చంద్రబాబు పై కాకాణి ఘాటైన విమర్శలు"

 *"చంద్రబాబు పై కాకాణి ఘాటైన విమర్శలు"*




శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి); వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి.




ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించారు.


 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకపక్క వర్షాలు కురుస్తున్నప్పుడే, ప్రమాదమని తెలిసి కూడా, ప్రజల కోసం ధైర్యంగా ఏరియల్ సర్వే చేపట్టారు.


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏరియల్ సర్వే నిర్వహించి, నష్టాన్ని అంచనా వేసి, ప్రజలను వరదల నుంచి ఆదుకోవడం కోసం వెంటనే మార్గదర్శకాలు జారీ చేశారు.


ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు వరదల్లో ఉంటే, ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు చేయడం నీచమైన చర్య.


వరద నీరు ప్రకృతి వైపరీత్యం తప్ప, మానవ తప్పిదం కాదు.


చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలన్ని జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదురుకోలేక ఉక్రోషంతో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.


మనిషి బ్రతికుంటే.. తాను సి.యం.కాలేనని గాల్లో కలిసిపోతే సి.యం. అవచ్చుననే దురుద్ధేశ్యంతో బాబు శాపనార్ధాలకు దిగాడు...


 చంద్రబాబు వరద బాధితులను ఓదార్చడానికి వచ్చాడా!, ఆయన తాను ఓదార్పు పొందడానికి వచ్చాడో! తెలియని పరిస్థితి.


చంద్రబాబు వరద ప్రభావిత  ప్రజలను ఓదార్చి, మనోధైర్యం కల్పించలేకపోయాడు.


వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక కుంటిసాకులతో అసెంబ్లీలో బహిష్కరణ డ్రామా..!


చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ లో అచ్చెన్నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించాం.


వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారిని లాక్కొని తెలుగుదేశం పార్టీలో పదవులు కట్టబెట్టి ప్రజాస్వామ్యాన్నికి విరుద్ధంగా చంద్రబాబు ప్రవర్తించాడు.


గతంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడం, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే  ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుండి బయటకు వచ్చారు.


ప్రజాక్షేత్రంలో పాదయాత్ర చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని  ప్రజలు ఆశీర్వదించారు.


చంద్రబాబు తన కుటుంబాన్ని ఎవ్వరు ఏమనక పోయినా, అన్నారని నటిస్తున్నాడు.


యన్.టి.ఆర్. ఏనాడో అన్నాడు... నా కన్నా నా అల్లుడు మహా నటుడని.


 చంద్రబాబు భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూర్చున్నాడని విమర్శిస్తున్నాడు.


చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాలలో తిరిగి సాధించిన ప్రయోజనం ఏమిటి?


చంద్రబాబు అసలు నెల్లూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించాడా..!


2014లో తుఫాన్ వల్ల హైవే తెగిపోతే  ఎన్ని రోజుల్లో పునరుద్ధరణ చేశారు!


జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గంటల వ్యవధిలో పునరుద్ధరణ చేశారు.


 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు చెన్నై హైవేకు శాశ్వత ప్రాతిపదికన పనులు ప్రారంభించలేక పోయారు.


 చంద్రబాబు సందర్శించిన సర్వేపల్లి రిజర్వాయర్ కు మీ ప్రభుత్వంలో రూపాయి నిధులు ఇచ్చారా..!


 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే నిధులు మంజూరు చేయించి, టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించాం.


చంద్రబాబు నేడు ఆక్వా రైతులపై కపట ప్రేమను వల్లబోస్తున్నాడు.


 చంద్రబాబు ప్రభుత్వంలో వరదలకు దెబ్బతిన్న ఆక్వా రైతులకు కనీసం విద్యుత్ రాయితీ ఇవ్వమని అడిగినా ఇచ్చాడా..! 


చంద్రబాబు కోతల ముఖ్యమంత్రి.. తప్ప, చేతల ముఖ్యమంత్రి కాదు.


 పబ్లిసిటీ కోసం కృష్ణా నది పురష్కారాలలో 29 మందిని బలితీసుకున్న చంద్రబాబుకు ప్రకృతి వైపరీత్యంతో జరిగే ప్రాణనష్టం పై మాట్లాడే హక్కు, అర్హత ఉందా..!


అమరావతి రైతుల పాదయాత్ర పరిష్కారం కోసం కాకుండా, విహార యాత్రకు వచ్చినట్లుంది.


వరద బాధితులకు కాకుండా పాదయాత్రకు విరివిగా  విరాళాలు ఇవ్వడం చూసి, ప్రజలు తెలుగుదేశం పార్టీని ఛీ కొడుతున్నారు.


చంద్రబాబు చేయిస్తున్న పాదయాత్రను తెలుగుదేశం పార్టీ చేస్తున్న పాదయాత్రగా చెప్పుకునే పరిస్థితి లేదు.


  రోజు వారీ కూలీలతో పాదయాత్ర చేయిస్తూ, మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నాడు బాబు...


 బినామీ భూములు కాపాడుకోవడం కోసం చేస్తున్న పాదయాత్రను ప్రజలు గమనిస్తున్నారు.


చంద్రబాబు ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టి గుంటూరు, అమరావతి ప్రాంతాలకైన ముఖ్యమంత్రి కావాలని రైతులను, కూలీలను పెట్టి పాదయాత్ర చేయిస్తున్నాడు.


కోవూరు ప్రాంతంలో స్థానిక శాసన సభ్యులు ప్రజలలో తిరుగుతూ, ప్రజల కోసం కష్టపడుతున్నారు.


చంద్రబాబుకు ప్రజలలో ఉన్న వ్యతిరేకత వల్ల వరద ప్రభావిత ప్రాంతాలలో చంద్రబాబు తిరగలేకపోయాడు.


వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు తిరగపడుతారు.. కాబట్టి చంద్రబాబు రాత్రులు తిరిగి వెళ్ళిపోయాడు.


గాల్లో తిరిగాడు..గాల్లో కలిసి పోతాడు.. అన్న చంద్రబాబు వ్యాఖ్యలను  ఖండిస్తున్నాం.

Comments