నెల్లూరు, నవంబర్ 14 (ప్రజా అమరావతి): వెంకటాచలంలోని అక్షర విద్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా సందర్శించారు
. ఆదివారం ఉదయం రేణిగుంట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో అక్షర విద్యాలయానికి విచ్చేసిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షాకు హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు, ఎంపీ శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ వాకాటి నారాయణరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, గుంటూరు రేంజ్ డిఐజి శ్రీ త్రివిక్రమ వర్మ, ఎస్పీ శ్రీ విజయ రావు, స్వర్ణ భారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి దీపా వెంకట్, చైర్మన్ శ్రీ కామినేని శ్రీనివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్లు శ్రీ హరేంధిర ప్రసాద్, శ్రీ గణేష్ కుమార్, శ్రీ విదేహ్ ఖరె, ట్రైనీ కలెక్టర్ శ్రీ పర్హాన్ అహ్మద్ ఖాన్, బిజెపి నేతలు శ్రీ సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
అనంతరం అక్షర విద్యాలయానికి చేరుకున్న కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడుతో కలిసి అక్షర విద్యాలయ ప్రాంగణంలోని దివంగత మాజీ ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి అక్షర విద్యాలయ ప్రాంగణంలోని సోమ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి విద్యార్థులతో గ్రూప్ ఫోటో దిగారు. అనంతరం రోడ్డు మార్గంలో సమీపంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు.
addComments
Post a Comment