అజ్ఞాన చీకట్లు తొలగించే..విజ్ఞాన దీపాల తేజోత్సవం.. దీపావళి శుభాకాంక్షలు: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

 *అజ్ఞాన చీకట్లు తొలగించే..విజ్ఞాన దీపాల తేజోత్సవం.. దీపావళి శుభాకాంక్షలు: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


*అమరావతి, నవంబర్, 03 (ప్రజా అమరావతి); "ఒకొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు..ఒకొక్క అడుగు ముందుకు వేసి  ప్రతి ఒక్కరూ గొప్ప జీవితాన్ని సాధించుకోవాలంటూ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు వెల్లడించారు. దీపావళి.. అంటే చెడుపై మంచి సాధించినందుకు విజయకేతనం.. అవనికంతా ఆనంద విజయోత్సాహం.. అజ్ఞానపు చీకట్లు తొలగించే.. విజ్ఞాన దీపాల తేజోత్సవంగా ఆయన అభివర్ణించారు. అంతరంగంలో అంధకారాన్ని అంతం చేసి  తమను తాము వ్యక్తిత్వం వెలుగులీనేలా తీర్చిదిద్దుకోవాలని మంత్రి మేకపాటి ఆకాంక్షించారు. పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో ఆనందంగా, ఆరోగ్యంగా దీపావళి పండగ సంబరాలు జరుపుకోవాలని మంత్రి గౌతమ్ రెడ్డి పిలుపునిచ్చారు.