నలుగురికి విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం అని మునిసిపల్ కమిషనర్ టి. రవికుమార్ పేర్కొన్నారు.కొవ్వూరు (ప్రజా అమరావతి);నలుగురికి విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం అని మునిసిపల్ కమిషనర్ టి. రవికుమార్ పేర్కొన్నారు.స్థానిక జిల్లా గ్రంధాలయ సంస్థ శాఖా లో ఆదివారం  నిర్వహించిన 54వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలకు ముఖ్య అతిధిగా ఆయన హాజరయ్యారు.  ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, గ్రంధాలయాల అభివృద్ధి కి ప్రభుత్వం అందించే తోడ్పాటుతోపాటు ప్రజల సహాయ సహకారాలు ఉండాలి. విద్యా వంతులైన యువకులు, ప్రజాప్రతినిధులు కలసి పనిచేస్తే ఎలాంటి అభివృద్ధినైనా సాధించగలమన్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి గ్రంథాలయాల అభివృద్ధికి చేయూతనివ్వాలి.పుస్తక పఠనం పట్ల పిల్లల్లో ఆసక్తి ని పెంచేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. పుస్తక పఠనం ద్వారా ప్రతీ మనిషి సత్ప్రవర్తన పొందగలరని, ఉన్నత స్థాయి కి చేరుకోవడానికి ఒక మార్గాన్ని గ్రంధాలయలు ఎంతో తోడ్పాటు ఇస్తాయని మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ సీహేచ్ రమణ తెలిపారు.  ఈరోజు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న నాయకులు, అధికారులు 80 శాతం పైగా గ్రంధాలయాల్లోనే చదువుకోవడం జరిగిందన్నారు. జవహర్ లాల్ నెహ్రు, అబ్దుల్ కలాం, అంబేద్కర్ వంటి వారే ఉదాహరణ అన్నారు. పిల్లల్లో మేధా శక్తిని పెంచే గ్రంథాలయాలు గొప్ప వరం లాంటివన్నారు. అక్కడ ఎన్నో విజ్ఞాన వంతమైన పుస్తకాలు, గ్రంధాలు అందుబాటులో ఉంటాయని, వాటి సేవలను విద్యావంతులైన ప్రతీ ఒక్కరు సద్వినియోగపరచుకోవాలన్నారు.


తొలుత గ్రంధాలయం ప్రాంగణంలో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


ఈ కార్యక్రమంలో లైబ్రరీయన్ జీవివిఎన్.త్రినాధ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.