శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం పాలకమండలి సమావేశం నందు పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే ...

 మంగళగిరి (ప్రజా అమరావతి)! శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం పాలకమండలి సమావేశం నందు పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే ...*





ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆర్కే  మాట్లాడుతూ దేవాలయం యొక్క ఆస్తుల పరిరక్షణ లో భాగంగా మంగళగిరి బైపాస్ రోడ్ వద్దగల దేవస్థానానికి సంబంధించిన 1.80 సెంట్లు మరియు 36 సెంట్ల కు ప్రహరీ గోడ నిర్మించాలని మరియు నాలుగు కాళ్ల మండపం వద్ద ఉన్న ఆంజనేయ స్వామి వారికి చిన్న మందిరం నిర్మించాలని నిత్యపూజలు జరగాలని అన్నారు.


అలాగే చీకటి కోనేరు ని, పెద్ద కోనేరుల్ఓని నీళ్లు తోడించి అభివృద్ధి చేయాలని అన్నారు.


దేవస్తానము యొక్క ఆస్తుల వివరాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా దేవస్థానం ఆవరణలో ఏర్పాటు చేయాలని అన్నారు. 


రానున్న కాలంలో దేవస్థానం పవిత్రతను కాపాడడానికి దేవస్థానం మాడవీధుల్లో ప్రజలు ఎవరు పాదరక్షలు వేసుకుని నడవకూడదు అని అన్నారు.


అనంతరం చీకటి కోనేటి లో ఉన్న వినాయకుడిని దర్శించుకున్నారు...

Comments