*ప్రత్యేక ఓటరు సవరణను సజావుగా చేపట్టండి
:-*
*అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అన్ని పోలింగ్ స్టేషన్లకు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించండి :-*
*ఓటు నమోదుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు :-*
*1 జనవరి 2022 వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించండి :-*
*రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ కమిషనర్ మరియు ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ కె.శారదా దేవి :-*
కర్నూలు, నవంబర్ 25 (ప్రజా అమరావతి):-
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని సజావుగా చేపట్టాలని రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ కమిషనర్ మరియు ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ కె.శారదా దేవి పేర్కొన్నారు.
గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం 2022లో భాగంగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్ ఓలు, ఏఈఆర్ ఓలతో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ కమిషనర్ మరియు ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ కె.శారదా దేవిలు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) తమీమ్ అన్సారీయా, డిఆర్ఓ పుల్లయ్య, కర్నూలు ఆర్ డిఓ హరిప్రసాద్, నంద్యాల ఇన్చార్జి ఆర్ డిఓ మల్లికార్జునుడు, ఆదోని ఆర్ డిఓ రామకృష్ణ రెడ్డి, జెడ్పి సీఈఓ వెంకటసుబ్బయ్య, జిల్లా ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ కమిషనర్ మరియు ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ కె.శారదా దేవి మాట్లాడుతూ....అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అన్ని పోలింగ్ స్టేషన్లకు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి గ్రామాల్లో, పట్టణాల్లో 1 జనవరి 2022 వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలని కోరారు. నవంబరు 30వ తేదీ వరకు ఓటు నమోదు చేసుకొనుటకు గడువు ఉందని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ముఖ్యంగా విద్యార్థులు, యువత ఉపయోగించుకొని ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. ఓటరుగా నమోదు కావడం వల్ల ఒక పౌరుడిగా ఒక రాజ్యాంగబద్ధమైన విధానంలో సభ్యునిగా చేరిన సంతృప్తి ఉంటుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల సవరణ కార్యక్రమంలో ఏవైనా సవరణలు, ఫిర్యాదులు ఉంటే రోల్ అబ్జర్వర్ వారికి తెలియజేయాలన్నారు. ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. ఈ ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమంలో జిల్లాలోని 3788 పోలింగ్ స్టేషన్లలో 3788 బీఎల్‌వోలు ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం చేపట్టాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు మాట్లాడుతూ....ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం 2022లో 01-11-2021 నుంచి 24-11-2021 తేది నాటికి క్లైమ్ మరియు అభ్యంతరాలు ఫారం 6-13070, ఫారం 7-4151 ఫారం 8-1858, ఫారం 8A-639, మొత్తం 19,718 పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే క్లియర్ చేయాలని ఈ ఆర్ ఓ, ఏ ఈ ఆర్ ఓలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 30 తేదీ లోపు ఓటర్ జాబితా క్లైమ్, అభ్యంతరాలు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు. క్లెయిమ్ అభ్యంతరాల తొలగింపు డిసెంబర్ 20 నాటికి పూర్తి చేయాలన్నారు. 1-5 -2022 ఎలక్టోరల్ రోల్ యొక్క తుది ప్రచురణ చేయాలని ఈ ఆర్ ఓ, ఏఈ ఆర్ ఓలను ఆదేశించారు.
అంతకుమునుపు డి ఆర్ ఓ పుల్లయ్య....ఈనెల 20, 21 తేదీల్లో జిల్లాలోని 3788 పోలింగ్ కేంద్రాలలో ఓటు నమోదు స్పెషల్ డ్రైవ్ లో 6-7569, ఫారం 7-896 ఫారం 8-928, ఫారం 8A-402 క్లైమ్, అభ్యంతరాలు వచ్చాయని, అందరు కూడా గరుడ యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయ్యారని జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్ ఓలు, ఏఈఆర్ఓలు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment