శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి,

 శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి,


విజయవాడ (ప్రజా అమరావతి):   భవానీ దీక్షలు -2021 సందర్భంగా  మల్లిఖార్జున మహామండపము 6 వ అంతస్తు నందు  ఆలయ పాలక మండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు  మరియు శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ , స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ   మరియు వైదిక కమిటీ సభ్యుల వారి ఆధ్వర్యములో  ప్రెస్ మీట్ నిర్వహించబడినది. ఈ సందర్భంగా చైర్మన్  మరియు కార్యనిర్వాహణాధికారి  మరియు ఆలయ స్థానాచార్యులు వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం భవాని దీక్ష సమయ వివరములు, భక్తులు పాటించవలసిన నియమములు మరియు కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తుల సౌకర్యార్థం చేయు ఏర్పాట్లు గురించి వివరించారు. అనంతరం భవానీ దీక్షల గోడ పత్రికలు మరియు కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైదిక కమిటీ సభ్యులు శ్రీ ఆర్.శ్రీనివాస శాస్త్రి , ఉపకార్యనిర్వాహక ఇంజినీర్ వార్లు, సహాయ కార్య నిర్వహణాధికారి వార్లు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments