విద్య అవసరాన్ని గుర్తించిన అందరికి అభినందనలు తెలియచేస్తున్నానని


తాడేపల్లి- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం. (ప్రజా అమరావతి)!


ఘనంగా స్వాతంత్య్ర సమర యోధులు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలుఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.


కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర‌ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, ఉపముఖ్యమంత్రి శ్రీ అంజాద్ భాషా.


         స్వాతంత్య్ర‌ సమరయోధులు, భారత తొలి విద్యాశాఖ మంత్రి శ్రీ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర‌ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, ఉపముఖ్యమంత్రి శ్రీ అంజాద్ భాషా, పలువురు పార్టీ నేతలు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర‌ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మౌలానా అబుల్ కలామ్ లాంటి మహనీయులు చూపిన బాటలో అందరూ నడవాలన్నారు. విద్య అవసరాన్ని గుర్తించిన అందరికి అభినందనలు తెలియచేస్తున్నానని అన్నారు. దేశాన్ని మరింత విజ్ఞానవంతంగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో అందరూ పునరంకితం కావాలని కోరారు. మౌలానా లాంటి వారి పేర్లు తలుచుకోగానే మ‌న‌కు వైవిధ్యం, భిన్నత్వంలో ఏకత్వం గుర్తుకు వస్తుందన్నారు. అదే మనకు శ్రీరామరక్షగా నిలుస్తుందన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక దిక్సూచిగా నిలబెట్టిందన్నారు. భారతదేశ జాతిని మంచి స్ఫూర్తిదాయకమైన జాతిగా నిలబెట్టిందన్నారు. ఇలాంటి మహనీయులు అంటే మౌలానా, అంబేద్కర్, మహాత్మా గాంధీ వంటివారి వల్ల భారతదేశాన్ని ప్రపంచంలోనే మంచి దేశంగా నిలబెట్టిందన్నారు. మహనీయులను తలుచుకుంటూ కల్మషాలన్నింటిని విడనాడి దేశాన్ని సమైక్యంగా నిలపాలన్నారు. ఇండియన్ కమ్యూనిటికి ఈరోజుకు కూడా మంచి గుర్తింపు లభిస్తోందంటే కారణం ఆనాడు పడిన పునాదులేనని అన్నారు. మౌలానాగారు భారత జాతీయ నేత, స్వాతంత్య్ర పోరాటంలో గొప్ప‌ పోరాటం సల్పినవారు. దేశం విడిపోయినప్పుడు కూడా ఈ వైపు నిలుచున్నవ్యక్తి అని అన్నారు.

      మన రాష్ట్ర‌ విషయానికి వస్తే మైనారిటీల అభివృధ్దికి ఎనలేని కృషి చేసిన మ‌హానాయ‌కుడు వైయస్ రాజశేఖరరెడ్డి గారు అన్నారు. వారికి రిజర్వేషన్లను కల్పించడం ద్వారా వారికి విద్య, ఉపాధి అవకాశాలను కల్పించారన్నారు.

శ్రీ వైయస్ జగన్ గారు అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు మంచి ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. డిప్యూటి ముఖ్యమంత్రి పదవి సైతం మైనారిటీలకు ఇచ్చిన ఘనత జగన్ గారికే దక్కిందన్నారు.

చంద్రబాబు నాయుడుకు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే మైనారిటీలు గుర్తుకు వచ్చేవారన్నారు. కపట ప్రేమ చూపేవారన్నారు. జగన్ గారి ఔన్నత్యం తెలియాలంటే చంద్రబాబు లాంటి కుటిలత్వానికి పాల్పడేవారిని తలుచుకోవాలన్నారు. గతంలో నంద్యాలలో శ్రీ వైయస్ జగన్ గారు చేసిన వాగ్దానం మేరకు ఈరోజు ఇషాక్ భాషాను శాసనమండలి అభ్యర్దిగా ఎంపిక చేయడం జరిగిందన్నారు.

    ఈరోజు విద్యాదినోత్సవం జరుపుకుంటున్నాం. విద్యకు సంబంధించి మన రాష్ట్రంలో గత రెండేళ్లుగా విప్లవాత్మకమైన మార్పులు జరుగుతున్నాయి. నాడు-నేడు ద్వారా 16 వేల కోట్ల రూపాయలతో పాఠశాలలను దేవాలయాల్లాగా తీర్చిదిద్దుతున్నారని తెలియచేశారు. పేద విద్యార్దులు సైతం కార్పోరేట్ విద్య అందుకునే రీతిలో విద్యాలయాలను తీర్చిదిద్దారన్నారు. మధ్యాహ్నభోజనం, యూనిఫామ్, షూష్, పుస్తకాలు, బ్యాగ్ తో సహా వారికి అందించడమే కాకుండా బడికి వెళ్లే పిల్లలకు అమ్మఒడి కింద 15 వేల రూపాయలు తల్లుల అకౌంట్లలో వేస్తున్నారని వివరించారు. రెండున్నరేళ్లలో విప్లవం తీసుకువచ్చారన్నారు. మహాత్మాగాంధీ, మౌలానా, అంబేద్కర్ కన్న కలలను శ్రీ వైయస్ జగన్ గారు ఆచరణలో చూపుతున్నారని అన్నారు. కులం, మతం, ప్రాంతాలకు, వర్గాలకు అతీతంగా విద్యను అందిస్తున్నారన్నారు. 30 వేల కోట్ల రూపాయలు విద్యారంగంపై ఖర్చు పెట్టి ఆ రంగంలో సమూల మార్పులు తెస్తున్నారన్నారు. విద్యార్దులలో నైపుణ్యాభివృధ్ది పెంచే విధంగా ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు.

ఎయిడెడ్‌ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం స్పష్టతతో ఉందని, ఎవరిపై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్ధల్లో టీచర్లు సరిపడా లేరు. దాని వల్ల ఆ ఎయిడెడ్ విద్యసంస్ధలలో విద్యార్దుల సంఖ్య తగ్గిపోతోంది. వారు వాటిని నడపలేకపోతున్నారు. మీకు ఇష్టం ఉంటే ఆ సంస్దలను, టీచర్లను మాకు అప్పగించండి. ప్రభుత్వం వాటిని నడుపుతుంది. లేదా టీచర్లను మాకు సరెండర్ చేసి మీరే ఆ విద్యాసంస్దలను నడుపుకోవాలని ఓ విధానాన్ని తీసుకువచ్చింది. ఇందులో ఎలాంటి బలవంతం లేదు అని స్పష్టంగా చెప్పింది. అలాంటి పరిస్ధితులలో స్వచ్ఛందంగా ముందుకొచ్చిన విద్యా సంస్థల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఫీజులు కంట్రోల్ చేసే విధంగా విద్యా వ్యవస్థ‌లో సంస్కరణలకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే టీడీపీ రాజకీయం చేస్తుందని విమర్శించారు. పేదవాళ్లు చదువుకోవడం ఎలా అని లోకేష్‌ అడుగుతున్నాడని, విద్య విషయంలో పేదలకు రూపాయి కూడా ఖర్చు లేకుండా పూర్తి బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఘోరాలు జరిగాయన్నారు. అసలు ఎయిడెడ్ టీచర్ పోస్టులను భర్తీ చేయబోనని ఉత్తర్వులు ఇచ్చిన చంద్రబాబు నేడు ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతపురంలో టిడిపికి చెందిన ఓ మాజీ ఎంఎల్ ఏకు చెందిన ఎయిడెడ్ విద్యాసంస్దలో వాళ్లు గొడవ క్రియేట్ చేస్తే చంద్రబాబు కొడుకు లోకేష్ అక్కడకు వెళ్లి నోటికొచ్చిన కారుకూతలు కూస్తున్నారని అన్నారు. హెచ్చరికలు చేస్తున్నారని ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా అని అన్నారు. పేదవిద్యార్దులు చదువుకోవడం ఎలా అని లోకేష్ అంటున్నాడని.. ఫీజురీయంబర్స్ మెంట్, అమ్మఒడి ద్వారా ప్రభుత్వం విద్యార్దులకు ఫీజులు చెల్లిస్తోన్న విషయం గుర్తిస్తే మంచిదని అన్నారు. చిన్న సంఘటనను వారే క్రియేట్ చేసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామంటూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. ప్రజలందరూ ఇది గమనించి అవగాహన చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో 2,200 పైన ఎయిడెడ్ విద్యాసంస్ధలు ఉంటే 700 కు పైగా సంస్ధలు సరెండర్ చేయడానికి ముందుకు రాలేదు. వారు చెబుతున్న కాలేజీని సరెండర్ చేయడానికి ఎవరు ముందుకు రమ్మన్నారు. స్వచ్చంధంగా వచ్చేవారిని మాత్రమే ప్రభుత్వం తీసుకుంటుంది. లేదు మేం(విద్యాసంస్దలవాళ్లు) వెనకకు వెళ్తామన్నా కూడా వారికి తిరిగి ప్రభుత్వం ఇచ్చేస్తుంది. వాస్తవం ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి, పదవి కోల్పోయి ప్రస్టేషన్ లో రచ్చకెక్కి, పచ్చమూకను వేసుకుని నిస్మృహతో లోకేష్ అబద్దాలు ప్రచారం చేస్తూ రెచ్చగొడుతున్నారని తెలియచేశారు. కేవలం వారు ఉనికి చాటుకునేందుకు పేదల సంక్షేమం కోసం జరుగుతున్న మహా విద్యాయజ్ఞాన్ని చెడగొట్టేందుకు టిడిపి ప్రయత్నిస్తోందన్నారు. మీ విషప్రచారం ద్వారా ఏదో చేయాలని ప్రయత్నిస్తే ప్రజలు సహించరన్నారు. పచ్చమీడియా ప్రచారం చూస్తే అదంతా నిజమనేలా అనుమానాలు కలుగుతున్నాయన్నారు. టీచర్లు, తల్లిదండ్రులు, విద్యార్దులు అలాంటి విషప్రచారం చేసేవారిని, దుర్మార్గ ప్రచారాన్ని ప్రశ్నించాలని కోరారు. శ్రీ వైయస్ జగన్ చేపడుతున్న చర్యలతో రానున్న 5,10 ఏళ్లల్లో మన రాష్ట్రం హైలీ ఎడ్యుకేటెడ్‌ రాష్ట్రంగా అవతరిస్తుందన్నారు. 


    మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర‌ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ బేపారి అంజాద్ భాషా అన్నారు. ఆయన ఆశయాల కొనసాగింపులో భాగంగా నేడు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. శాసనమండలిలో నలుగురు మైనారిటీలకు స్ధానం కల్పించిన ఘనత శ్రీ వైయస్ జగన్ దేనని అన్నారు.


   కార్యక్రమంలో  శాసనమండలి సభ్యులు శ్రీ లేళ్ల అప్పిరెడ్డి, ఎంఎల్ఏ అఫీజ్ ఖాన్, పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర‌ అధ్యక్షుడు ఖాదర్ భాషా, ఉర్దు అకాడమి ఛైర్మన్ శ్రీ నదీమ్ అహ్మద్, ఎంఎల్సీ అభ్యర్దిగా ఎంపికైన ఇషాక్ , పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image