ఆర్బీకేల స్థాయిలోనే, ఫాంగేట్‌ వద్దే కొనుగోలు



*ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై మంత్రుల బృందంతో కలిసి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్షా సమావేశం*


*ధాన్యం సేకరణపై పటిష్ట విధానం : సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*

*ఆర్బీకేల స్థాయిలోనే, ఫాంగేట్‌ వద్దే కొనుగోలు


:*

*మోసాలు, అవినీతికి తావులేకుండా అత్యంత పారదర్శక విధానం :*

*ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తొలగింపు :*

*రైతుకు మంచి ధర వచ్చేలా చూసేందుకే ఈ చర్యలు*

*–సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*


అమరావతి (ప్రజా అమరావతి);

*ఖరీఫ్‌లో వరి సాగు, దిగుబడులపై వివరాలు అందించిన అధికారులు*

15.66 లక్షల హెక్టార్లలో వరిసాగుచేశారని అంచనాలు వెల్లడించిన అధికారులు

దాదాపు 87లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా ధాన్యం దిగుబడి ఉంటుందని అధికారుల అంచనా

దీంట్లో దాదాపు 50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉంటుందని అంచనా

6884 ఆర్బీకేల పరిధిలో వరిని సాగు చేసినట్టుగా వివరాలు వెల్లడించిన అధికారులు


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే.... :*

ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం సేకరణ కేంద్రాలు :

పేమెంట్స్‌లో తప్పిదాలు లేకుండా, మోసాలు లేకుండా, వేగంగా పేమెంట్లు చేయడానికి వీలుగా ఇ–క్రాప్‌ బుకింగ్, ఈ కేవైసీ :

వ్యవసాయ సలహా మండళ్లు, వీఏఏలు, వాలంటీర్లతో అవగాహన పెంచే కార్యక్రమాలు :

ఆధార్‌ నంబర్‌ ఆధారంగా చెల్లింపులు


ధాన్యం కొనుగోళ్లలో మోసాలను నివారించే చర్యల్లో భాగంగా పూర్తిగా మిల్లర్ల పాత్రను తీసేశామన్న సీఎం

రైతుల ముంగిటే, ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం: సీఎం

ధాన్యం సేకరణలో అక్రమాలు, అవకతవకలకు ఆస్కారం ఉండకూడదన్న సీఎం

అవినీతికి ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఉండకూడదు: అధికారులకు సీఎం ఆదేశం 

ధాన్యం నాణ్యతను నిర్ధారించే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండేలా గట్టి చర్యలు తీసుకోవాలి: సీఎం

ధాన్యం సేకరణలో రైతులకు మేలు చేసేలా కొత్త విధానంలోకి వెళ్తున్నాం :  సీఎం

దీన్నొక సవాల్‌గా తీసుకుని, అన్నిరకాలుగా సిద్ధంకావాలి :  అధికారులకు సీఎం ఆదేశం

ధాన్యం సేకరణపై రైతులకు అవగాహన కల్పించడానికి వాలంటీర్లు, ఆర్బీకేల ద్వారా కరపత్రాలను ప్రతి రైతు ఇంటికీ ఇవ్వాలన్న సీఎం

అలాగే ధాన్యం సేకరణపై వివరాలతో కూడిన బోర్డును ఆర్బీకేల్లో ఉంచాలన్న సీఎం

మంచి ధర పొందడానికి తగిన సలహాలు, సూచనలు కూడా అందించేలా ఈ కరపత్రాలను రూపొందించాలన్న సీఎం

ఎలాంటి మినహాయింపులు లేకుండా రైతులకు పూర్తిస్థాయిలో కనీస మద్దతు ధర అందాలి :

దీనికోసం రైతులకు పరిజ్ఞానాన్ని పెంచేలా తగిన చర్యలు చేపట్టాలన్న సీఎం


ఈ సమీక్షా సమావేశంలో ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, అగ్రి మార్కెటింగ్‌ ముఖ్య కార్యదర్శి వై మధుసూధన్‌రెడ్డి, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్,  మార్కెటింగ్‌ స్పెషల్‌ కమిషనర్‌ పీ ఎస్‌ ప్రద్యుమ్న, ఏపీఎస్‌సీఎస్‌సీఎల్‌ వీసీ అండ్‌ ఎండీ జీ వీరపాండ్యన్, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Comments