ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయ



కొవ్వూరు డివిజన్ (ప్రజా అమరావతి):  


కొవ్వూరు డివిజన్ పరిధిలో స్థానిక సంస్థలకు నిర్వహించిన పెనుగొండ జెడ్పిటిసి, ఆరు ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయ


ని ఆర్డీవో ఎస్. మల్లిబాబు మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు.


మొత్తం ఆరు ఎంపిటిసి స్థానాలకు జరిగిన ఓటింగ్ లో 15871 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉండగా మొత్తం . 11510 (శాతం 72.52%) మంది తమ ఓటుహక్కు ను వెయ్యడం జరిగిందన్నారు. ఈనెల 18 గురువారం ఎంపిటిసి ల ఓట్ల లెక్కింపు సంబంధించినఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణాల్లో జరుగుతుందన్నారు. , ఇప్పటికే కౌంటింగ్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చెయ్యడం జరిగిందన్నారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తదుపరి పోలీసు భద్రత తో స్ట్రాంగ్ రూములకు తరలించి సీల్ వేశారని తెలిపారు. 



పెనుగొండ జడ్పిటిసి కి చెందిన బ్యాలెట్ బాక్స్ లను పెనుగొండ జనార్ధన స్వామి కళ్యాణ మండపంలో స్ట్రాంగ్ రూమ్ లకు తరలించి భద్రపరచారు. ఈ నెల 18 న ఓట్లు లెక్కించనున్నారని తెలిపారు.


ఎంపీటీసీ స్థానాలకు మండలాలు వారీగా పోలైన ఓట్లు :


ఇరగవరం మండలంలో కె. కుముదవల్లి లో  రెండు పోలింగ్ కేంద్రాల పరిధిలో 1711 మంది ఓటర్లు  పోలైన ఓట్లు 1371 ( 80.12 %)

పురుషులు 660 స్త్రీలు 711



అత్తిలి మండలం .. ఈడురు లో 3 పోలింగ్ కేంద్రాల లో 1947 మంది ఓటర్లు పోలైన ఓట్లు 1557  (79.97 %) 

పురుషులు 785 స్త్రీలు 772


అత్తిలి మండలం .. పాలూరు  లో రెండు పోలింగ్ కేంద్రాల లో 2409 మంది ఓటర్లు ... పోలైన ఓట్లు 1899 ( 78.83 %) 

 పురుషులు 990   స్త్రీలు 909


పెరవలి మండలం కానూరు-2 

 మూడు పోలింగ్ కేంద్రాల పరిధిలో 2783 మంది ఓటర్లు పోలైన ఓట్లు 2027  ( 72.84 %) పురుషులు 1011  స్త్రీలు 1016 


నిడదవోలు మండలంలో తాళ్లపాలెం లో  ఐదు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓట్లు..3593  పోలైన ఓట్లు 2759  ( 76.79 %) 

పురుషులు 1376   స్త్రీలు 1383


చాగల్లు మండలంలో చాగల్లు-5 కి  నాలుగు పోలింగ్ కేంద్రాల లో 3428 ఓటర్లు పోలైన ఓట్లు 1897 (  55.34 %)  

పురుషులు 902  స్త్రీలు 995




పెనుగొండ మండలం జెడ్పిటిసి స్థానానికి పోలైన ఓట్లు : 


పెనుగొండ జెడ్పి టిసి స్థానానికి మండల పరిధిలోని 63 పోలింగ్ కేంద్రాల లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఓటర్లు  56598 , అందులో పోలైన ఓట్లు 38,210  (  67.51  శాతం )

పురుషులు 18,783 ;  స్త్రీలు 19,427



Comments