జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో పండించిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా దాన్యం కొనుగోలు ప్రారంభించాం.. కలెక్టర్



దేవరపల్లి (ప్రజా అమరావతి);


జిల్లాలో ఖరీఫ్  సీజన్ లో పండించిన ధాన్యాన్ని  రైతు భరోసా కేంద్రాల ద్వారా దాన్యం కొనుగోలు ప్రారంభించాం.. కలెక్టర్ 





జిల్లాలో ఖరీఫ్  సీజన్  లో సాగు చేసిన ధాన్యాన్ని  రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తూన్నామని జిల్లా కలెక్టర్ కార్తి కేయ మిశ్రా పేర్కొన్నారు.


 దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామం లో బుధవారం గ్రామ సచివాలయం,  రైతు భరోసా కేంద్రమును స్థానిక శాసన సభ్యులు తలారి వెంకట్రావు తో కలసి  కలెక్ట ర్ ప్రారంభించారు. ఈ సభకు  ఎమ్మెల్యే తలారి వెంక ట్రావు అధ్యక్షతన జరిగింది. సభ లో కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ , జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు నిర్మాణాలు కొనసాగుతున్నాయని అన్నారు. శాశ్వత  రైతు భరోసా కేంద్రాలు కూడా త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించారు.  ధాన్యం కొనుగోళ్లు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించారని ప్రకటించారు. తేమ  శాతం 17  లేదా 16 ఉండాలని అన్నారు. తేమ శాతం తగ్గించేందుకు అవసరమైన యంత్ర8పరికరాలు కూడా అందుబాటులో కి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్పారు.  ప్రతి రైతు  నష్టపోకూడదనే ఉద్దేశం తో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. గ్రామ సచివా లయాలు జిల్లా వ్యాప్తంగా నిర్మా ణంలో ఉన్నాయని ఆయన వె ల్లడించారు దేవరపల్లి పల్లంట్ల రోడ్డు పరిస్థితి తాను స్వయంగా పరిశీలించాలని రోడ్డు విస్తరణ కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందిస్తామని తెలిపారు. ఇదే విధంగా పలు గ్రామాల మధ్య నుండి వెళుతున్న పోలవరం కుడికాలువ తాడిపూడి కాలవ కాలువ వెడల్పు చేయడం జరు గుతుందని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. 


ఈ సందర్భం గా ఆయన గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రంతోపాటు యూనియన్ యూనియన్ బ్యాంక్ ఎటిఎం కూడా శాసన సభ్యులు తో కలసిఆయన ప్రారంభించారు. జననీ జన్మ భూమి అనే నానుడి ని సార్ధకం చేస్తున్న విశాఖ పట్నం నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ జి వెంకటేశ్వరరావు జేవీఆర్ చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు.  జేవియర్ పల్లంట్ల గ్రామంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వపరం గా సహకారం అందిచడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.


 గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ గోపాలపురం నియోజకవర్గం లో రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలకు శాశ్వత భవన నిర్మాణాలు కొనసాగు తున్నాయని తెలిపారు. రైతులు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే తలారి తెలిపారు. 

గోపాలపురం ఏఎంసీ చైర్మన్ జై జనార్ధన రావు ,  మండల పరిషత్ అధ్యక్షు డు దుర్గారావు జెడ్ పి టి సి స్వర్ణకుమారి , మండల మండల వైసీపీ అధ్యక్షుడు కూచిపూడి సతీష్ గ్రేటర్ విశాఖ నగరాభివృ ద్ధి సంస్థ చైర్మన్ జి వెంకటేశ్వర రావు మాట్లాడారు.  


ఈ సంద ర్భంగా గా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎమ్మెల్యే తలారి వెంక ట్రావు ఎంపీపీ దుర్గారావు ఏఎంసీ చైర్మన్ జనార్దన్ రావు వైసీపీ అధ్యక్షుడు  సతీష్ , యూనియన్ బ్యాంకు డిసిఎం మూర్తి cg పాతూరి సత్యనారాయణలను మింట కరించారు గ్రామ సచివాలయం లో గల వివిధ విభాగాలను ఎమ్మెల్యే తలారి జడ్పిటిసి స్వర్ణకుమారి,  ఏఎంసి చైర్మెన్ జనార్ధనరావు, ఎంపీపీ దుర్గారా వు , సర్పంచ్ నూతలపాటి వెంక టరమణ  , సర్పంచ్, ఉప సర్పం చులకు కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రత్యేక గౌరవం ఇచ్చి వారి వారి సీట్లలో కూర్చోబెట్టారు.



ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రామకృష్ణ,  బి ఎల్ పి ఓ బి సి ల మూర్తి వైసీపీ నేతలు జగదీష్,  గడ్డ రాంబాబు , ధోని లి జానకిరామ్ ,  రాజేంద్ర బాబు ఈ ఓ పి ఆర్ డి కల్లూరి సుబ్రహ్మణ్య శర్మ,  కార్యదర్శి ఆకులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు






Comments