శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం రాఘవేంద్ర స్వామి బృందావనం దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిశ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం రాఘవేంద్ర స్వామి బృందావనం దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి 
శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామిజీ ఆశీర్వచనం తీసుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి :-


కర్నూలు, నవంబర్ 13 (ప్రజా అమరావతి):-


కర్నూలు నగరంలోని తుంగభద్ర నది ఒడ్డున వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం రాఘవేంద్ర స్వామి బృందావనంను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శనివారం  దర్శించుకున్నారు.


ముందుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను మంగళవాయిద్యాల నడుమ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోకి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామిజీ ఆశీర్వచనం తీసుకున్నారు.


ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రాణా ప్రతాప్, కర్నూలు ఆర్ డి ఓ హరి ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు నాయుడు, జె వి ఓ సుధాకర్ రెడ్డి, ఏఏఓ మాధవ్ సెట్టి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్, అసిస్టెంట్ మేనేజర్ పిఆర్ ఓ నరసింహ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.