శ్రీకాళహస్తి (ప్రజా అమరావతి); పట్టణంలోని 3వ,7వ,20వ , 21వ వార్డులకు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు మరియు మహిళానాయకురాళ్లు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి సమక్షంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నా
రు.
*పార్టీలో చేరిన మహిళలు మాట్లాడుతూ.... ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమపథకాలను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అమలుచేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రజాపాలనను చూసి తాము ఈ పార్టీలో చేరామని తెలియజేశారు.
అనంతరం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి
నేడు తెలుగుదేశంపార్టీ నుంచి తమ పార్టీలో చేరిన మహిళామణులకు అభినందనలు తెలియజేశారు' తన కుమార్తె బియ్యపు పవిత్రరెడ్డిని తాను ప్రజలకు సేవ చేసేటప్పుడు ఓ మదర్ తెరిసాలా సేవ చేయాలని తెలియజేసననిఅన్నారు, నేడు దేశంలోని అన్నిపార్టీ నాయకులు అబ్బురపడే విధంగా ముఖ్యమంత్రివర్యులు జగనన్న ప్రజాసేవకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులై ఇతరపార్టీల నాయకులు రాష్ట్రంలోఅనేక చోట్ల తమ పార్టీలో చేరుతున్నారని, వైకాపా పార్టీ ప్రజాసేవకు పెట్టిందిపేరని, పార్టీలో చేరిన మహిళలందరూ తమతమ పరిధిలో ఉన్న ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయాలని.
addComments
Post a Comment