*ఇన్నొవేషన్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ : ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*
*త్వరలోనే అమెజాన్ ద్వారా మరో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు*
*ప్రతి నియోజకవర్గంలో 'సీవోఈ' దిశగా ఏపీ అడుగులు
*
*భవిష్యత్ స్టార్టప్, ఇంక్యుబేషన్, టెక్నాలజీకి సీవోఈ నాంది*
*విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ ప్రారంభోత్సవంలో మంత్రి మేకపాటి*
విశాఖపట్నం, నవంబర్, 30 (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ ను ఇన్నొవేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే అమెజాన్ ఆధ్వర్యంలో మరో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కు శ్రీకారం చుడతామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు దిశగా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నాస్కామ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ ను వర్చువల్ గా హాజరైన కేంద్ర ఐ.టీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తో కలిసి మంత్రి మేకపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... భారతదేశ ఆనవాళ్లున్న పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈవో అవడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా హర్షధ్వానాలతో పరాగ్ అగర్వాల్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఐ.టీ, పరిశ్రమలు, టెక్నాలజీలో , వ్యవస్థాగత నిర్మాణాలలో భారతీయుల సత్తా ఏంటో నేడు ప్రపంచం చూస్తోందని మంత్రి మేకపాటి పేర్కొన్నారు.
9 టెక్నాలజీలతో ఏపీని ఇన్నొవేటివ్ ఇంక్యుబేషన్ హబ్ గా మలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్స్, రొబొటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఎడ్జ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్ మెంటెడ్ రియాలిటీ, బ్లాక్ చైన్ , ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 5జీ, సైబర్ సెక్యూరిటీ వంటి టెక్నాలజీలతో ఏపీ ట్రెండ్ క్రియేట్ చేస్తుందన్నారు. కొత్తదారులలో నడుస్తూ.. సరికొత్త మార్గాలను సృష్టిస్తామని మంత్రి మేకపాటి తెలిపారు. భారతదేశం త్వరలోనే చరిత్రను మళ్లీ పునరావృతం చేసి, మరో చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. గత ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఐ.టీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ని కలిసి చెప్పినట్లు వర్క్ ఫ్రం హోమ్ టౌన్ ల ప్రాజెక్టును పూర్తి చేయబోతున్నామని ఈ సందర్భంగా మంత్రి మేకపాటి పేర్కొన్నారు. త్వరలోనే ఏపీకి వచ్చి ఆ ప్రాజెక్ట్ సందర్శించాలని కేంద్ర మంత్రిని మంత్రి మేకపాటి కోరారు.
సీవోఈ ప్రారంభోత్సవం అనంతరం మంత్రి మేకపాటి మీడియాతో మాట్లాడుతూ ..విశ్వవిద్యాలయంలో సీవోఈ ఏర్పాటు సరైన నిర్ణయంగా వెల్లడించారు. రకరకాల ప్రాంతాలు, గ్రామీణ స్థాయి నుంచి వచ్చే యువతకు మేలు జరిగే విధంగా సుమారు 3,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాస్కామ్ సీఓఈని ఏర్పాటు చేయడం రాబోయే స్టార్టప్, టెక్నాలజీ, ఇంక్యుబేషన్ కార్యక్రమాలకు నాందిగా మంత్రి పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పీవీజీడీ ప్రసాద్ స్పందించి సీవోఈకి స్థలాన్ని కేటాయించి కీలక పాత్ర పోషించినందుకు మంత్రి కృతజ్ఞతాభినందనలు తెలిపారు.
అన్ని పరికరాలతో కూడిన ల్యాబ్, 3–డీ ప్రింటర్స్, పీసీబీ ప్రొటోటైప్ మెషీన్స్, సోల్డరింగ్ స్టేషన్లు, హైఎండ్ ఆసిలోస్కోప్స్‌తో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు టెక్నాలజీలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి రాజీవ్ వెల్లడించారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి ఔత్సాహిక స్టార్ట్అప్స్‌కు కేంద్రం శిక్షణ ఇవ్వనుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఏ.పీ ఐ.టీ మంత్రి మేకపాటి కోరినట్లు వర్క్ ఫ్రం హోం టౌన్ ప్రాజెక్టును సందర్శిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అన్నిరంగాల్లో ఏపీ ముందుందని, టెక్నాలజీ, ఇన్నొవేషన్ సహా ప్రతి అంశంలో ఏపీ యాక్టివ్ గా ఉంటోందన్నారు. భవిష్యత్ లో కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాయని ఆయన స్పష్టం చేశారు. వర్క్ ఫ్రం హోం టౌన్ల ప్రాజెక్టు లో మంత్రి గౌతమ్ రెడ్డి బృందానికి మరోసారి కేంద్ర మంత్రి అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంశంలో ఏపీ మోడల్ ను అనుసరించే అవకాశాలను స్వయంగా వచ్చి పరిశీలిస్తామన్నారు.
సీవోఈ ప్రారంభోత్సవానికి వర్చువల్ గా హాజరైన కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సహానీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, విశాఖ జెడ్పీ చైర్ పర్సన్,సుభద్ర, ఐ.టీ,నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి, ఐ.టీ శాఖ ప్రత్యేక కార్యదర్శి బి.సుందర్, నాస్కామ్ అధ్యక్షుడు దేబ్ జానీ ఘోష్, ఆంధ్రా యూనివర్సిటీ వీసీ పీవీజీడీ ప్రసాద్ ,తదితరులు
addComments
Post a Comment