వ్యాక్సినేషన్‌ ప్రతి ఒక్కరూ వేసుకునేలా క్షేత్రస్థాయిలో

 


నిడదవోలు (ప్రజా అమరావతి);


వ్యాక్సినేషన్‌ ప్రతి ఒక్కరూ వేసుకునేలా క్షేత్రస్థాయిలో


సిబ్బంది అందరూ సమన్వయంతో కూడి సహకరించాలని ఆర్డీవో ఎస్. మల్లిబాబు స్పష్టం చేశారు.


సోమవారం నిడదవోలు  రెవెన్యూ, సచివాలయ, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య శాఖ ల క్షేత్రస్థాయి సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, నిడదవోలు 

మండలంలోని అన్ని గ్రామాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను వందశాతం పూర్తి చేసేందుకు అంద రూ సహకరించాలని కోరారు. గ్రామాల్లో వందశాతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయిందని పేర్కొన్న వాటిని నిర్ధారణ చేసుకోవలసి ఉంటుందన్నారు. ఓటర్ల జాబితా, గ్రామంలో వ్యాక్సిన్ వేసుకున్న వారి వివరాలతో డేటా క్రోడీకరించి నివేదిక ఆధారంగా ఇంటింటి సర్వే చెయ్యాలని తెలిపారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందించడంలోను, అవగాహన పెంచే దిశలో  కృషి చేసిన సచివాలయ,  వైద్య, రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని  అభినందించారు. కరోనాను కట్టడి చేసేందుకు సామాజిక బాధ్యతగా యువత 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని , వేసుకొని వాళ్ళకి కూడా అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.స్పెషల్ డ్రైవ్‌ల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి కొవ్వూరు డివిజన్ ను ప్రధమ స్థానంలో నిలుపుదామని పేర్కొన్నారు.


తహసిల్దార్, ఇతర మండల స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.