతవరకు ఉద్యమాలను ఉధృతంచేసే ప్రక్రియలో ఎంతటిత్యాగాలను చేసేందుకైనాసిద్దం అని విజయకుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పూర్తిగా వెనుకబడిన రాయలసీమను అభివృద్ధిచేసేందుకు రాష్ట్రప్రభుత్వం కర్నూలులో న్యాయరాజధానిని ఏర్పాటుచేసేందుకు ప్రకటించినా, కొందరు తమ స్వార్థంకోసం అడ్డుకోవడం దారుణం అని అన్నారు.న్యాయరాజధాని ఇక్కడ ఏర్పాటైతే న్యాయపరమైన అనేక కార్యాలయాలు వస్తాయి.అని అన్నారు.  


ఈసదస్సులో  డిప్యూటీ మేయర్‌ రేణుక, మాజీఎంపీబుట్టారేణుక, మాజీఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి,జాతీయకిసాన్‌ సంఘ్‌ ఉపాధ్యక్షులు వీ. సిద్దారెడ్డి, విద్యాసంస్థల అధినేతలు జీ.పుల్లయ్య, కేవీసుబ్బారెడ్డి, ఏపి ఎన్జిఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరిరెడ్డి, రాయలసీయవిద్యార్థి, యువజనసంఘాల జేఏసీ కన్వీనర్‌ శ్రీరాములు, కోకన్వీనర్‌ ఆర్‌ చంద్రప్ప,  సీనియర్‌ న్యాయవాదులు వైజయరాజు, నాగలక్ష్మిదేవి, రిటైర్డు తహసీల్దార్‌ రోషన్‌ ఆలీ, సీపీఐనేత రామక్రిష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు.

Comments