పోటీలో ఉన్న ఎంపీటీసీ అభ్యర్థులు :కొవ్వూరు (ప్రజా అమరావతి) ;  


ఏడు ఎంపిటిసి స్థానాలకు దాఖలైన  నామినేషన్లు లో ఉపసంహరణ అనంతరం  తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం ఎంపీటీసీ అభ్యర్థి ఏకగ్రీవం కాగా మిగిలిన 6 స్థానాలకు 17 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. 


కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన ఏడు ఎంపిటిసి స్థానాలలో  తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం ఎంపీటీసీ స్థానానికి కొమ్మిరెడ్డి వీరరాఘవమ్మ (వైఎస్సార్ పార్టీ) ఏకగ్రీవం అయ్యారు. మొత్తం 8 మంది అభ్యర్థులు నామినేషన్ లు వెయ్యగా, ఏడు మంది నామినేషన్ లను ఉపసంహరించు కున్నారు.


పోటీలో ఉన్న ఎంపీటీసీ అభ్యర్థులు : 


 అత్తిలి మండలంలో ఈడూరు  నుంచి బి.పెద్దిరాజు (టీడీపీ)  , ఎస్. నాగేశ్వరరావు (వైఎస్సార్ సిపి) , పి. వెంకట సుబ్బారావు (జనసేన), పాలూరు నుంచి వి.గోవింద రావు (టిడిపి), ఎస్ ఆర్ విష్ణుమూర్తి (వైఎస్సార్ సిపి) , కె. శ్రీనివాసరావు (జనసేన) అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈడురు లో 3 పోలింగ్ కేంద్రాల లో 2409 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1210, స్త్రీలు 1199 మంది ఉన్నారు. పాలూరు  లో రెండు పోలింగ్ కేంద్రాల లో 1947 మంది ఓటర్లు ఉండగా పురుషులు 985,  స్త్రీలు 962 మంది ఉన్నారు. 


చాగల్లు మండలంలో చాగల్లు-5 కి వి.విజయకుమారి (వైఎస్సార్ సిపి), కె.ధనలక్ష్మి (బీజేపీ), పి. రజని (టీడీపీ) పోటీలో ఉన్నారు. జడ్పీ హెచ్ స్కూల్ కేంద్రం లో  నాలుగు పోలింగ్ కేంద్రాల లో 3428 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 1651, స్త్రీలు 1777 మంది ఉన్నారు. 


 ఇరగవరం మండలంలో కె. కుముదవల్లి లో రాచకొండ వెంకటరావు, (టీడీపీ), రాయి రామచంద్ర (వైఎస్సార్ సిపి) , పిండి గోవింద రావు(జనసేన) అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండు పోలింగ్ కేంద్రాల పరిధిలో 1711 మంది ఓటర్లు లో 841 మంది పురుష, స్త్రీలు 870 మంది ఉన్నారు. 


 నిడదవోలు మండలంలో తాళ్లపాలెం లో ముగ్గురు అభ్యర్థులు బి.కృష్ణ బాబు (వైఎస్సార్ సిపి) , బి.రమేష్ బాబు (ఐ.ఎన్.సి), పి. రాజేష్ (జనసేన) లు పోటీలో ఉన్నారు. ఐదు పోలింగ్ కేంద్రాల పరిధిలో 1751 పురుష, 1842 మహిళా ఓటర్లు ఉన్నారు. 


పెరవలి మండలం కానూరు-2 కి ఇద్దరు అభ్యర్థులు  వి.సుభద్రమ్మ (బీఎస్పి),  ఎమ్. ఉషారాణి (వైఎస్సార్ సిపి) లు పోటీలో ఉన్నారు. ఇక్కడ మూడు పోలింగ్ కేంద్రాల పరిధిలో 2783 మంది ఓటర్లు ఉండగా 1399 పురుష, 1384 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image