టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి గారి చొరవతో తిరుమల తిరుపతి దేవస్థానం కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు.

 టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి గారి చొరవతో తిరుమల తిరుపతి దేవస్థానం కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు.


తిరుపతి (ప్రజా అమరావతి);

ప్రపంచంలో ఏ ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకుగాను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంగ్లాండ్ కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. 

శనివారం తిరుమలలో టిటిడి పాలకమండలి అధ్యక్షులు 

శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి ఆ సంస్థ భారత దేశ అధ్యక్ష్యులు శ్రీ సంతోష్ శుక్ల తరపున దక్షిణ భారత దేశ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఈ సర్టిఫికెట్ అందజేశారు.


   ఈ సందర్భంగా ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ,  తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భక్తులకు సేవలు, సదుపాయాలు అందిస్తోందన్నారు. టిటిడి లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది అందరూ తాము దేవుడి సేవ చేస్తున్నామనే భక్తిభావంతో కష్ట పడి పని చేస్తున్నందువల్లే టిటిడికి ఈ గుర్తింపు వచ్చిందని చైర్మన్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు ఉద్యోగులందరికీ అభినందనలు తెలియజేసిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి గారు.