కోనేరు ను పరిశీలించిన ఎమ్మెల్యే

 మంగళగిరి (ప్రజా అమరావతి);       శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం వద్ద ఉన్న చీకటి కోనేరు పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యే ఆర్కే మాడవీధుల్లో మరియు దేవస్థానం పరిసరాలలో పాదరక్షలు లేకుండా నడిచి దేవస్థానం పవిత్రతను దృష్టిలో ఉంచుకొని మెలిగారు.

కోనేరు ను పరిశీలించిన ఎమ్మెల్యే 


కోనేరు లో ఉన్న పదార్థాలను తొలగించి రక్షణ చర్యలు చేపట్టాలని కోనేటి లో ఉన్న నీటిని ఉపయోగించుకోవటం పై దృష్టి సాధించాలని దేవస్థాన అధికారులకు సూచనలు చేశారు.

కోనేరుని రక్షించుకోవడం అందరి బాధ్యత అని ఎవరు వ్యర్ధపదార్ధాలు వేయకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. 

అనంతరం బైపాస్ రోడ్డులో గల నాలుగుకాళ్ల మండపం వద్ద గల కోనేరును కూడా పరిశీలించారు ఈ కోనేరులో పూడిక తీసి శుభ్రం చేయించి నాలుగు కాళ్ల మండపం చుట్టూ ఉన్న దేవస్థానం స్థలం శుభ్రం చేయించి ప్రహరీ నిర్మించాలని అధికారులు సూచనలు చేశారు.