వరద ప్రాంతాలలో కాకాణి పర్యటన.

  వరద ప్రాంతాలలో కాకాణి పర్యటన.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం (ప్రజా అమరావతి);                             

భారీ వర్షాలు కురుస్తున్నందున వర్షపు నీరు ప్రవహిస్తున్న లోతట్టు కాలనీలతోపాటు, చెరువుల పరిస్థితిని పరిశీలించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి . భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి.


అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, అవసరమైన భోజన, వసతి సదుపాయాలు కల్పించాలి.


 చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, గండ్లు పడకుండా, చెరువులకు హాని కలగకుండా చర్యలు తీసుకోవాలి.


 ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం.

 ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందకుండా, భారీగా వర్షాలు కురుస్తున్నందున జాగ్రత్తగా వ్యవహరించాలి.