సిపిఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

 తాడేపల్లి .. నవంబర్ 07 (ప్రజా అమరావతి);.

*సిపిఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి


.*

*- గుంటూరు తూర్పు జిల్లా సిపిఎం కార్యదర్శి పాశం రామారావు.*

 తాడేపల్లి పట్టణంలో బైపాస్ సియస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగే సిపిఎం 26 రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. ఈ రోజు ఉదయం పట్టణలో నేతాజీ సెంటర్ లో ప్రచారం ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలకు అందరూ సహకరించాలని కోరారు. మహసభలు ప్రచారంతో పాటు నిధి సేకరణ కార్యక్రమాన్ని రామారావు ప్రారంభించారు.

  ఈ రోజు ఐదు దళాలుగా సిపిఎం కార్యకర్తలు ఇంటింటికి తిరిగి మహసభల చేతి ప్రతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బూరుగ వెంకటేశ్వర్లు, గాదె సుబ్బారెడ్డి, కొట్టె కరుణాకరరావు, సోలా ముత్యాలరావు, యనమాల బర్న, పి.గిరిజ, బూరుగ శ్రీనివాసరావు, గంజి శ్రీనివాసరావు, కోటబాబురావు, దర్శినపు విజయ్, విశాలాంధ్ర, బిట్ర రామారావు, మేరీ తదితరులు పాల్గొన్నారు.