విజయవాడ (ప్రజా అమరావతి);
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేవలం ఒకే ఒక్క రూపాయితో పేదలందరికీ ఇళ్లు అందించిన ఘనత
ఆయనకే దక్కుతుందని ఏపీ టిడ్కో ఛైర్మన్ జమ్మన ప్రసన్న కుమార్ అన్నారు. మంగళవారం నాడు ఏపీ టిడ్కో డైరెక్టర్లుగా ప్రతివాడ రాఘవరావు, శ్రీమతి కానూరి నాగేశ్వరి చేత ఛైర్మన్ ప్రసన్న కుమార్ విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్ట్ లోని టిడ్కో కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.... పండగ వాతావరణంలో ఏపీ టిడ్కో డెరెక్టర్ల ప్రమాణ స్వీకారం జరిగిందన్నారు. 88 మునిసిపాలిటీలలో, 13 జిల్లాల్లో టిడ్కో కార్యక్రమం నిర్విగ్నంగా జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని తెలిపారు. గతంలో ఇళ్ల నిర్మాణంలో చాలా చోట్ల ఆలస్యం అయ్యేదని, గతంలో 300 చదరపు అడుగుల స్థలానికి 2లక్షల 65 వేల రూపాయలు కట్టాల్సి వచ్చేదని తెలిపారు. కేటగిరి బీ కింద సింగిల్ బెడ్ రూం ఉంటే దానికి గత ప్రభుత్వం 50 వేల రూపాలుంటే దానిని 25 వేలకు తగ్గించి ప్రతి పేదవాడికి అండదండగా నిలిచారని, అలాగే 430 చదరపు అడుగుల స్థలానికి లక్ష నుంచి 50 వేలకు తగ్గించారని తెలిపారు. డైరెక్టర్లందరూ ముఖ్యమంత్రి ఆశయాల మేరకు పనిచేసి.. ప్రభుత్వానికి, సంస్థకు మరింత మంచి పేరు తీసుకురావాలని ప్రసన్న కుమార్ ఆకాక్షించారు.
నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లకు ఏపీ పైబర్ నెట్ కార్పోరేషన్ చైర్మన్ పి. గౌతం రెడ్డి, కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషు, కమ్మ కార్పోరేషన్ ఛైర్మన్ టి. చంద్రశేఖర్, ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ తాతినేని పద్మావతి, ఎస్సీ మాదిగ కార్పోరేషన్ ఛైర్మన్ కనకారావు మాదిగ తదితరులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో ఎండీ చిట్టూరి శ్రీధర్(ఐఏఎస్). స్థానిక నాయకులు దేవినేని అవినాష్, అన్నే వేణుగోపాల రావు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment