ఢిల్లీ (ప్రజా అమరావతి);
స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపికి నెంబర్ వన్ ర్యాంక్, తెలంగాణకు రెండో ర్యాంక్.ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వేలో వెల్లడి.
స్మార్ట్ పోలీసింగ్ పై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో సర్వే నిర్వహించిన ఇండియన్ పోలీస్ ఫౌండేషన్.
2014 డిజిపిల సమ్మేళనంలో స్మార్ట్ పోలిసింగ్ పద్దతులను పాటించాలని ప్రధానమంంత్రి నరేంద్రమోడీ పిలుపు.
ప్రధాని పిలుపుకు స్పందించి స్మార్ట్ పోలిసింగ్ నిర్వహిస్తున్న రాష్ట్రాలలో ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే.
ప్రజల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వే నిర్వహించిన ఐపిఎఫ్.
ఫ్రెండ్లీ పోలీసింగ్, నిష్పక్షపాత, చట్టబద్ధ, పారదర్శక పోలిసింగ్, జవాబుదారీతనం, ప్రజల నమ్మకం విభాగాల్లో ఏపి నెంబర్ వన్, రెండో స్థానంలో తెలంగాణ.
పోలిస్ సెన్సిటివిటి , పోలీసుల ప్రవర్తన, అందుబాటులో పోలీసు వ్యవస్థ, పోలీసుల స్పందన, టెక్నాలజీ ఉపయోగం విభాగాల్లో తెలంగాణకు మొదటి స్థానం, ఏపికి రెండో స్థానం.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఉత్తమైన సేవలను అందించడంలో భారతదేశంలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖను మనస్పూర్తిగా అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, హోం మంత్రి సుచేరిత
addComments
Post a Comment